DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/india18912929-0b20-45cf-b0e9-68a7c42ff72a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/india18912929-0b20-45cf-b0e9-68a7c42ff72a-415x250-IndiaHerald.jpgచైనా, పాక్ లు ప్రస్తుతం భారత్ ను ఎలాగైనా దెబ్బతీయాలని కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. చైనా ఈశాన్య రాష్ట్రాల్లోని అరుణాచల్ ప్రదేశ్ భూభాగం తమదేనని మ్యాప్ లో ప్రకటించుకోవడం, అక్కడ అలజడులు రేపి అశాంతిని కలగజేయాలని ప్రయత్నిస్తోంది. అదే సమయంలో పాకిస్థాన్ కూడా ఇదే తరహాలో ప్రయత్నాలు చేస్తుంది. పాక్ కశ్మీర్ లో అలజడులు సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. అక్కడ ఉగ్రదాడులు చేయాలని అనుక్షణం కోరుకుంటుంది. ఇప్పుడు ఖలిస్తాన్ అనే వేర్పాటు వాదులను రెచ్చగొట్టి పంజాబ్ లో హింస కు పాల్పడే విధంగా వారికి చైINDIA{#}Islamic countries;Pakistan;Punjab;Government;Indiaచైనా, పాక్‌ కలిసి భారత్‌పై కుట్ర చేస్తున్నాయా?చైనా, పాక్‌ కలిసి భారత్‌పై కుట్ర చేస్తున్నాయా?INDIA{#}Islamic countries;Pakistan;Punjab;Government;IndiaFri, 08 Sep 2023 08:00:00 GMTచైనా, పాక్ లు ప్రస్తుతం భారత్ ను ఎలాగైనా దెబ్బతీయాలని కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. చైనా ఈశాన్య రాష్ట్రాల్లోని అరుణాచల్ ప్రదేశ్ భూభాగం తమదేనని మ్యాప్ లో ప్రకటించుకోవడం, అక్కడ అలజడులు రేపి అశాంతిని కలగజేయాలని ప్రయత్నిస్తోంది. అదే సమయంలో పాకిస్థాన్ కూడా ఇదే తరహాలో ప్రయత్నాలు చేస్తుంది. పాక్ కశ్మీర్ లో అలజడులు సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు.


అక్కడ ఉగ్రదాడులు చేయాలని అనుక్షణం కోరుకుంటుంది. ఇప్పుడు ఖలిస్తాన్ అనే వేర్పాటు వాదులను రెచ్చగొట్టి పంజాబ్ లో హింస కు పాల్పడే విధంగా వారికి చైనా, పాక్ లు సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పాక్ చేసే ఇస్లామిక్ ఉగ్రవాద చర్యలు అందరికీ తెలిశాయి. అక్కడ వారు తీవ్ర వాదులను ఇచ్చే శిక్షణ తదితర కార్యక్రమాలు ప్రపంచం ముందు పాక్ పరువు పోయేలా చేసింది.


కానీ భారత్ ను దెబ్బకొట్టాలంటే పాక్ ను కాపాడాలని చైనా నిర్ణయించుకుంది. పాకిస్థాన్ లో ఉగ్రవాదులకు సహకరిస్తుందని తెలిసినా కూడా పాకిస్థాన్ ను వెనక వేస్తుంది. పాక్ వల్ల ఆ దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు ఎంతో మంది బలవుతున్నారు. కానీ చైనా, పాక్ లక్ష్యం మాత్రం భారత్ ను అన్ని రకాలుగా దెబ్బతీయడమే.


చైనా అనుకున్నంత ఈజీగా భారత్ లొంగడం లేదు. ఆర్థికంగా ప్రపంచంలో అయిదో స్థానంలోకి వచ్చేసింది. దీంతో చైనా, పాక్ లు ఎల్టీటీఏ ను మళ్లీ రెచ్చగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం. హిందు, సిక్కు, ఎల్టీటీఏ తీవ్రవాదాన్ని పెంచాలని భారత్ లో దాడులు చేసి అస్థిరత్వాన్ని తీసుకురావాలని తెగ ఆరాటపడుతున్నాయి.  వీటిన్నింటిని దాటుకుని భారత్ ముందుకు సాగుతూనే ఉంది. ప్రస్తుతం దాయాది పాక్ కంటే చైనాతో నే ఇండియాకు ఎక్కువగా ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ప్రతి నిమిషం భారత ప్రభుత్వం రెండు దేశాల తీరును కనిపెడుతూనే ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>