DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrayan369aaa466-0af6-449d-90d7-9a6a962c52a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrayan369aaa466-0af6-449d-90d7-9a6a962c52a7-415x250-IndiaHerald.jpgచంద్రుడిపైకి ఇండియా పంపిన చంద్రయాన్ 3 సక్సెస్ ఫుల్ గా తన పని తాను చేసుకుంటూ బెంగళూరులోని ఇస్రో కేంద్రంలోకి సమాచారాన్ని పంపిస్తోంది. ప్రస్తుతం అవి స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ లు రెండింటిని శాస్త్రవేత్తలు స్లీప్ మోడ్ లోకి తీసుకెళ్లారు. ఎందుకంటే అక్కడ రాత్రి సమయం వచ్చేసింది. అంటే 14 రోజులు రాత్రి ఉండనుంది. ఇందులో భాగంగా అక్కడ విపరీతమైన చలి ఉంటుంది. దాదాపు -180 డిగ్రీల చలి వాతావరణం చంద్రుడి దక్షిణ ద్రువంపై ఉంటుందన్నది ఇస్రో వేసిన అంచనా. అంతటి చలిలో అక్కడ ల్యాంCHANDRAYAN3{#}NASA;Chandrayaan 3;ISRO;oxygen;Aqua;vikram;Success;American Samoa;Russia;Indiaరష్యా అట్టర్‌ ఫ్లాప్‌.. ఇండియా సూపర్‌ సక్సస్‌?రష్యా అట్టర్‌ ఫ్లాప్‌.. ఇండియా సూపర్‌ సక్సస్‌?CHANDRAYAN3{#}NASA;Chandrayaan 3;ISRO;oxygen;Aqua;vikram;Success;American Samoa;Russia;IndiaThu, 07 Sep 2023 23:00:00 GMTచంద్రుడిపైకి ఇండియా పంపిన చంద్రయాన్ 3 సక్సెస్ ఫుల్ గా తన పని తాను చేసుకుంటూ బెంగళూరులోని ఇస్రో కేంద్రంలోకి సమాచారాన్ని పంపిస్తోంది. ప్రస్తుతం అవి స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ లు రెండింటిని శాస్త్రవేత్తలు స్లీప్ మోడ్ లోకి తీసుకెళ్లారు. ఎందుకంటే అక్కడ రాత్రి సమయం వచ్చేసింది. అంటే 14 రోజులు రాత్రి ఉండనుంది. ఇందులో భాగంగా అక్కడ విపరీతమైన చలి ఉంటుంది.


దాదాపు -180 డిగ్రీల చలి వాతావరణం చంద్రుడి దక్షిణ ద్రువంపై ఉంటుందన్నది ఇస్రో వేసిన అంచనా. అంతటి చలిలో అక్కడ ల్యాండర్, రోవర్ లు పని చేయడం కుదరవు. బ్యాటరీలు డౌన్ అయిపోతాయి. కాబట్టి వాటిని ముందుగానే స్లీప్ మోడ్ లో పెట్టారు. మళ్లీ 14 రోజుల తర్వాత ఇస్రో వాటిని మండించేందుకు ట్రై చేస్తాయి. అయితే ఇస్రో అనుకున్నట్లు జరిగితే ఎండ రాగానే సోలార్ ప్యానెళ్లు పని చేస్తే చంద్రయాన్ 3 అనుకున్న దాని కంటే ఎక్కువ సక్సెస్ అయినట్లు లెక్క.


చంద్రయాన్ 3 పంపిన సమయంలో రష్యా కూడా లూనా 25 అనే ప్రయోగాన్ని చంద్రుడి పై చేపట్టింది. అది కూడా చంద్రుడి దక్షిణ ద్రువం మీద తన ల్యాండర్ ను దింపాలని ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ప్రయోగం చివరి క్షణంలో విఫలమైంది. అనుకున్న లక్ష్యానికి 400 మీటర్ల పక్కకు వెళ్లి లూనా 25 ల్యాండర్ క్రాష్ అయింది. దీంతో చందమామాపై దాదాపు 10 మీటర్ల లోతులో గుంత పడినట్లు నాసా గుర్తించింది.


చంద్రయాన్ 3 ద్వారా నీటి జాడలు, ఆక్సిజన్ వివరాలు కనుక్కోవాలని ఇస్రో ప్రయత్నాలు చేస్తుంటే.. అమెరికా మాత్రం గతంలోనే అక్కడ అణు బాంబును ప్రయోగించాలని అనుకుంది. కానీ అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. ప్రస్తుతం చంద్రయాన్ 3 తో అక్కడ ఆక్సిజన్, సల్పర్ ఉన్నట్లు తేలింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ దుస్తులలో స్కిన్ షో తో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>