MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh16b4db5f-af42-48b0-b6ce-ceb48ceb2dea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh16b4db5f-af42-48b0-b6ce-ceb48ceb2dea-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ‘జవాన్’ మ్యానియా కనిపిస్తోంది. క్రితం సంవత్సరం ‘పఠాన్’ తో వచ్చిన రికార్డులను ‘జవాన్’ బ్రేక్ చేస్తుందని షారూఖ్ అభిమానులు అంచనాలు వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈ మూవీ టిక్కెట్లకు ఏర్పడిన క్రేజ్ చూస్తుంటే ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ ఆకాశాన్ని తాకే స్థాయిలో కనిపిస్తున్నాయి. ఈమూవీని తెలుగులో కూడ డబ్ చేసి విదుదల చేస్తున్న పరిస్థితులలో ఈమూవీ పట్ల తెలుగు రాష్ట్రాలలో కూడ మంచి క్రేజ్ ఏర్పడింది.ఈమూవీ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అనేకమంది సెలెబ్రెటీలు ‘జవాన్’ యmahesh{#}Aamir Khan;Rajamouli;Rajani kanth;Yevaru;bollywood;Shahrukh Khan;nayantara;News;Telugu;Cinemaమహేష్ కు ఊహించని ఆహ్వానాన్ని పంపిన షారూఖ్ ఖాన్ !మహేష్ కు ఊహించని ఆహ్వానాన్ని పంపిన షారూఖ్ ఖాన్ !mahesh{#}Aamir Khan;Rajamouli;Rajani kanth;Yevaru;bollywood;Shahrukh Khan;nayantara;News;Telugu;CinemaThu, 07 Sep 2023 08:00:00 GMTప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ‘జవాన్’ మ్యానియా కనిపిస్తోంది. క్రితం సంవత్సరం ‘పఠాన్’ తో వచ్చిన రికార్డులను ‘జవాన్’ బ్రేక్ చేస్తుందని షారూఖ్ అభిమానులు అంచనాలు వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈ మూవీ టిక్కెట్లకు ఏర్పడిన క్రేజ్ చూస్తుంటే ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ ఆకాశాన్ని తాకే స్థాయిలో కనిపిస్తున్నాయి. ఈమూవీని తెలుగులో కూడ డబ్ చేసి విదుదల చేస్తున్న పరిస్థితులలో ఈమూవీ పట్ల తెలుగు రాష్ట్రాలలో కూడ మంచి క్రేజ్ ఏర్పడింది.


ఈమూవీ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అనేకమంది సెలెబ్రెటీలు ‘జవాన్’ యూనిట్ కు మరీ ముఖ్యంగా షారుఖ్ ఖాన్ కు ముందుగానే అభినందనలు తెలియచేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ షారూఖ్ కు అభినందనలు తెలియచేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన సందేశానికి షారూఖ్ ఎవరు ఊహించని రీతిలో స్పందించాడు.


మహేష్ కు తన కృతజ్ఞతలు తెలియ చేస్తూ ‘జవాన్’ మూవీని మహేష్ కు సంబంధించిన ఎ ఎమ్ బి ధియేటర్స్ లో తాను మహేష్ తో కలిసి కూర్చుని ‘జవాన్’ మూవీని చూడాలని ఉందని దానికి మహేష్ అంగీకరిస్తాడా అంటూ సోషల్ మీడియాలో మహేష్ కు పెట్టిన ప్రశ్నకు మహేష్ ఎలాంటి సమాధానం ఇస్తాడో అంటూ చాలామంది ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి రాజమౌళి మహేష్ తో త్వరలో మొదలుపెట్టబోతున్న మూవీలో విలన్ పాత్రను అమీర్ ఖాన్ తో కానీ లేదంటే షారూఖ్ ఖాన్ చేత కానీ చేయించి ఆమూవీని 2000 కోట్ల కలక్షన్స్ క్లబ్ లో చేర్చే విధంగా వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు షారూఖ్ మహేష్ ల మధ్య ఏర్పడుతున్న సాన్నిహిత్యం రాజమౌళి ప్రయత్నాలకు సహకరిస్తుందేమో చూడాలి.


ఈమూవీకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఖచ్చితంగా ఈమూవీ ‘పఠాన్’ కలక్షన్స్ ను బ్రేక్ చేయడం ఖాయం అని అనిపిస్తోంది. ఈమూవీలో నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తున్న పరిస్థితులలో ఈమూవీ సక్సస్ అయితే నయన్ పేరు బాలీవుడ్ లో మారుమ్రోగి పోవడం ఖాయం..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈ ఆటో డ్రైవర్ మోసం చూస్తే మతిపోవాల్సిందే.. రెప్పపాటు కాలంలో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>