EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tirumala-577a1aaa-5a95-42ee-836c-5cb41130e6fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tirumala-577a1aaa-5a95-42ee-836c-5cb41130e6fe-415x250-IndiaHerald.jpgతిరుమల తిరుపతి అనేది ఒక కలియుగ పుణ్య క్షేత్రం. ఎంతోమంది భక్తులు దేశ విదేశాల నుండి నిత్యం ఆయనను దర్శించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. తమకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందిస్తాడనే నమ్మకంతోనూ, తమకు ముక్తిని, మనశ్శాంతిని కలిగిస్తాడనే నమ్మకంతోనూ ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. తమకు ఎంతో ఇచ్చిన ఆ దేవుడికి తమ వంతుగా కొంత విరాళాన్ని అందిస్తూ సంతృప్తి చెందుతూ ఉంటారు. అయితే భక్తులు ఇచ్చిన ఈ విరాళాలను తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి భక్తులకు అయినా ఖర్చు పెట్టాలి. లేదా తిరుమల తిరుపతికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాలకైనా ఖtirumala {#}Tirupati;Tirumala Tirupathi Devasthanam;Reddy;Bharatiya Janata Partyతిరుమల బాలాజీ నిధులు పక్కదారి పడుతున్నాయా?తిరుమల బాలాజీ నిధులు పక్కదారి పడుతున్నాయా?tirumala {#}Tirupati;Tirumala Tirupathi Devasthanam;Reddy;Bharatiya Janata PartySat, 09 Sep 2023 07:00:00 GMTతిరుమల తిరుపతి అనేది ఒక కలియుగ పుణ్య క్షేత్రం. ఎంతోమంది భక్తులు దేశ విదేశాల నుండి నిత్యం ఆయనను దర్శించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. తమకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందిస్తాడనే నమ్మకంతోనూ, తమకు ముక్తిని, మనశ్శాంతిని కలిగిస్తాడనే నమ్మకంతోనూ ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. తమకు ఎంతో ఇచ్చిన ఆ దేవుడికి తమ వంతుగా కొంత విరాళాన్ని అందిస్తూ సంతృప్తి చెందుతూ ఉంటారు.


అయితే భక్తులు ఇచ్చిన ఈ విరాళాలను తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి భక్తులకు అయినా ఖర్చు పెట్టాలి. లేదా తిరుమల తిరుపతికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాలకైనా ఖర్చు పెట్టాలి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎన్ని విరాళాలు వచ్చినా, ఎంత ఆస్తులు సమకూరినా కూడా అక్కడ భక్తులకు ఉచిత లడ్డూలు కూడా ఇవ్వడం లేదు. భక్తులకు వసతి కార్యక్రమాలు కూడా సరిగా ఏర్పాటు చేయడం లేదు.


అక్కడికి వచ్చే భక్తులు ఇవన్నీ కొనుగోలు చేయడం వల్లే కదా అక్కడ చాలామందికి ఉపాధి అవకాశాలు  దొరుకుతున్నాయి. అలాంటి సందర్భంలో ఆ నిధులను పక్కదోవ పట్టించడం అనేది ఎంత వరకు కరెక్ట్ అని భారతీయ జనతా పార్టీ అడిగినట్లు తెలుస్తుంది. దీనిపై దేవస్థానం సమాధానం చెప్పాలి. లేదంటే  టీటీడీ ఛైర్మన్‌ కరుణాకర్‌ రెడ్డి సమాధానం చెప్పాలి అని అంటున్నారు. ముందు దేవస్థానం ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వర్తించగలగాలి.


కానీ అవేవీ జరగకపోగా దేవస్థానం నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  1500మంది మున్సిపల్ కార్మికులకు టీటీడీ దేవస్థానం నుండి జీతాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారన్నట్లుగా తెలుస్తుంది. అంతే కాకుండా టీటీడీకి సంబంధించిన స్థలాలను కుల కార్పొరేషన్ లకు ఇవ్వడానికి  సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. దేవస్థానం నిధుల నుంచి టీటీడీ ఉద్యోగులకు, కార్మికులకు ఏదైనా  చేయడంలో తప్పులేదు. కానీ టీటీడీ కార్పొరేషన్ కు సంబంధించిన వ్యక్తులకు  టీటీడీ నిధులను మళ్లించడం మాత్రం చాలా తప్పు అని భావిస్తున్నారు చాలా మంది. టీటీడీ యాక్ట్ ఆఫ్ 30 1987 ప్రకారం టీటీడీ నిధులను టీటీడీ వాళ్లకే ఖర్చు పెట్టాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బైక్ పై కూర్చుని ఆ అందాలను చూపిస్తున్న ఈషా రెబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>