EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/taiwan7d496cbc-b523-4f9b-ba54-d3aef01455d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/taiwan7d496cbc-b523-4f9b-ba54-d3aef01455d7-415x250-IndiaHerald.jpgతైవాన్ కూడా చైనాలో భాగం అని ప్రపంచంలోని మెజార్టీ దేశాలు అంగీకరించాయి. అయితే భారత్ మాత్రం తైవాన్ ను ప్రత్యేక దేశంగానే అభివర్ణించేది. కాంగ్రెస్ హయాంలో మాత్రం చైనాకు సపోర్టుగా భారత్ నిలిచింది. అయితే వాజ్ పేయీ ప్రధానిగా ఉన్న సమయంలోనైనా, ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటున్న సమయంలో కూడా తైవాన్ ను భారత్ ప్రత్యేక దేశంగానే చూస్తోంది. ఈ మధ్య తైవాన్ దేశం నుంచి ఇండియా కు వచ్చి వివిధ కంపెనీల రూపంలో పెట్టుబడులు పెడుతున్నారు. అదే సందర్భంలో తైవాన్ కు ఇండియా మిలిటరీ ప్రతినిధులు వెళ్లడంతో చైనా తప్పుబడుతోందTAIWAN{#}Narendra Modi;Army;contract;Tibet;Congress;Indiaచైనా శత్రువుకు ప్రాధాన్యమిస్తున్న ఇండియా?చైనా శత్రువుకు ప్రాధాన్యమిస్తున్న ఇండియా?TAIWAN{#}Narendra Modi;Army;contract;Tibet;Congress;IndiaThu, 07 Sep 2023 07:00:00 GMTతైవాన్ కూడా చైనాలో భాగం అని ప్రపంచంలోని మెజార్టీ దేశాలు అంగీకరించాయి. అయితే భారత్ మాత్రం తైవాన్ ను ప్రత్యేక దేశంగానే అభివర్ణించేది. కాంగ్రెస్ హయాంలో మాత్రం చైనాకు సపోర్టుగా భారత్ నిలిచింది. అయితే వాజ్ పేయీ ప్రధానిగా ఉన్న సమయంలోనైనా, ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటున్న సమయంలో కూడా తైవాన్ ను భారత్ ప్రత్యేక దేశంగానే చూస్తోంది.


ఈ మధ్య తైవాన్ దేశం నుంచి ఇండియా కు వచ్చి వివిధ కంపెనీల రూపంలో పెట్టుబడులు పెడుతున్నారు. అదే సందర్భంలో తైవాన్ కు ఇండియా మిలిటరీ ప్రతినిధులు వెళ్లడంతో చైనా తప్పుబడుతోంది. తైవాన్ లో ముగ్గురు మాజీ ఆర్మీ అధికారులు తైవాన్ లో పర్యటించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ సైనికాధిపతి నర్వణే, నావీ, ఎయిర్ పోర్సులకు సంబంధించిన అధికారులు తైవాన్ లో పర్యటించారు.


ఆగస్టు 8 వ తేదీన వీరు అక్కడ పర్యటించారు. అక్కడ చర్చలు కూడా జరిపారు. అయితే చైనా ఈ విషయంలో భారత్ ను ప్రశ్నిస్తోంది. గతంలో చైనా వన్ నేషన్ విధానాన్ని అంగీకరించింది. తైవాన్ చైనాలో అంతర్భాగమని గతంలో ఇండియా గుర్తించింది.  ఆ విధానాన్నే ఇప్పుడు కూడా కొనసాగించాలని కోరింది. అయితే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. కానీ చైనా ప్రస్తుతం తన సామ్రాజ్య వాద విస్తరణ కాంక్షతో దాని చుట్టూ పక్కలా ఉన్న దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతుంది.


ప్రతి ప్రాంతాన్ని తనదిగా భావించి కయ్యానికి కాలు దువ్వుుతుంది. టిబెట్ విషయంలో కూడా ఇలానే జరిగింది. అందుకే టిబెట్ మత గురువు దలైలామా ఇప్పటికీ భారత్ లోనే ఆశ్రయం పొందాల్సి వస్తోంది. మొన్నటి వరకు హంకాంగ్ విషయంలో కూడా తన ఆధిపత్య పోకడల్ని ప్రదర్శించింది. ఇప్పుడు డ్రాగన్ కంట్రీ కన్ను తైవాన్ పై పడింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>