Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bccif0a3584e-3019-4d8e-bd52-cbeb53551278-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bccif0a3584e-3019-4d8e-bd52-cbeb53551278-415x250-IndiaHerald.jpgఅవును, మీరు విన్నది నిజమే. ఆ మాటన్నది మరెవరో కాదు, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కోచ్‌గా అవతారమెత్తిన టీమిండియా మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా. ఆయన ఈ క్రమంలో జెట్ స్పీడుతో ముందుకు దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసినదే. మొదట అడుగుపెట్టిన సీజన్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌ను జట్టును చాంపియన్‌గా నిలిపిన ఘనత ఆయనిది. ఆ తరువాత ప్రయత్నంలోనూ నెహ్రా మార్గదర్శనం చేసిన టీమ్‌ రన్నరప్‌గా నిలవడం గొప్ప విషయం. ఈ నేపథ్యంలో నెహ్రా కోచింగ్‌ నైపుణ్యాలకు ఫిదా అయిన హర్భజన్‌ సింగ్‌ వంటి మాజీ క్రికెటర్లు భవిష్యత్తులో అతడికి టీమిండBcci{#}contract;Athadu;November;Fidaa;ICC T20;BCCI;Octoberటీమిండియా హెడ్‌కోచ్‌ పదవి నాకు అవసరం లేదు: మాజీ పేసర్‌టీమిండియా హెడ్‌కోచ్‌ పదవి నాకు అవసరం లేదు: మాజీ పేసర్‌Bcci{#}contract;Athadu;November;Fidaa;ICC T20;BCCI;OctoberFri, 08 Sep 2023 13:22:00 GMTఅవును, మీరు విన్నది నిజమే. ఆ మాటన్నది మరెవరో కాదు, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కోచ్‌గా అవతారమెత్తిన టీమిండియా మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా. ఆయన ఈ క్రమంలో జెట్ స్పీడుతో ముందుకు దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసినదే. మొదట అడుగుపెట్టిన సీజన్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌ను జట్టును చాంపియన్‌గా నిలిపిన ఘనత ఆయనిది. ఆ తరువాత ప్రయత్నంలోనూ నెహ్రా మార్గదర్శనం చేసిన టీమ్‌ రన్నరప్‌గా నిలవడం గొప్ప విషయం. ఈ నేపథ్యంలో నెహ్రా కోచింగ్‌ నైపుణ్యాలకు ఫిదా అయిన హర్భజన్‌ సింగ్‌ వంటి మాజీ క్రికెటర్లు భవిష్యత్తులో అతడికి టీమిండియా కోచింగ్‌ బాధ్యతలు అప్పజెపితే బాగుంటుందని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డులానే వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లను నియమిస్తే చాలా వుపయోగ కరంగా ఉంటుందని వారు సూచించారు. ఇక పరిమిత ఓవర్ల కోచ్‌గా నియమించాలని భజ్జీ గతంలో సూచించిన సంగతి విదితమే. ఇదిలా ఉంటే..   తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా ద్రవిడ్‌ పదవీకాలం ముగియనుంది అనే సందేహాల నడుమ ఆశిష్‌ నెహ్రా పేరు తెరమీదకు వచ్చింది. ఈ నేపధ్యంలో ద్రవిడ్‌ కాంట్రాక్ట్‌ పునురుద్ధరించుకుంటే.. టెస్టు జట్టు కోచ్‌గా అతడు ఉంటే.. నెహ్రాకు వన్డే, టీ20 బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలో ఆశిష్‌ నెహ్రా తనకి టీమిండియా హెడ్‌కోచ్‌ పదవిపై ఆసక్తిగా లేదని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గుజరాత్‌ టైటాన్స్‌తో 2025 వరకు ఒప్పందం ఉన్న కారణంగా ఈ మేరకు బీసీసీఐ పదవిని నెహ్రా తిరస్కరించే అవకాశం ఉన్నట్లు పీటీఐ కథనంలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5- నవంబరు 19 వరకు భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌-2023 జరుగనుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాతే ద్రవిడ్‌ కోచ్‌గా కొనసాగుతాడా లేదా అన్న విషయం తేలుతుంది. ఈలోపే ఇలా ఎవరి ఊహాగానాలు వారు చేయడం కొసమెరుపు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హీరో నిఖిల్ విదేశాలకు వెళ్ళడానికి కారణం...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>