PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-jagan00029075-6895-49cf-9a7e-4b6ff9f1142f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-jagan00029075-6895-49cf-9a7e-4b6ff9f1142f-415x250-IndiaHerald.jpgఇలాంటి ఆరోపణలు, విమర్శలను దాటి జగన్ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అనాల్సిన అవసరం చంద్రబాబుకు ఏమొచ్చిందో అర్ధంకావటంలేదు. తన ఆరోపణకు చంద్రబాబే వివరణిస్తే బాగుంటుంది. అప్పుడెప్పుడో లోకేష్ పుట్టుక గురించి వంశీ కామెంట్ చేశారు. నిజానికి అప్పట్లో వంశీ చేసిన కామెంటే చాలా తప్పు. తన పార్టీ ఎంఎల్ఏ వంశీ చేసిన కామెంటును చంద్రబాబు వైసీపీకి ఆపాదించారు. అసెంబ్లీలో ఇదే విషయమై ఊగిపోయి వైసీపీని అమ్మనాబూతులు తిట్టారు.chandrababu jagan{#}gannavaram;Jagan;Reddy;CBN;Lokesh;Lokesh Kanagaraj;MLA;YCP;Wife;media;vamsi;london;Partyరాయలసీమ : చంద్రబాబు ఇంతగా దిగజారిపోయారా ?రాయలసీమ : చంద్రబాబు ఇంతగా దిగజారిపోయారా ?chandrababu jagan{#}gannavaram;Jagan;Reddy;CBN;Lokesh;Lokesh Kanagaraj;MLA;YCP;Wife;media;vamsi;london;PartySat, 09 Sep 2023 07:00:00 GMT

కోడలికి బుద్ధిచెప్పి అత్త తెడ్డునాకిందనే సామెత చంద్రబాబునాయుడుకు సరిగ్గా సరిపోతుంది. అప్పుడెప్పుడో గన్నవరం టీడీపీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలకు ఇపుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఏమీ తేడాలేదు. తాను వంశీ ఒకటే అని చంద్రబాబు నిరూపించుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే అనంతపురంలో ఒక మీటింగులో చంద్రబాబు మాట్లాడుతు ‘జగన్మోహన్ రెడ్డి పుట్టుకే తప్పుడు పుట్టుక’ అని అన్నారు. పుట్టుకేంటి తప్పుడు పుట్టుకేంటి అన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు.





జగన్ గురించి చంద్రబాబు ఏమి చెప్పాలని అనుకుని ఏమిచెప్పారు అన్నది ఎవరికీ అర్ధంకాలేదు. జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు చేయాల్సిన ఆరోపణలన్నీ చేస్తున్నారు. లండన్ కు భార్యతో కలిసి జగన్ వెళితే మెంటల్ ట్రీట్మెంట్ కోసమే వెళ్ళారని చెప్పారు. లండన్ కు దగ్గరలోనే ఉన్న కెమెన్ ఐల్యాండ్స్ లో దోచుకున్న డబ్బు దాచుకోవటానికే వెళ్ళారని ఎల్లోమీడియాలో రాయించారు. లండన్ కు సొంత ఖర్చులతోనే జగన్ విలాసవంతమైన విమానంలో వెళ్ళినట్లు ఎల్లోమీడియా వార్తలురాస్తే కాదుకాదు ప్రజాధనంతోనే ప్రత్యేక విమానంలో వెళ్ళారని ఆరోపిస్తున్నారు.





ఇలాంటి ఆరోపణలు, విమర్శలను దాటి జగన్ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అనాల్సిన అవసరం చంద్రబాబుకు ఏమొచ్చిందో అర్ధంకావటంలేదు. తన ఆరోపణకు చంద్రబాబే వివరణిస్తే బాగుంటుంది. అప్పుడెప్పుడో లోకేష్ పుట్టుక గురించి వంశీ కామెంట్ చేశారు. నిజానికి అప్పట్లో వంశీ చేసిన కామెంటే చాలా తప్పు. తన పార్టీ ఎంఎల్ఏ వంశీ చేసిన కామెంటును చంద్రబాబు వైసీపీకి ఆపాదించారు. అసెంబ్లీలో ఇదే విషయమై ఊగిపోయి వైసీపీని అమ్మనాబూతులు తిట్టారు.





తర్వాత మీడియా సమావేశం పెట్టి కన్నీళ్ళు కనబడకుండా భోరుమని ఏడ్చారు. ఊరూవాడ తిరిగి తన భార్య శీలాన్ని వైసీపీ వాళ్ళు అవమానించారని గోలగోల చేశారు. ఇదే విషయాన్ని భార్య భువనేశ్వరితో  కూడా చెప్పించారు. అయితే వీళ్ళని జనాలు ఎవరూ పట్టించుకోలేదు. పైగా చంద్రబాబు ఏడుపు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఎల్ఏ వంశీపై చంద్రబాబు ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అలాంటిది ఇపుడు జగన్ పుట్టుకే తప్పుడు పుట్టుకని అంటే వంశీకి చంద్రబాబుకు తేడా ఏముంది ?




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బైక్ పై కూర్చుని ఆ అందాలను చూపిస్తున్న ఈషా రెబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>