Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-ashika-ranganath9a6a1a7b-6e8e-4f0c-819d-2c18d4b95dc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-ashika-ranganath9a6a1a7b-6e8e-4f0c-819d-2c18d4b95dc3-415x250-IndiaHerald.jpgకింగ్ నాగార్జున హీరోగా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్టర్ గా మారి చేస్తున్న సినిమా నా సామిరంగ. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేసుకున్నారు చిత్ర యూనిట్. ఇన్నాళ్లు డ్యాన్స్ మాస్టర్ గా ఉన్న విజయ్ బిన్ని నాగార్జున సినిమాతో మెగా ఫోన్ పట్టుకుని కొత్త టాలెంట్ చూపించబోతున్నాడు. ఈ సినిమాలో నాగార్జున మాస్ లుక్స్Nagarjuna Ashika Ranganath{#}aasheeka;kalyan;ranganath;Smart phone;Kanna Lakshminarayana;Master;Yuva;Akkineni Nagarjuna;Makar Sakranti;king;King;Mass;Tollywood;Joseph Vijay;Director;Cinemaకుర్ర హీరోయిన్ తో నాగార్జున రొమాన్స్..!కుర్ర హీరోయిన్ తో నాగార్జున రొమాన్స్..!Nagarjuna Ashika Ranganath{#}aasheeka;kalyan;ranganath;Smart phone;Kanna Lakshminarayana;Master;Yuva;Akkineni Nagarjuna;Makar Sakranti;king;King;Mass;Tollywood;Joseph Vijay;Director;CinemaFri, 08 Sep 2023 09:43:00 GMTకింగ్ నాగార్జున హీరోగా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్టర్ గా మారి చేస్తున్న సినిమా నా సామిరంగ. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేసుకున్నారు చిత్ర యూనిట్. ఇన్నాళ్లు డ్యాన్స్ మాస్టర్ గా ఉన్న విజయ్ బిన్ని నాగార్జున సినిమాతో మెగా ఫోన్ పట్టుకుని కొత్త టాలెంట్ చూపించబోతున్నాడు. ఈ సినిమాలో నాగార్జున మాస్ లుక్స్ తో వెరైటీగా కనిపిస్తున్నారు. క్లాస్ సినిమాలు క్లాస్ ఇమేజ్ ఉన్న హీరోలు మాస్ సినిమాలు చేస్తే బాగుంటుంది.

అందుకే నాగార్జున నా సామిరంగ టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు తెచ్చింది. ఈ సినిమాలో నాగార్జునతో యువ హీరోయిన్ రొమాన్స్ చేస్తుంది. నాగార్జున సరసన నా సామిరంగ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడలో దాదాపు 14 సినిమాల దాకా చేసిన ఆషికా కళ్యాణ్ రాం అమిగోస్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా వర్క్ అవుట్ కాకపోయినా సరే అమ్మడికి తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి.

సినిమాల కన్నా ఫోటో షూట్స్ తో ఆహికా ఎక్కువ ఎట్రాక్ట్ చేయడం వల్ల టాలీవుడ్ మేకర్స్ ఆమె పై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఏకంగా కింగ్ నాగార్జున సినిమాలో ఆఫర్ ని పట్టేసింది. నాగ్ సినిమా సక్సెస్ అయితే మాత్రం ఆషిక ఫేట్ మారినట్టే అని చెప్పొచ్చు. నాగార్జున ఆషికా ఈ ఇద్దరి జోడీ నా సామిరంగా అనిపిస్తుందని అంటున్నారు. నాగ్ మాస్ అవతార్ తో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి రేసులో దిగుతుంది. మరి సినిమా పై ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే ఇలా సంక్రాంతి పోటీకి సిద్ధమవుతున్నారో అని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈమధ్య చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవడంతో నాగ్ కథల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>