Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/chahal794d4f4b-9a7b-4932-8614-93060b8355ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/chahal794d4f4b-9a7b-4932-8614-93060b8355ff-415x250-IndiaHerald.jpgబీసీసిఐ ముందుగా చెప్పినట్లుగానే ఇటీవల ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత ఇక భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన జట్టు వివరాలను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక జట్టులో ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ ఛాన్స్ దక్కించుకున్నారు. అదే సమయంలో కొంతమందికి మాత్రం అవకాశం అస్సలు దక్కలేదు. మరీ ముఖ్యంగా ఇక భారత జట్టులో తెలివైన స్పిన్నర్ గా పేరు సంపాదించుకున్న చాహాల్ ను సెలెక్టర్లు మరోసారి పక్కన పెట్టేసారు. దీంతో అప్పటినుంచి చాహల్ ఇండియన్ క్రికెట్లో దురదృష్Chahal{#}England;Pakistan;BCCI;World Cup;News;Indian;Indiaవరల్డ్ కప్ లో నో ఛాన్స్.. చాహల్ కీలక నిర్ణయం?వరల్డ్ కప్ లో నో ఛాన్స్.. చాహల్ కీలక నిర్ణయం?Chahal{#}England;Pakistan;BCCI;World Cup;News;Indian;IndiaThu, 07 Sep 2023 16:19:00 GMTబీసీసిఐ ముందుగా చెప్పినట్లుగానే ఇటీవల ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత ఇక భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన జట్టు వివరాలను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక జట్టులో ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ ఛాన్స్ దక్కించుకున్నారు. అదే సమయంలో కొంతమందికి మాత్రం అవకాశం అస్సలు దక్కలేదు. మరీ ముఖ్యంగా ఇక భారత జట్టులో తెలివైన స్పిన్నర్ గా పేరు సంపాదించుకున్న చాహాల్ ను సెలెక్టర్లు మరోసారి పక్కన పెట్టేసారు. దీంతో అప్పటినుంచి చాహల్ ఇండియన్ క్రికెట్లో దురదృష్టవంతుడు అయిన ప్లేయర్ అంటూ ఒక ప్రచారం జరుగుతుంది.


 దీనికి కారణం చాహల్ ఎప్పుడు భారత జట్టు ఆడే మ్యాచ్లలో కనిపిస్తూ ఉంటాడు. కానీ ఐసీసీ టోర్ని వచ్చేసరికి మాత్రం సెలెక్టర్లు అతన్ని నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తూ ఉంటారు. గతంలో టి20 వరల్డ్ కప్లలో ఇక ఇప్పుడు వన్డే వరల్డ్ కప్లో కూడా సేలెక్టర్లు తీరు ఇలాగే ఉంది అని చెప్పాలి. అయితే ఇక చాహల్ కు చోటు దక్కకపోవడంతో అతని అభిమానులు అందరూ కూడా తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు అని చెప్పాలి. వరల్డ్ కప్ కప్పులో చోటు దక్కించుకోలేకపోయిన చాహల్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నది తెలుస్తుంది.


 ఏకంగా కౌంటి క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడట ఈ టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్. ఇంగ్లాండ్ కౌంటి జట్టు కెంట్ తరఫున చాహల్ ఆడబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అతను కౌంటిలో ఆడేందుకు బీసీసీఐ నుంచి కూడా అనుమతి వచ్చిందట. అయితే వరల్డ్ కప్ సమయంలో ఎవరైనా ఆటగాడు గాయపడి ఇక చాహల్ సేవలు అటు జట్టుకు అవసరమైతే ఇక వెంటనే అతన్ని బీసీసీఐ మళ్ళీ పిలిపించుకుంటుంది అని ముందుగానే సమాచారం అందించారట. మరి కౌంటి క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి చాహల్ మళ్ళీ  టీమిండియాలోకి  వస్తాడో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జవాన్ రివ్యూ: డే 1 100 కోట్లు పక్కా.. పఠాన్ ఔట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>