MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg ప్రస్తుతం ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. దీనితో ఇండస్ట్రీని వెంటాడుతున్న కథల కొరతతో ఎలాంటి సినిమాలు తీయాలో తెలియక చాలామంది దర్శక నిర్మాతలు బయోపిక్ ల బాట పడుతున్నారు. 1990 ప్రాంతాలలో దివ్య భారతి మ్యానియా అప్పటి యూత్ లో బాగా ఉండేది.వెంకటేష్ తో ఆమె కలిసి నటించిన ‘బొబ్బిలి రాజా’ బ్లాక్ బష్టర్ హిట్ కావడంతో అప్పట్లో ఆమెకు అనేకమంది టాప్ హీరోలతో నటించే అవకాశం వచ్చింది. చిరంజీవి మోహన్ బాబు బాలకృష్ణ ఇలా అప్పటితరం టాప్ హీరోలు అందరితోను ఆమె నటించి అనేక బ్లాక్ బష్టర్ హిట్స్ ను అందtamannah{#}CBN;bharathi old;dileep;dilip;Murder.;Divya Bhatnagar;Chiranjeevi;News;Chitram;Indian;bollywood;Darsakudu;Director;BEAUTY;marriage;Husband;Cinema;Indiaదివ్యభారతి ని గుర్తు చేయబోతున్న తమన్నా !దివ్యభారతి ని గుర్తు చేయబోతున్న తమన్నా !tamannah{#}CBN;bharathi old;dileep;dilip;Murder.;Divya Bhatnagar;Chiranjeevi;News;Chitram;Indian;bollywood;Darsakudu;Director;BEAUTY;marriage;Husband;Cinema;IndiaFri, 08 Sep 2023 13:03:52 GMTప్రస్తుతం ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. దీనితో ఇండస్ట్రీని వెంటాడుతున్న కథల కొరతతో ఎలాంటి సినిమాలు తీయాలో తెలియక చాలామంది దర్శక నిర్మాతలు బయోపిక్ ల బాట పడుతున్నారు. 1990 ప్రాంతాలలో దివ్య భారతి మ్యానియా అప్పటి యూత్ లో బాగా ఉండేది.


వెంకటేష్ తో ఆమె కలిసి నటించిన ‘బొబ్బిలి రాజా’ బ్లాక్ బష్టర్ హిట్ కావడంతో అప్పట్లో ఆమెకు అనేకమంది టాప్ హీరోలతో నటించే అవకాశం వచ్చింది. చిరంజీవి మోహన్ బాబు బాలకృష్ణ ఇలా అప్పటితరం టాప్ హీరోలు అందరితోను ఆమె నటించి అనేక బ్లాక్ బష్టర్ హిట్స్ ను అందుకుంది. అయితే ఆతరువాత ఆమె నటించిన సినిమాలు వరసగా ఫెయిల్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోవడంతో తిరిగి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ఆమె చివరి చిత్రం ప్రశాంత్ తో చేసిన ‘తొలిముద్దు’.


ఆతరువాత ఆమె పెళ్లి చేసుకుంది అయితే 1993లో ముంబైలోని తన సొంత అపార్ట్ మెంట్ లో జరిగిన ఒక మిడ్నైట్ ఆమె ప్రమాదవశాత్తు పైనించి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె మరణం సహజం కాదు హత్య అంటూ అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఆమె భర్త సాజిద్ నడియాడ్ వాలా ప్రమేయం గురించి కూడ అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. కాని విచారణలో ఎలాంటి నిర్ధారణకు రాకపోవడంతో ఇప్పటికీ ఆమె మరణం మిస్టరీ గానే కొనసాగుతోంది.  


ఈసంఘటన ఆధారంగా మలయాళంలో దిలీప్ హీరోగా బాంద్రా అనే సినిమా మళయాళంలో రూపొందుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా దివ్యభారతి గా నటించడానికి అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.   నేరుగా దివ్య భారతి జీవితానికి సంబంధించిన పేర్లను వాడకపోయినా అప్పటి సంఘటన ఆధారంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని చీకటి కోణాలను ఈమూవీలో చూపిస్తారని అంటున్నారు.


వాస్తవానికి  బాంద్రా  మూవీ అధికారికంగా దివ్యభారతి జీవితం మీద బయోపిక్ గా తీస్తున్నామని ఆమూవీ దర్శకుడు అరుణ్ గోపీ చెప్పనప్పటికీ మళయాళ ఫిలిమ్ ఇండస్ట్రిలో మాత్రం ఈసినిమా దివ్య  భారతి బయోపిక్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈమూవీని పాన్ ఇండియా మూవీగా నిర్మించి అన్ని భాషలలొ విడుదల చేస్తారని టాక్..  



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం హీరోయిన్లకి దిమ్మ తిరిగే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>