Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec0283d20-b899-49de-8669-dcb265773c05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec0283d20-b899-49de-8669-dcb265773c05-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో ఎలక్షన్స్ హడావుడి మొదలు కావడంతో ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. పాఠశాల విద్యాశాఖ లో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దానిలో భాగంగా ఆగస్టు 1 న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెట్ పరీక్షను సెప్టెంబర్ 15 న నిర్వహించి అదే నెల 27 న ఫలితాలు విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా తెలంగాణ ఆర్ధిక శాఖ 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్లియరెన్స్ ఇచ్చింది. దీనితో ఎప్పటినుంచో లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తున్న టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ socialstars lifestyle{#}School;Telangana;District;Application;Election;Government;thursday;september;Octoberటీచర్ పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం....!!టీచర్ పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం....!!socialstars lifestyle{#}School;Telangana;District;Application;Election;Government;thursday;september;OctoberFri, 08 Sep 2023 17:53:00 GMTతెలంగాణ లో ఎలక్షన్స్ హడావుడి మొదలు కావడంతో ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. పాఠశాల విద్యాశాఖ లో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దానిలో భాగంగా ఆగస్టు 1 న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెట్ పరీక్షను సెప్టెంబర్ 15 న నిర్వహించి అదే నెల 27 న ఫలితాలు విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా తెలంగాణ ఆర్ధిక శాఖ 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్లియరెన్స్ ఇచ్చింది. దీనితో ఎప్పటినుంచో లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తున్న టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ ను ప్రభుత్వం విడుదల చేసింది.నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్య కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్స్ (సీబీటీ) ను నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 20 నుంచి అక్టోబరు 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. ఇటీవలే 5,089 ఉపాధ్యాయ ఖాళీలతోపాటు మరో 1,523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు టీఆర్‌టీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, స్కూల్‌ అసిస్టెంట్లు, పీఈటీలు, భాషా పండితుల పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్‌లో 1,523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల ఖాళీల భర్తీ గురించి మాత్రం ప్రస్తావించలేదు.టీఆర్టీ పరీక్షను ప్రభుత్వం తొలిసారిగా ఆన్‌లైన్‌ లో నిర్వహించనున్నారు.మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.అయితే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్లు సడలింపును ఇస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. దివ్యాంగులకు మాత్రం పది సంవత్సరాల సడలింపు ఉంటుంది.దరఖాస్తు ఫీజు రూ.వెయ్యిగా నిర్ణయించారు. ఈనెల 20 నుంచి అక్టోబరు 20 వరకు ఫీజును చెల్లించవచ్చు.ఆన్‌లైన్‌లో దరఖాస్తును దాఖలు చేసే దశల వారీ ప్రక్రియ, జిల్లా వారీగా ఖాళీలు, ఇతర వివరాలన్నీ కూడా ఈనెల 15 నుంచి గవర్నమెంట్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని విద్యాశాఖ పేర్కొంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలర్ ఫుల్ డ్రస్సులలో జాన్వీ కపూర్ క్లీవెజ్ షో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>