PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-it-modi5338cebd-0940-4660-acf5-2c9c5a0b1aa7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-it-modi5338cebd-0940-4660-acf5-2c9c5a0b1aa7-415x250-IndiaHerald.jpgమరి ఏ కోణంలో తాను అరెస్టవుతానని చంద్రబాబుకు అనుమానం వచ్చింది ? రు. 118 కోట్ల ముడుపుల వ్యవహారంలో హవాలా ? లేదా మనీల్యాండరింగ్, ఫెమా, ఆర్బీఐ చట్టాలను ఉల్లంఘించటం, కంపెనీ చట్టాల కింద అరెస్టు అవుతారేమో. ఇందులో ఏ పద్దతిలో అరెస్టయినా జగన్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. అరెస్టు, విచారణ కేంద్రపరిధిలోను, బెయిల్ లేదా రిమాండ్ అంతా కోర్టు పరిధిలోను జరుగుతుంది. chandrababu IT modi{#}118;Reddy;Andhra Pradesh;CBN;Jagan;Capital;courtఅమరావతి : మానసికంగా దెబ్బతిన్నారా ?అమరావతి : మానసికంగా దెబ్బతిన్నారా ?chandrababu IT modi{#}118;Reddy;Andhra Pradesh;CBN;Jagan;Capital;courtFri, 08 Sep 2023 05:00:00 GMT



తన అరెస్టు తప్పదని చంద్రబాబునాయుడు మానసికంగా ప్రిపేర్ అయిపోయారా అనే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే అనంతపురంలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతు ఒకటి రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారేమో అనే అనుమానాన్ని వ్యక్తంచేశారు. అసలు తన అరెస్టు తప్పదని చంద్రబాబు ఎందుకు అనుమానం వ్యక్తంచేశారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని అరెస్టుచేస్తామని రాష్ట్రప్రభుత్వం ఎప్పుడూ ప్రకటించలేదే. అనేక కుంభకోణాల్లో ప్రధాన అనుమానితుడు చంద్రబాబే అని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నా అంతా విచారణ దశల్లోనే ఉన్నాయి.





కొన్ని కేసుల్లో కోర్టు స్టే ఇచ్చింది. కాబట్టి ఇప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసే అవకాశాలు దాదాపు లేవు. అయితే గియితే ఐటి శాఖే  అరెస్టు చేయాలి. ఎందుకంటే రాజధాని అమరావతి భవనాల నిర్మాణాల్లో రు. 118 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఉన్నతాధికారులు నిర్ధారణ చేశారు కాబట్టి. అయితే ఐటి శాఖ కూడా ముడుపులు తీసుకున్నందుకు లేదా పన్ను ఎగ్గొట్టినందుకు పెనాల్టి వేసి రాబట్టుకుంటుందే కానీ అరెస్టు చేయదు. పెనాల్టీ కూడా కట్టకపోతే అప్పుడు కోర్టు ద్వారా ప్రొసీడ్ అయితే అరెస్టు జరుగుతుందేమో.





మరి ఏ కోణంలో తాను అరెస్టవుతానని చంద్రబాబుకు అనుమానం వచ్చింది ? రు. 118 కోట్ల ముడుపుల వ్యవహారంలో హవాలా ? లేదా మనీల్యాండరింగ్, ఫెమా, ఆర్బీఐ చట్టాలను ఉల్లంఘించటం, కంపెనీ చట్టాల కింద అరెస్టు అవుతారేమో. ఇందులో ఏ పద్దతిలో అరెస్టయినా జగన్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. అరెస్టు, విచారణ కేంద్రపరిధిలోను, బెయిల్ లేదా రిమాండ్ అంతా కోర్టు పరిధిలోను జరుగుతుంది.





ఏరకంగా చూసినా జగన్ ప్రభుత్వానికి సంబంధమే లేదు. కానీ చంద్రబాబు టార్గెట్ మొత్తం రాష్ట్రప్రభుత్వం మీదే ఉంది. అంటే తనను కేంద్రప్రభుత్వం అరెస్టుచేసినా అందుకు బాధ్యుడు జగనే అని జనాలు అనుకోవాలని చంద్రబాబు బలంగా కోరుకుంటున్నట్లున్నారు. దాని ద్వారా సంపతి కోరుకుంటున్నట్లు అర్ధమవుతోంది. ఇపుడు తాను అరెస్టయితే దాని తాలూకు వ్యతిరేకత అంతా జగన్ ప్రభుత్వం మీదపడితే అప్పుడు సింపతి జనరేట్ అయి అదంతా టీడీపీకి రాబోయే ఎన్నికల్లో ఉపయోగపడుతుందని లేదా ఉపయోగపడాలని చంద్రబాబు కోరుకుంటున్నట్లున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : మానసికంగా దెబ్బతిన్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>