Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral7faf9f0e-9d01-494c-a77f-66b7319569ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral7faf9f0e-9d01-494c-a77f-66b7319569ab-415x250-IndiaHerald.jpgజై జవాన్ జై కిసాన్ అనే నినాదం మన ఇండియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే భారత్ వ్యవసాయ ఆధారితదేశం అని చెప్పాలి. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం వినిపించడమే.. తప్ప భారత్లో మాత్రం అన్నం పెట్టే అన్నదాతకు పిడికెడు అన్నం దొరికితే చాలు అనుకునే దుస్థితి ప్రస్తుతం మన దేశంలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇలా భూమిని నమ్ముకుని కష్టపడే అన్నదాత అంటే ప్రభుత్వాలకు ప్రజలకు మాత్రమే కాదు ప్రకృతికి కూడా లోకువే. అందుకే ఆరViral{#}anshu;BMW;Bihar;Bike;Cycle;India;Jawaanవామ్మో.. బీఎండబ్ల్యూ కారులో.. పశువుల మేత తీసుకెళుతున్న రైతు?వామ్మో.. బీఎండబ్ల్యూ కారులో.. పశువుల మేత తీసుకెళుతున్న రైతు?Viral{#}anshu;BMW;Bihar;Bike;Cycle;India;JawaanFri, 08 Sep 2023 08:50:00 GMTజై జవాన్ జై కిసాన్ అనే నినాదం మన ఇండియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఎందుకంటే భారత్ వ్యవసాయ ఆధారితదేశం అని చెప్పాలి. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం వినిపించడమే.. తప్ప భారత్లో మాత్రం అన్నం పెట్టే అన్నదాతకు పిడికెడు అన్నం దొరికితే చాలు అనుకునే దుస్థితి ప్రస్తుతం మన దేశంలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇలా భూమిని నమ్ముకుని కష్టపడే అన్నదాత అంటే ప్రభుత్వాలకు ప్రజలకు మాత్రమే కాదు ప్రకృతికి కూడా లోకువే.


 అందుకే ఆరుకాలం కష్టపడి పండించిన పంటను అతివృష్టి, అనావృష్టితో నాశనం చేస్తూ చివరికి రైతన్నకు కంటనిరే మిగులుస్తూ ఉంటుంది. అయితే ఎక్కువ మంది రైతుల పరిస్థితి ఇలా ఉంటే కొంతమంది మాత్రం.. వ్యవసాయ రంగంలో కూడా వినూత్నమైన పద్ధతులను అవలంబిస్తూ ధనవంతులుగా మారిపోతున్నారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఇలాంటి రైతు గురించి ఇండియా మొత్తం చర్చ జరుగుతుంది. బీహార్ కు చెందిన ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా పశువులకు మేత తీసుకెళ్తున్నప్పుడు సైకిల్ మీద బైక్ మీద తీసుకెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు.


 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా బీఎండబ్ల్యూ కారులో పశువులకు మేత తీసుకు వెళుతున్నట్లు కనిపిస్తుంది. ఇది చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. పశువుల కోసం పచ్చ గడ్డిని కోసి ఆ గడ్డి మొత్తాన్ని కూడా bmw కారు మీద కట్టి ఇక అతను తీసుకు వెళుతున్నాడు. అయితే ఇది చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఎవరి కారో చోరీకి గురైనట్లుంది అని ఒకరు కామెంట్లు చేస్తుంటే.. అతను నిజంగానే ధనవంతుడు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలా బీఎండబ్ల్యూ కారులో పశువును మేతలు తీసుకువెళ్లిన వ్యక్తి బీహార్ లోని సంస్థపూర్ లోని జిత్వాల్ పూర్ కు చెందిన అన్షు కుమార్. అతను వ్యవసాయం చేయడమే కాదు ఇక వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని పశువుల పెంపకానికి కూడా ఉపయోగిస్తున్నాడు.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>