Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohirh69e264b4-97d0-4c5b-b00d-704754401026-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohirh69e264b4-97d0-4c5b-b00d-704754401026-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆసియా కప్ లో భాగంగా వరుసగా మ్యాచ్ లు ఆడుతుంది భారత జట్టు. ఈ క్రమంలోనే ఇటీవల పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు భారత జట్టుకు ఇటు పాకిస్తాన్ జట్టుకి చెరొక పాయింట్ వెళ్లిపోయింది. అయితే ఇక ఈ మ్యాచ్ చూసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఆతృతగా ఎదురు చూసినప్పటికీ వర్షం అంతరాయం కలిగించడంతో అందరికీ నిరాశ ఎదురయింది అని చెప్పాలి. అయితే పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో భారత టాప్ ఆర్డర్ మొత్తం దారుణమైన ప్రదర్శన చేసింది అన్న విషయం తెలిసింRohirh{#}Ravindra Jadeja;Rohit Sharma;Hardik Pandya;sunday;Varsham;Cricket;Pakistan;septemberపాకిస్తాన్ తో మ్యాచ్.. ముల్లుని ముల్లుతోనే తీయాలనుకుంటున్న రోహిత్?పాకిస్తాన్ తో మ్యాచ్.. ముల్లుని ముల్లుతోనే తీయాలనుకుంటున్న రోహిత్?Rohirh{#}Ravindra Jadeja;Rohit Sharma;Hardik Pandya;sunday;Varsham;Cricket;Pakistan;septemberFri, 08 Sep 2023 10:00:00 GMTప్రస్తుతం ఆసియా కప్ లో భాగంగా వరుసగా మ్యాచ్ లు ఆడుతుంది భారత జట్టు. ఈ క్రమంలోనే  ఇటీవల పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు భారత జట్టుకు ఇటు పాకిస్తాన్ జట్టుకి చెరొక పాయింట్ వెళ్లిపోయింది. అయితే ఇక ఈ మ్యాచ్ చూసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఆతృతగా ఎదురు చూసినప్పటికీ  వర్షం అంతరాయం కలిగించడంతో అందరికీ నిరాశ ఎదురయింది అని చెప్పాలి. అయితే పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో భారత టాప్ ఆర్డర్ మొత్తం దారుణమైన ప్రదర్శన చేసింది అన్న విషయం తెలిసిందే.


 టీమిండియా ప్లేయర్స్ ప్రదర్శన పై విమర్శలు కూడా వచ్చాయి. అయితే సెప్టెంబర్ 10వ తేదీన మరోసారి ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్మెన్ ల ప్రదర్శన ఎలా ఉంటుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. అయితే ఈసారి భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ముల్లుని ముల్లుతోనే తీయాలి అనుకుంటున్నాడట రోహిత్. పాకిస్తాన్తో జరిగిన గత మ్యాచ్లో మహమ్మద్ షమిని బరిలోకి దింపలేదు  అయితే ఇప్పుడు సూపర్ 4 లో ఆదివారం జరగబోయే మ్యాచ్లో మాత్రం షమీకి తుది జట్టులో అవకాశం ఇవ్వబోతున్నాడట.


 శార్దూల్ ఠాగూర్ స్థానంలో సీనియర్ బౌలర్ షమి కి అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ పేస్ త్రయం ఎలా అయితే భారతను ఇబ్బంది పెట్టిందో.. అదే రీతిలో భారత పేస్ త్రయంతో కూడా పాకిస్తాన్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలని రోహిత్ అనుకుంటున్నాడట. బుమ్రా, సిరాజ్ మంచి ఫామ్ లో ఉండడంతో వారికి శమీ తోడైతే ఇక భారత బౌలింగ్ కు తిరుగుండదని ఆలోచనలో ఉన్నాడట రోహిత్. ఇక వారికి తోడుగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అదనంగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక జడేజా కుల్దీప్ యాదవ్ లు తమ స్పిన్ బౌలింగ్ తో పాకిస్తాన్ ను తిప్పేసేందుకు కూడా రెడీగా ఉన్నారట. మరి రోహిత్ వ్యూహం ఎలా ఫలిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>