PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-bhimavaram-punganurbe4e357f-b96b-43fd-b1fb-bf67d8d2e7af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-bhimavaram-punganurbe4e357f-b96b-43fd-b1fb-bf67d8d2e7af-415x250-IndiaHerald.jpgసేమ్ సీన్ రిపీటైంది. అప్పటి సీన్ కు వేదిక పుంగనూరుకు దగ్గరలోని అంగళ్ళు అయితే తాజా సీన్ కు వేదిక భీమవరం మండలం. వేదిక మారిందే కానీ సీన్ మాత్రం ఏమీ మారలేదు. విషయం ఏమిటంటే భీమవరం మండలంలో నారా లోకేష్ పాదయాత్ర యువగళం జరుగుతున్నపుడు టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను వెతికి మరీ దాడులు చేసి గాయపరిచినట్లు సాక్షి మీడియా ఆరోపించింది.tdp lokesh{#}prabhakar;Chintamaneni Prabhakar;Bhimavaram;Punganur;Parakala Prabhakar;Nara Lokesh;vedhika;Sakshi;TDP;court;police;MLA;Lokesh;Lokesh Kanagaraj;Yevaru;YCPఅమరావతి : భీమవరంలో రిపీటైన పుంగనూరు సీన్అమరావతి : భీమవరంలో రిపీటైన పుంగనూరు సీన్tdp lokesh{#}prabhakar;Chintamaneni Prabhakar;Bhimavaram;Punganur;Parakala Prabhakar;Nara Lokesh;vedhika;Sakshi;TDP;court;police;MLA;Lokesh;Lokesh Kanagaraj;Yevaru;YCPThu, 07 Sep 2023 07:00:00 GMT


సేమ్ సీన్ రిపీటైంది. అప్పటి సీన్ కు వేదిక పుంగనూరుకు దగ్గరలోని అంగళ్ళు అయితే తాజా సీన్ కు వేదిక భీమవరం మండలం. వేదిక మారిందే కానీ సీన్ మాత్రం ఏమీ మారలేదు. విషయం ఏమిటంటే భీమవరం మండలంలో నారా లోకేష్ పాదయాత్ర యువగళం జరుగుతున్నపుడు టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను వెతికి మరీ దాడులు చేసి గాయపరిచినట్లు సాక్షి మీడియా ఆరోపించింది.





ఇదే సమయంలో లోకేష్ పాదయాత్రలో గందరగోళం సృష్టించే ఉద్దేశ్యంతోనే వైసీపీ అల్లరిమూకలు ప్రవేశించినట్లు ఎల్లోమీడియా చెప్పింది. దొరికిన వాళ్ళని దొరికినట్లుగా టీడీపీ కార్యకర్తలను లోకేష్ పాదయాత్ర వాలంటీర్లపై కర్రలు, రాళ్ళతో దాడులుచేసి గాయపరిచినట్లు ఫొటోలతో సహా ఆరోపించింది. విచిత్రం ఏమిటంటే టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్న దృశ్యాలను, దాడులు చేసి పోలీసులను గాయపరచిన ఘటనల ఫోటోలను సాక్షిమీడియా ప్రచురించింది.





అంటే ఒకే సంఘటనను రెండు మీడియాలో ఎవరి యాంగిల్లో అవి అచ్చేసుకున్నాయి. అంతేకానీ జరిగింది ఏమిటనే విషయాన్ని జనాలకు అందించాలనే సోయిలేకుండా పోయింది. పుంగనూరులో పోలీసులే టార్గెట్ గా టీడీపీ అల్లరిమూకల, కిరాయి మూకల దాడులు జరిగాయి. అప్పటి దాడుల్లో 47 మంది పోలీసులకు పెద్ద గాయాలే అయ్యాయి. ఒక కానిస్టేబుల్ కు రెండు కళ్ళు దెబ్బతిన్నాయి. మూడు పోలీసు వాహనాలను దగ్ధంచేశాయి. చాలామంది పోలీసుల నుండి నెలరోజులు తప్పించుకుని తిరిగిన విషయం అందరికీ తెలిసిందే





భీమవరం అల్లర్లలో కూడా ఇటు టీడీపీ, అటు వైసీపీ నేతలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీళ్ళకు అదనంగా పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అల్లర్లకు కారణం ఏమిటి ? ఎవరు ఎవరిమీద దాడులు మొదలుపెట్టారనే విషయాన్ని పోలీసులు వీడియోసాక్ష్యాల ఆధారంగా విశ్లేషిస్తున్నారు. అల్లర్లకు, దాడులకు పాల్పడిన వాళ్ళని వీడియోల ఆధారంగా గుర్తిస్తున్నారు. పుంగనూరు అల్లర్లలో ఏ 1 నిందితుడు చల్లారామచంద్రారెడ్డిగా పోలీసులు గుర్తించి కేసులు పెట్టారు. తాజాగా ఆయన పోలీసులకు లొంగిపోతే కోర్టు రిమాండ్ విధించింది. భీమవరంలో అల్లర్లకు మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ అని వైసీపీ ఆరోపిస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.  





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈ ఆటో డ్రైవర్ మోసం చూస్తే మతిపోవాల్సిందే.. రెప్పపాటు కాలంలో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>