TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-sumaff55ae36-54da-40a3-8fbc-bb25fa8ce588-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-sumaff55ae36-54da-40a3-8fbc-bb25fa8ce588-415x250-IndiaHerald.jpgబుల్లితెర మహారాణిగా యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర మీద గత కొన్ని దశాబ్దాలుగా ఈమెను మనం చూస్తూనే ఉన్నాము. ఈటీవీ , జెమిని, స్టార్ మా ఇలా ఏ ఛానల్ అయినా సరే ఎంటర్టైన్మెంట్ షోస్ ఉంటే కచ్చితంగా సుమ యాంకరింగ్ చేయాల్సిందే. అంతేకాదు స్టార్ సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేయడమే కాదు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అంటే కచ్చితంగా సుమా డేట్స్ కోసం పANCHER SUMA{#}rajiv kanakala;suma;suma kanakala;Star maa;Parents;prema;rajeev;Manam;Hero;Love;Cinema;Eventటీవీ: వారి చేతిలో వారం పాటు టార్చర్ అనుభవించానంటున్న సుమ.. కారణం..?టీవీ: వారి చేతిలో వారం పాటు టార్చర్ అనుభవించానంటున్న సుమ.. కారణం..?ANCHER SUMA{#}rajiv kanakala;suma;suma kanakala;Star maa;Parents;prema;rajeev;Manam;Hero;Love;Cinema;EventFri, 08 Sep 2023 02:00:00 GMTబుల్లితెర మహారాణిగా యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర మీద గత కొన్ని దశాబ్దాలుగా ఈమెను మనం చూస్తూనే ఉన్నాము. ఈటీవీ , జెమిని, స్టార్ మా ఇలా ఏ ఛానల్ అయినా సరే ఎంటర్టైన్మెంట్ షోస్ ఉంటే కచ్చితంగా సుమ యాంకరింగ్ చేయాల్సిందే. అంతేకాదు స్టార్ సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేయడమే కాదు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అంటే కచ్చితంగా సుమా డేట్స్ కోసం పోటీ పడుతూ ఉంటారు.

ఇక ఈమె ఇండస్ట్రీలో ఉన్నా..  ప్రారంభం నుండి నేటి వరకు ఎంతో మంది కొత్త యాంకర్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఏ ఒక్కరు కూడా సుమా రేంజ్ కి చేరుకోలేకపోయారు. అందుకే యాంకరింగ్ రంగంలో ఆమెని మహారాణి అని పిలుస్తూ ఉంటారు. టైమింగ్ తో కూడుకున్న పంచులు వేయడం వల్ల ఇప్పటికీ కూడా టాప్ పొజిషన్లో కొనసాగుతోంది అనడంలో సందేహం లేదు. ఇంతటి ఉన్నతమైన స్థానానికి చేరుకున్న సుమ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది.

రాజీవ్ కనకాలను తాను ప్రేమిస్తున్నట్టు ఇంట్లో చెప్పగానే సుమ తల్లిదండ్రులు అసలు ఒప్పుకోలేదట. మరొక పక్క రాజీవ్ కనకాల కుటుంబంలో మాత్రం సుమాతో పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ సుమా తల్లిదండ్రులు మాత్రం రాజీవ్ కనకాలతో మాట్లాడడానికి వీలులేదని సుమను ఒక వారం రోజులపాటు గదిలో నిర్బంధించారట. ఇక రాజీవ్ కనకాలను తలుచుకుంటూ తిండి పానీయాలు కూడా ముట్ట లేదట సుమ.  ఇక తర్వాత ఆమె పట్టుదల,  ప్రేమ అన్నింటిని గమనించిన ఆమె తల్లిదండ్రులు చివరికి రాజీవ్ కనకాలతో పెళ్లికి ఒప్పుకున్నారు. అలా వీరిద్దరి దాంపత్య జీవితం కొనసాగి ఇప్పుడు అన్యోన్యంగా కొనసాగుతోంది. వీరికి ఒక బాబు, పాప కూడా ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : మానసికంగా దెబ్బతిన్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>