Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-37f7bbb5-92b5-4867-b97e-58713d5cae5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-37f7bbb5-92b5-4867-b97e-58713d5cae5b-415x250-IndiaHerald.jpgకోట్ల మంది బుల్లితెర అభిమానులు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న బిగ్బాస్ కార్యక్రమం ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. అయితే మిగతా సీజన్ల లాగా కాదు ఈ సీజన్ మొత్తం ప్రేక్షకుల ఊహకందని రీతిలో ఉల్టా ఫుల్టా ఉంటుంది అని ఇక అటు నాగార్జున అందరిలో అంచనాలను పెంచేశాడు. అందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం షోలోని గేమ్స్ కూడా సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ప్రస్తుతం హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ హౌస్ మేట్స్ గా ఇంకా కన్ఫార్మ్ కాలేదని.. హౌస్ మేట్స్ కావాలి అంటే గేమ్స్ ఆడి సాధించుకోవాలి అంటూ ఒక ఫిట్టింగ్ పెట్టాడు నాగార్జున.Bigboss {#}teja;Audi;Bigboss;Winner;Prize;House;Akkineni Nagarjuna;Heroine;Yevaruబిగ్ బాస్ 7 విన్నర్ ఆమెనేనట.. ముందే డిసైడ్ చేసిన నేటిజన్స్?బిగ్ బాస్ 7 విన్నర్ ఆమెనేనట.. ముందే డిసైడ్ చేసిన నేటిజన్స్?Bigboss {#}teja;Audi;Bigboss;Winner;Prize;House;Akkineni Nagarjuna;Heroine;YevaruThu, 07 Sep 2023 09:05:00 GMTకోట్ల మంది బుల్లితెర అభిమానులు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న బిగ్బాస్ కార్యక్రమం ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. అయితే మిగతా సీజన్ల లాగా కాదు ఈ సీజన్ మొత్తం ప్రేక్షకుల ఊహకందని రీతిలో ఉల్టా ఫుల్టా ఉంటుంది అని ఇక అటు నాగార్జున అందరిలో అంచనాలను పెంచేశాడు. అందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం షోలోని గేమ్స్ కూడా సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ప్రస్తుతం హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ హౌస్ మేట్స్ గా ఇంకా కన్ఫార్మ్ కాలేదని.. హౌస్ మేట్స్ కావాలి అంటే  గేమ్స్ ఆడి సాధించుకోవాలి అంటూ ఒక ఫిట్టింగ్ పెట్టాడు నాగార్జున.


 అంతే కాదు షో మొదటి రోజే ఏకంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్లకు ఇచ్చే బ్రీఫ్ కేస్ ఇచ్చి అందరిలో టెన్షన్ కలిగించాడు. ఏకంగా 35 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఆఫర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటిలాగానే కంటెస్టెంట్స్  మధ్య గేమ్స్ ఆడిస్తూ ఉన్నాడు. ఇక నామినేషన్ ఎలిమినేషన్ తో హౌస్ మొత్తం వాడి వేడిగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అప్పుడే కంటెస్టెంట్స్ పులిహోరలు కలపడం, పుల్లలు పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. అయితే బిగ్బాస్ మొదలైంది అంటే చాలు ఇక ఈ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారు అనే విషయంపై చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి.


 అయితే ప్రస్తుతం హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ లో పెద్దగా గుర్తింపు సంపాదించిన వారు లేకపోయినప్పటికీ ఇక హౌస్ లోకి పంపించిన కంటెస్టెంట్స్ మాత్రం మంచి కంటెంట్ ని ప్రేక్షకులకు అందిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది. బిగ్ బాస్ ఏడవ సీజన్ విన్నర్ ఎవరో అనే విషయాన్ని ముందుగానే కొంతమంది నేటిజన్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం హీరోయిన్ రితిక ఈసారి బిగ్ బాస్ విన్నర్ అవుతుందని ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమె  స్ట్రాటజీస్ చూస్తే.. ఇంట్లో కూర్చుని అన్ని సీజన్స్ బాగా పట్టేసినట్లు ఉంది. అందుకే ఎన్నో రకాల స్ట్రాటజీలతో ముందుకు వెళుతుంది. రీసెంట్గా బిగ్ బాస్ తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ను కూడా టేస్టీ తేజ తో చేయించి తన స్టాటజీ వర్కౌట్ చేసుకుంది రితిక. ఇది చూసిన అందరూ ఆమెనే ఇక బిగ్ బాస్ ఏడవ సీజన్ విన్నర్ అంటూ కచ్చితంగా చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈ ఆటో డ్రైవర్ మోసం చూస్తే మతిపోవాల్సిందే.. రెప్పపాటు కాలంలో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>