Technologymurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు ఆధునిక సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులకు జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.ఆధునిక సాంకేతికతతో కార్డ్ ప్రైం సాఫ్ట్ వేర్, ఈ-స్టాంపింగ్, గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలతో ప్రజలకు మరింత సులభతరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే 23 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సేవలు అందుబాటులోకి రాregistrations{#}vegetable market;Cheque;Application;Election Commission;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Apple;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Sony;Governmentఆ వ్యవస్థలో విప్లవాత్మక మైన మార్పు తెచ్చిన జగన్ ప్రభుత్వం....!!ఆ వ్యవస్థలో విప్లవాత్మక మైన మార్పు తెచ్చిన జగన్ ప్రభుత్వం....!!registrations{#}vegetable market;Cheque;Application;Election Commission;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Apple;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Sony;GovernmentFri, 08 Sep 2023 17:56:00 GMTప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు ఆధునిక సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులకు జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.ఆధునిక సాంకేతికతతో కార్డ్ ప్రైం సాఫ్ట్ వేర్, ఈ-స్టాంపింగ్, గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలతో ప్రజలకు మరింత సులభతరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే 23 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఇకపై ఆన్‌లైన్ ద్వారా సమర్పించే వెసులుబాటు కలగనుంది. కార్డ్ ప్రైం అప్లికేషన్ ద్వారా వినియోగదారులు తమ దస్తావేజులు తామే స్వయంగా రూపొందించుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం సొంతంగా కాలిక్యులేట్ చేసుకుని ఆన్ లైన్ ద్వారా చెల్లించే సదుపాయం ప్రభుత్వం కల్పించనుంది. అనుకూలమైన సమయాల్లో రిజిస్ట్రేషన్ టైం స్లాట్ బుక్ చేసుకునే సౌలభ్యంతో పాటు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం త్వరలో రానుంది. ఈ-సైన్ సౌకర్యంతో డాక్యుమెంట్స్‌కు మరింత భద్రత చేకూరనుంది. ఎటువంటి అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పు వంటి పనులు వేగంగా జరగనున్నాయి. ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్ల నిర్మూలన కూడా సాధ్యం కానుంది.

స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలు ఆన్ లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు. స్టాంపులు కృత్రిమ కొరత, నకిలీలు, పాత తేదీల స్టాంపులకు చెల్లు చీటీ పాడతారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ (SHCL) బ్రాంచ్ లు, స్టాంపు వెండార్లు, కామన్ సర్వీస్ సెంటర్లలో (CSC) ఈ స్టాంపింగ్ సేవలు లభిస్తాయి.రాష్ట్రవ్యాప్తంగా 2500 సెంటర్ల ద్వారా ఈ- స్టాంపుల విక్రయం చేపట్టారు.దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ/వార్డు సచివాలయాల్లో సైతం పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు కల్పిస్తున్నారు. తొలి విడతగా 1680 గ్రామ/వార్డు సచివాలయాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా అప్ గ్రేడ్ చేశారు. త్వరలో మిగిలిన గ్రామ/వార్డు సచివాలయాల్లో కూడా సేవలను విస్తరిస్తారు. తద్వారా ప్రజల చెంతకే అన్ని రిజిస్ట్రేషన్ సౌకర్యాలు వస్తాయి. ముఖ్యంగా స్టాంప్ విక్రయ సేవలు, ఈసీ (ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్), సీసీ, హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ అంచనా వంటి అన్ని సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.


రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ ద్వారా జనరేట్ అయ్యే రిజిస్ట్రేషన్ దస్తావేజుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ – 2000 మేరకు పూర్తి స్థాయి చట్ట భద్రత ఉంటుందని సర్కారు వెల్లడించింది. అందుబాటులోకి రానున్న డిజిటల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఫిజికల్ డాక్యుమెంట్ తో సమానంగా డిజిటల్ రిజిస్టర్ డాక్యుమెంట్ కు గుర్తింపు ఇస్తున్నారు. ఈ-సైన్ ద్వారా మరింత భద్రత ఉంటుంది. ఆన్లైన్లోనే డాక్యుమెంట్ ఒరిజినాలిటీ వెరిఫై చేసే అవకాశం ఇస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌తో నకిలీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టినట్లే. బ్యాంకులు ఇతర సంస్థలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో వెరిఫై చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. నూతన విధానంలో అత్యంత సెక్యూరిటీ ప్రమాణాలతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రూపొందించబడుతుంది. నూతన విధానంలో సాక్షులు లేకుండా రిజిస్ట్రేషన్లు అనేది పూర్తి ‘అవాస్తవం’ అని ప్రభుత్వం తెలిపింది. ఈ ఆధార్ ద్వారా సాక్షుల సంతకాల సేకరణ ‘వాస్తవం’ అని వెల్లడించింది. నూతన రిజిస్ట్రేషన్ విధానంలో ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వరనేది పూర్తి అవాస్తవమని తెలిపింది. ఫిజికల్ డాక్యుమెంట్ కావాలన్నవారికి ఈ స్టాంప్‌పై డిజిటల్ సిగ్నేచర్ ప్రింట్ చేసి ఇస్తారు. “స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల” కు సూచనలు, ఫిర్యాదుల కొరకు జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంచారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలర్ ఫుల్ డ్రస్సులలో జాన్వీ కపూర్ క్లీవెజ్ షో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>