MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/atlee824b6079-e13f-4eda-901c-437a14259c01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/atlee824b6079-e13f-4eda-901c-437a14259c01-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బాలీవుడ్ లో కోలీవుడ్ ఇన్ డైరెక్టర్ అట్లీ పేరు మార్మోగిపోతుంది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో ఈ దర్శకుడు తెరకెక్కించిన జవాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని ఈ డైరెక్టర్ ని నార్త్ ఆడియన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. అలాంటి అట్లీ గురించి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1986 సెప్టెంబర్ 21న తమిళనాడులో ఓ గ్రామంలో జన్మించిన అట్లీ అసలు పేరు అరుణ్ కుమార్. సంచల దర్శకుడు శంకర్ దగ్గర 'రోబో', 'స్నేహితుడు' సినిమాలకు అసిస్టెంట్ Atlee{#}Dalapathi;Joseph Vijay;Mass;atlee kumar;Jawaan;Audience;Kollywood;bollywood;Tamil;september;Darsakudu;Director;Cinemaబాలీవుడ్ లో సత్తా చాటిన కోలీవుడ్ డైరెక్టర్.. అట్లీ కి అన్ని చోట్లా హిట్లే!బాలీవుడ్ లో సత్తా చాటిన కోలీవుడ్ డైరెక్టర్.. అట్లీ కి అన్ని చోట్లా హిట్లే!Atlee{#}Dalapathi;Joseph Vijay;Mass;atlee kumar;Jawaan;Audience;Kollywood;bollywood;Tamil;september;Darsakudu;Director;CinemaSat, 09 Sep 2023 09:46:39 GMTప్రస్తుతం బాలీవుడ్ లో కోలీవుడ్ ఇన్ డైరెక్టర్ అట్లీ పేరు మార్మోగిపోతుంది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో ఈ దర్శకుడు తెరకెక్కించిన జవాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని ఈ డైరెక్టర్ ని నార్త్ ఆడియన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. అలాంటి అట్లీ గురించి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1986 సెప్టెంబర్ 21న తమిళనాడులో ఓ గ్రామంలో జన్మించిన అట్లీ అసలు పేరు అరుణ్ కుమార్. సంచల దర్శకుడు శంకర్ దగ్గర 'రోబో', 'స్నేహితుడు' సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత 2011లో 'మూగపుతగమ్' అనే షార్ట్ ఫిలిం తీసి మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ షార్ట్ ఫిలిం రెస్పాన్స్ తో మరో అడుగు ముందుకేసి సినిమాకి శ్రీకారం చుట్టాలనుకున్నాడు.

 ఈ క్రమంలోనే అట్లీ 'రాజా రాణి' కథను రాసుకున్నారు. ఆర్య, జై, నయనతార, నజ్రియా ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ 2013లో తమిళం తో పాటు అదే టైటిల్తో తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. రూ.25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.84 కోట్ల వసూలు రాబట్టింది. ఈ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా కోలీవుడ్కు చెందిన 'విజయ్' అవార్డు అందుకున్నారు అట్లీ. ఇక 'రాజారాణి' తర్వాత దళపతి విజయ్ 'తేరి' 2016 లో విడుదలైంది. 'పోలీసోడు' పేరుతో తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా ఆకట్టుకుంది.రూ. 75 కోట్లతో నిర్మితమైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అట్లీకి 'సైమా' పురస్కారం దక్కింది. ఇక ఆ తర్వాత వచ్చిన యాక్షన్ మూవీ 'మెర్సల్' తెలుగులో కూడా అదరగొట్టింది. సుమారు రూ.120 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ రూ.200 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది.

ఈ సినిమాకి కూడా బెస్ట్ డైరెక్టర్ గా 'సైమా' అవార్డు అందుకున్నారు. ఇక ఆ తర్వాత తన విజయ్తో 'బిగిల్' రూపంలో మరో విజయాన్ని సాధించారు. 180 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.280 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇలా నాలుగు సినిమాల అనుభవంతోనే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ డైరెక్ట్ చేసే అవకాశం అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు అట్లీ.అలా షారుక్ ఖాన్ తో 'జవాన్' సినిమాను తెరకెక్కించగా, సెప్టెంబర్ 7న విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాలో షారుక్ ని ఎవరూ చూపించని మాస్ గెటప్స్ లో చూపించి అదరగొట్టేసారు. దీంతో షారుక్ ఫ్యాన్స్ ఈ విషయంలో అట్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలీవుడ్లో 'జవాన్' అట్లిని డైరెక్టర్గా మరో స్థాయికి తీసుకెళ్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బైక్ పై కూర్చుని ఆ అందాలను చూపిస్తున్న ఈషా రెబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>