EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india2925cd69-ea0d-411e-86da-43a215785633-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india2925cd69-ea0d-411e-86da-43a215785633-415x250-IndiaHerald.jpgభారత్ లో జీ20 సదస్సు జరగబోతుంది. అమెరికా, యూరప్ దేశాలు మాత్రం ఉక్రెయిన్ గురించి అనుకూలంగా రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. ప్రధాని మోదీపై జీ 20 సదస్సులో రష్యా గురించి వ్యతిరేక తీర్మానం కోసం పట్టుబట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు 20 సభ్య దేశాలు, దాదాపు 45 దేశాలు పాల్గొనే ఈ సదస్సులో ఎలాంటి రష్యాకు వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా గానీ ఎలాంటి తీర్మానం చేయకూడదని ఇండియా భావిస్తుంటే.. అమెరికా మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకుని భారత్ లో ఎలాగైన రష్యా కు వ్యతిరేకంగా తీINDIA{#}American Samoa;Europe countries;Ukraine;Russia;Delhi;Prime Minister;Indiaజీ20 వేదికగా అమెరికా, రష్యా రాజకీయాలు?జీ20 వేదికగా అమెరికా, రష్యా రాజకీయాలు?INDIA{#}American Samoa;Europe countries;Ukraine;Russia;Delhi;Prime Minister;IndiaThu, 07 Sep 2023 06:00:00 GMTభారత్ లో జీ20 సదస్సు జరగబోతుంది. అమెరికా, యూరప్ దేశాలు మాత్రం ఉక్రెయిన్ గురించి అనుకూలంగా రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. ప్రధాని మోదీపై జీ 20 సదస్సులో రష్యా గురించి వ్యతిరేక తీర్మానం కోసం పట్టుబట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు 20 సభ్య దేశాలు, దాదాపు 45 దేశాలు పాల్గొనే ఈ సదస్సులో ఎలాంటి రష్యాకు వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా గానీ ఎలాంటి తీర్మానం చేయకూడదని ఇండియా భావిస్తుంటే.. అమెరికా మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకుని భారత్ లో ఎలాగైన రష్యా కు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలని అనుకుంటోందంట. అయితే జీ20 లో సభ్య దేశంగా రష్యా కూడా ఉంది.


మొదట రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సమావేశాలకు వస్తారని అందరూ భావించారు. కానీ పుతిన్ సమావేశాలకు రావడం లేదని కబురు పంపారు. రష్యా కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని భావించడంపై ఖండించింది. జీ 20 సదస్సును ఉక్రెయిన్ గురించి మాట్లాడటం, ఉక్రెయిన్ కు అనుకూలంగా స్టేట్ మెంట్స్ ఇప్పించడం, రష్యా కు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలని అమెరికా భావిస్తోందని ముఖ్యంగా ఇండియాతో కూడా ఎలాగైనా తీర్మానంపై సంతకం చేయించాలని అనుకుంటోందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రష్యా ప్రకటన వెలువరించింది. అయితే జీ 20 సదస్సు కోస న్యూ ఢిల్లీ అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నారు.


ఈ సమావేశాలు జరిగే మూడు రోజులు ఢిల్లీకి సెలవులు ప్రకటించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ఇచ్చారు. సెలవులు ఉన్నాయని బయటకు రాకుండా ఇంట్లోనే ఎక్కువ సమయం కేటాయించాలని కోరారు. అమెరికా అధ్యక్షుడితో పాటు 45 దేశాల వారు రానుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లలో కేంద్రం తలమునకలైంది. జీ 20 సదస్సును ఎలాగైనా విజయవంతం చేయాలని భావిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అనసూయ అయితే వద్దు అంటున్న డైరెక్టర్స్.. ఎందుకంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>