Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anusbka8f3ba0e7-2b88-4530-9787-2bf34d1b9f52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anusbka8f3ba0e7-2b88-4530-9787-2bf34d1b9f52-415x250-IndiaHerald.jpgనాగార్జున హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకులు ముందుకు వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది అనుష్క శెట్టి. అయితే మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో టాలీవుడ్ కుర్రకారూ చూపు మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది. అయితే ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దశాబ్ద కాలానికి పైగానే చక్రం తిప్పింది అనుష్క శెట్టి. అయితే సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిపోయి ప్రయోగం చేసింది. సినిమా హిట్ అవ్వలేదు కానీ అనుష్క కెరియర్ మాత్రం పూర్తిగా పాడైంది. అప్పటివరకు వరుస సినిమAnusbka{#}puri jagannadh;Nishabdham;zero;Bhagamathi;Nishabdam;Chakram;anoushka;Tollywood;Telugu;Mister;Hero;Cinema;Audienceఇండస్ట్రీకి వచ్చినప్పుడు నుంచి.. ఆ భయం నన్ను వెంటాడుతూనే ఉంది : అనుష్కఇండస్ట్రీకి వచ్చినప్పుడు నుంచి.. ఆ భయం నన్ను వెంటాడుతూనే ఉంది : అనుష్కAnusbka{#}puri jagannadh;Nishabdham;zero;Bhagamathi;Nishabdam;Chakram;anoushka;Tollywood;Telugu;Mister;Hero;Cinema;AudienceFri, 08 Sep 2023 09:00:00 GMTనాగార్జున హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకులు ముందుకు వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది అనుష్క శెట్టి. అయితే మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో టాలీవుడ్ కుర్రకారూ చూపు మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది. అయితే ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దశాబ్ద కాలానికి పైగానే చక్రం తిప్పింది అనుష్క శెట్టి. అయితే సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిపోయి ప్రయోగం చేసింది. సినిమా హిట్ అవ్వలేదు కానీ అనుష్క కెరియర్ మాత్రం పూర్తిగా పాడైంది.


 అప్పటివరకు వరుస సినిమా అవకాశాలతో ఊపిరి సలపానంత బిజీగా ఉన్న అనుష్క సైజ్ జీరో తర్వాత మాత్రం అవకాశాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో రోజులపాటు ఇండస్ట్రీకి దూరమైపోయింది. అయితే ఆ తర్వాత భాగమతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టిన అవకాశాలు మాత్రం రాలేదు. ఇక మధ్యలో వచ్చిన నిశ్శబ్దం సినిమా ఎవరికి వినిపించకుండా నిశ్శబ్దంగానే ఉండిపోయింది. అయితే తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నా అనుష్క.. ఇటీవల యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన మిస్ సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


 ఈ సినిమాలో ఒక చెఫ్ పాత్రలో కనిపించింది అనుష్క. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అనుష్క శెట్టికి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇండస్ట్రీకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది ఇక చిత్ర పరిశ్రమకు వచ్చిన మొదట్లో మీ ప్రయాణం ఇంత సుదీర్ఘ కాలం పాటు సాగుతుందని ఊహించారా అని అడగగా.. నా కెరియర్ ఇంతకాలం సాగుతుంది అని అసలు ఊహించలేదు. ఎలాంటి ప్రణాళికలతో నేను ఎప్పుడూ ముందుకు వెళ్లలేదు. నాకు అన్ని తెలివితేటలు కూడా లేవు. నేను చేసే ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావిస్తాను. కెరియర్ మొదట్లోనే కాదు ఇప్పుడు కూడా ఒక భయం వెంటాడుతూనే ఉంది. అదేంటంటే సెట్ లోకి వెళ్లి డైలాగ్ కరెక్ట్ గా చెప్పగలుగుతానో లేదో.. నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయగలనో లేదో అని ఇప్పటికీ భయపడుతూనే ఉంటాను అంటూ అనుష్క చెప్పింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>