PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/it-notice-chandrababu-amaravatid32a1be2-c2c6-4c43-b1a3-04b49833af38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/it-notice-chandrababu-amaravatid32a1be2-c2c6-4c43-b1a3-04b49833af38-415x250-IndiaHerald.jpgదాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి సొంతమీడియా రెచ్చిపోయింది. అలాగే మంత్రులు, నేతలు కూడా పదేపదే చంద్రబాబును టార్గెట్ చేస్తు సమాధానం చెప్పాలని డిమాండ్లు చేస్తున్నారు. దీనిపై చంద్రబాబు అస్సలు నోరిప్పలేదు. ఎక్కడ సమాధానం చెప్పాల్సొస్తుందో అని మీడియా సమావేశాలు కూడా పెట్టలేదు. ఈ నేపధ్యంలోనే ఇపుడు సడెన్ గా ఎల్లోమీడియా ‘ఐటి..అసలు కథ ఏంటి’ అనే బ్యానర్ స్టోరీతో రెచ్చిపోయింది. అదేమిటంటే ఐటి నోటీసులన్నీ చెల్లని నోటీసులేనట. IT notice chandrababu Amaravati{#}Amaravati;118;High court;Reddy;CBN;Jagan;Culture;media;courtఅమరావతి : ఐటీ నోటీసులు చెల్లనివా ?అమరావతి : ఐటీ నోటీసులు చెల్లనివా ?IT notice chandrababu Amaravati{#}Amaravati;118;High court;Reddy;CBN;Jagan;Culture;media;courtFri, 08 Sep 2023 03:00:00 GMT



ఇన్నిరోజులకు ఎల్లోమీడియా స్పందించింది. అమరావతి రాజధాని నిర్మాణంలో చంద్రబాబునాయుడు రు. 118 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఐటి శాఖ నిర్ధారించింది. మొన్నటి నెలలో విచారణకు హాజరుకావాలని 4వ తేదీనే షోకాజ్ నోటీసు జారీచేసింది. మరి చంద్రబాబు హాజరయ్యారా లేదా అన్నది తెలీదు. షోకాజ్ నోటీసులు వెలుగుచూడగానే చంద్రబాబు ఒక్కసారిగా షాకయ్యారు. చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళు, ఎల్లోమీడియాకు కూడా ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయింది. ఎంతో గోప్యంగా ఉంచిన నోటీసులు, షోకాజ్ నోటీసులు జాతీయ మీడియాలో రావటాన్ని తట్టుకోలేకపోయారు.





దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి సొంతమీడియా రెచ్చిపోయింది. అలాగే మంత్రులు, నేతలు కూడా పదేపదే చంద్రబాబును టార్గెట్ చేస్తు సమాధానం చెప్పాలని డిమాండ్లు చేస్తున్నారు. దీనిపై చంద్రబాబు అస్సలు నోరిప్పలేదు. ఎక్కడ సమాధానం చెప్పాల్సొస్తుందో అని మీడియా సమావేశాలు కూడా పెట్టలేదు. ఈ నేపధ్యంలోనే ఇపుడు సడెన్ గా ఎల్లోమీడియా ‘ఐటి..అసలు కథ ఏంటి’ అనే బ్యానర్ స్టోరీతో రెచ్చిపోయింది. అదేమిటంటే ఐటి నోటీసులన్నీ చెల్లని నోటీసులేనట.





చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులు నాలుగేళ్ళ క్రిందటివట. ఆ వ్యవహారమంతా అప్పుడే ముగిసిపోయిందని ఎల్లోమీడియా తేల్చేసింది. ఇపుడు మళ్ళీ నోటీసులు ఎందుకిచ్చిందంటే జగన్ ఒత్తిడే కారణమట. జగన్ కు కేంద్రం అందిస్తున్న సహకారంలో భాగంగానే చంద్రబాబుకు ఐటిశాఖ తాజాగా నోటీసులు జారీచేసిందట. చంద్రబాబుకు ముడుపులు ఇచ్చిందని చెప్పిన మనోజన్ వాసుదేవ్ పర్దాసాని వాగ్మూలం చెల్లదని కోర్టు అప్పట్లోనే చెప్పేసిందట. తనను బంధించి, హింసించి వాగ్మూలం తీసుకున్నారని అప్పట్లోనే వాసుదేవ్ చెప్పారని ఇపుడు చెబుతోంది





ఇక చెల్లింపుల సంస్కృతి తమకు లేదని  షాపూర్జీ స్పష్టంచేసిందట. కాబట్టి షాపూర్జీ సంస్ధ చెప్పిందే జనాలు నమ్మాలని ఎల్లోమీడియా కోరుకుంటోంది. ఏ సంస్ధయినా తాము లంచాలు ఇచ్చామని, ముడుపులు ఇచ్చామని తనంతట తానుగా బహిరంగంగా అంగీకరిస్తుందా ? సరే షాపూర్జీ సంస్ధ చెప్పిందే కాసేపు నిజమని అనుకుంటే మరి తాత్కాలికం పేరుతో కట్టిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణాలు ఎందుకింత నాసిరకంగా ఉన్నాయో చంద్రబాబు లేక షాపూర్జీ యాజమాన్యం చెప్పగలదా ? అంచనా వ్యయాలు అన్ని వందల కోట్లకు అన్నిసార్లు ఎందుకు పెరిగాయో చెప్పగలరా ? చదరపు అడుగుకు చంద్రబాబు రు. సుమారు 11 వేలు ఎందుకు చెల్లించారో చెప్పగలరా ? నోటీసులు ఇచ్చింది ఐటిశాఖ అయితే జగన్ ఒత్తిడితోనే నోటీసులు జారీ అయ్యాయని చెప్పటమే విచిత్రంగా ఉంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : మానసికంగా దెబ్బతిన్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>