MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2d53aee3-7c12-4eed-8ede-8205d6e772eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2d53aee3-7c12-4eed-8ede-8205d6e772eb-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమాని బాయ్ కాట్(Boycott) చేయాలంటూ కొందరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో? పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన 'జవాన్' గురువారం, సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. హిందీ తో పాటు తమిళం, తెలుగు భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా tollywood{#}Tamilnadu;Coronavirus;udhayanidhi stalin;Stalin;nayantara;vijay sethupathi;september;Red;Kollywood;Hindi;Hero;India;atlee kumar;Jawaan;Telugu;Tamil;Cinemaట్రెండింగ్ లో 'బాయ్ కాట్ జవాన్' - కారణం అదేనా?ట్రెండింగ్ లో 'బాయ్ కాట్ జవాన్' - కారణం అదేనా?tollywood{#}Tamilnadu;Coronavirus;udhayanidhi stalin;Stalin;nayantara;vijay sethupathi;september;Red;Kollywood;Hindi;Hero;India;atlee kumar;Jawaan;Telugu;Tamil;CinemaThu, 07 Sep 2023 11:15:45 GMTబాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్  'జవాన్' సినిమాని బాయ్ కాట్(Boycott) చేయాలంటూ కొందరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో? పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన 'జవాన్' గురువారం, సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. హిందీ తో పాటు తమిళం, తెలుగు భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయింది. ఇండియా తో పాటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో 'జవాన్' మూవీని బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. అందుకు కారణం తమిళ హీరో ఉదయనిది స్టాలిన్ అని తెలుస్తోంది. తమిళనాడులో 'జవాన్' సినిమా హక్కులను రెడ్ జాయింట్ మూవీ సంస్థ సొంతం సొంతం చేసుకున్నారు. అయితే ఈ సంస్థ తమిళనాడు యువజన క్రీడా శాఖ మంత్రి, సినీ హీరో ఉదయనిది స్టాలిన్ కు చెందింది.

తమిళనాడు రాష్ట్రంలో ఈ సంస్థ 'జవాన్' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కొందరు 'జవాన్' మూవీని బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సనాతన ధర్మంపై ఉదయనిది స్టాలిన్ తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారని, అందుకే అతనికి నష్టం వచ్చేలా 'జవాన్' సినిమాను బాయ్ కాట్(Boycott) చేయాలంటూ కొందరు సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో #బాయ్ కాట్ జవాన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఇటీవల ఓ సభలో ఉదయనిధి స్టాలిన్ 'దోమలు, డెంగ్యూ, మలేరియా, కరోనా లాగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ' వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అనసూయ అయితే వద్దు అంటున్న డైరెక్టర్స్.. ఎందుకంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>