Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lhushi4a5108bb-6ecb-4daf-975f-3e84a7dffa97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lhushi4a5108bb-6ecb-4daf-975f-3e84a7dffa97-415x250-IndiaHerald.jpgఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే సినిమాలు అయితే చేస్తున్నాడు. కానీ ఎందుకో గత కొంతకాలం నుంచి సరైన విజయాలు మాత్రం సాధించలేకపోతున్నాడు. అయితే ఇటీవల శివా నిర్వాన దర్శకత్వంలో తెరకేక్కిన ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో రౌడీ హీరో సరసన హాట్ బ్యూటీ సమంత హీరోయిన్గా నటించింది. అయితే ఇక భారీ అంచనాల మధ్య విడLhushi{#}tuesday;thursday;Joseph Vijay;wednesday;vijay deverakonda;BEAUTY;kushi;Kushi;Tollywood;Cinema;Telugu;Heroహిట్ టాక్ వచ్చింది.. కానీ 'ఖుషి'కి బ్రేక్ ఈవెన్ కష్టమేనా?హిట్ టాక్ వచ్చింది.. కానీ 'ఖుషి'కి బ్రేక్ ఈవెన్ కష్టమేనా?Lhushi{#}tuesday;thursday;Joseph Vijay;wednesday;vijay deverakonda;BEAUTY;kushi;Kushi;Tollywood;Cinema;Telugu;HeroSat, 09 Sep 2023 12:15:00 GMTఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే సినిమాలు అయితే చేస్తున్నాడు. కానీ ఎందుకో గత కొంతకాలం నుంచి సరైన విజయాలు మాత్రం సాధించలేకపోతున్నాడు. అయితే ఇటీవల శివా నిర్వాన దర్శకత్వంలో తెరకేక్కిన ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో రౌడీ హీరో సరసన హాట్ బ్యూటీ సమంత హీరోయిన్గా నటించింది. అయితే ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక చాలా రోజుల తర్వాత అటు సమంతకి ఇటు విజయ్ దేవరకొండ కి ఒక సూపర్ హిట్ దక్కింది అని అభిమానులు కూడా అనుకున్నారు. అయితే మొదటి రోజు నుంచి హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంది. కానీ ఎందుకో ఖుషి సినిమాకి అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రావడం లేదు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూస్తూ ఉంటే కేవలం హిట్ టాక్ అనేది మాటలకు మాత్రమే పరిమితమైంది. కలెక్షన్ల పరంగా మాత్రం నష్టాలు మిగిలే లాగే కనిపిస్తున్నాయి అన్నది తెలుస్తుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో 1.05 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది ఖుషి సినిమా.


 మంగళవారం 75 లక్షల షేర్, బుధవారం 47 లక్షల షేర్, ఏడో రోజు అయిన గురువారం కేవలం 36 లక్షల షేర్ మాత్రమే రాబట్టగలిగింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 53.5 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగిన ఖుషి సినిమా ఫస్ట్ వీక్ పూర్తి అయ్యేసరికి 38.30 కోట్ల షేర్ మాత్రమే వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే 72% రికవరీ అయింది. అయితే రోజురోజుకీ అటు వసూళ్లు తగ్గిపోతున్న నేపథ్యంలో ఇదే ట్రెండ్ కొనసాగితే ఇక ఖుషి సినిమా బ్రేక్ ఈవెన్ దాటడం కూడా కష్టమే అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సూసైడ్ చేసుకున్న యువకుడు.. కారణం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>