MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyb01eab99-20bc-41bb-83f2-9494ca6b44a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyb01eab99-20bc-41bb-83f2-9494ca6b44a1-415x250-IndiaHerald.jpgతాజాగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరొక శుభవార్తను అందిస్తూ తీసుకున్న నిర్ణయం ఎంతో మంది మహిళలకు వూరట కలిగిస్తోందని చెప్పవచ్చు. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రంలోని మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తాజాగా ఇప్పుడు మరో వంద మహిళా కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేయగా సెప్టెంబర్ 12 నుంచి అదనంగా వీటిMONEY{#}Iron;Cheque;Sex;tuesday;CM;Government;Minister;Telangana;septemberMoney: మహిళలకు శుభవార్త అందించిన ప్రభుత్వం..!Money: మహిళలకు శుభవార్త అందించిన ప్రభుత్వం..!MONEY{#}Iron;Cheque;Sex;tuesday;CM;Government;Minister;Telangana;septemberFri, 08 Sep 2023 11:00:00 GMTతాజాగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరొక శుభవార్తను అందిస్తూ తీసుకున్న నిర్ణయం ఎంతో మంది మహిళలకు వూరట కలిగిస్తోందని చెప్పవచ్చు. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రంలోని మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తాజాగా ఇప్పుడు మరో వంద మహిళా కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేయగా సెప్టెంబర్ 12 నుంచి అదనంగా వీటిని ప్రారంభించాలని కూడా సూచించారు.


ఇకపోతే ఇప్పటికే తెలంగాణలో 272 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఉండగా తాజాగా వాటి సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు 372 కు ఆ సంఖ్య పెరగనుంది. ప్రతి మంగళవారం ఈ ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేకంగా మహిళ వైద్య సిబ్బంది మాత్రమే ఉంటారు. అంతే కాదు వీటి ద్వారా ఆడవాళ్లకు ఎనిమిది రకాల ప్రధాన వ్యాధులకు సంబంధించిన చికిత్సను కూడా అందించనున్నారు. ఇకపై మహిళలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఇక్కడ చెక్ చేయించుకోవచ్చు.  రక్తపోటు, మధుమేహం, రక్తహీనత వంటి పరీక్షలతో పాటు రొమ్ము క్యాన్సర్, థైరాయిడ్ వంటి పెద్ద పెద్ద పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు.

అంతే కాదు ఆడవాళ్లలో తరచూ ఎదురయ్యే ఫోలిక్ యాసిడ్, ఐరన్ , అయోడిన్ లోపంను గుర్తించి వాటికి తగిన మందులను కూడా అందజేస్తారు.  అంతేకాదు మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు , సెల్విక్ ఇన్ఫ్లమెంటరీ వ్యాధులకు సంబంధించిన టెస్టులు,  చికిత్సలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి నెలసరి సమస్యలకు కూడా వైద్యం అందించనున్నారు. అంతేకాదు సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవగాహన కల్పించడమే కాదు అవసరమైన వారికి అల్ట్రాసౌండ్ పరీక్షలు కూడా చేస్తారు. బరువు నియంత్రణ,  యోగ,  వ్యాయామం వంటి వాటిపై అవగాహన కల్పించడం,  సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కల్పించడం వంటివన్నీ కూడా ఇక్కడ చేయనున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి యావత్ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>