Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime6134433a-6fad-4897-a7a7-3aa32da03999-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime6134433a-6fad-4897-a7a7-3aa32da03999-415x250-IndiaHerald.jpgఒకప్పుడు యువతీ యువకుల మధ్య ప్రేమలన్నీ కూడా స్కూల్లోనో.. కాలేజీలోనూ లేదంటే పనిచేసే ఆఫీస్ లోనో పుట్టేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా మాయలో మునిగిపోతున్న జనాలు.. ఇక ఇంటర్నెట్ ప్రేమలో పడిపోతున్నారు అని చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులతో ప్రేమలో పడటం ఇక ఆ తర్వాత నెంబర్లు ఒకరివి ఒకరు షేర్ చేసుకోవడం.. కొన్నాళ్లకే పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత కొన్నాళ్లకే విడిపోవడం ఇటీవల కాలంలో తరచూ జరుగుతూనే ఉంది. ఇలా పుట్టిన ప్రేమలు కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని మాత్రం చివరికి తక్కువ సమయంలోనే ఎండ్ అయిపోతున్నCrime{#}vishnu;Kerala;court;prema;Love;Father;Success;media;marriage;policeనెలరోజుల పాటు కలిసున్న లవర్స్.. కానీ కోర్టులో అన్నతో సమానమని చెప్పింది.. చివరికి?నెలరోజుల పాటు కలిసున్న లవర్స్.. కానీ కోర్టులో అన్నతో సమానమని చెప్పింది.. చివరికి?Crime{#}vishnu;Kerala;court;prema;Love;Father;Success;media;marriage;policeWed, 06 Sep 2023 13:00:00 GMTఒకప్పుడు యువతీ యువకుల మధ్య ప్రేమలన్నీ కూడా స్కూల్లోనో.. కాలేజీలోనూ లేదంటే పనిచేసే ఆఫీస్ లోనో పుట్టేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా మాయలో మునిగిపోతున్న జనాలు.. ఇక ఇంటర్నెట్ ప్రేమలో పడిపోతున్నారు అని చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులతో ప్రేమలో పడటం ఇక ఆ తర్వాత నెంబర్లు ఒకరివి ఒకరు షేర్ చేసుకోవడం.. కొన్నాళ్లకే పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత కొన్నాళ్లకే విడిపోవడం ఇటీవల కాలంలో తరచూ జరుగుతూనే ఉంది. ఇలా పుట్టిన ప్రేమలు కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని మాత్రం చివరికి తక్కువ సమయంలోనే ఎండ్ అయిపోతున్నాయి.


 ఇక్కడ ఒక ప్రేమ జంట తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఇంటి నుంచి పారిపోయారు. దాదాపు ఒక నెలపాటు వారిద్దరు కలిసి ఉన్నారు. అయితే తండ్రి కూతురు మిస్సింగ్ అంటూ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో పోలీసులు వారిద్దరిని గుర్తించి పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన ప్రియురాలు.. కోర్టు ముందేంటి ఎవరి ముందైనా సరే నేనంటే ప్రాణం.. అతను లేకుండా బ్రతకలేను అని చెబుతుంది అని ప్రియుడు అనుకున్నాడు. కానీ ఆమె ఇచ్చిన షాక్ కి బిత్తర పోయాడు.


 ఇంతకీ కోర్టులో ఆ యువతి ఏం చెప్పిందో తెలుసా.. అతను నాకు ప్రియుడెంటి అతను నాకు సోదరులాంటి వాడు. నేను అతనిని ఎప్పుడు ప్రేమించలేదు.. పెళ్లి కూడా చేసుకోలేదు అంటూ కోర్టులో చెప్పింది ప్రియురాలు. ఆమె మాటలకు పాకైన ప్రియుడు మనస్థాపంతో కోర్టు ఆవరణలోనే చేయి కోసుకున్న ఘటన కేరళ హైకోర్టులో వెలుగు చూసింది. త్రిసూర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ళ విష్ణు అదే జిల్లాకు చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు  ఇక ఇంటి నుంచి పారిపోయి ఒకే చోట నెల రోజులపాటు ఉన్నారు. తండ్రి ఫిర్యాదుతో  వారిని గుర్తించి పట్టుకుని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. విష్ణుని తాను పెళ్లి చేసుకోలేదని అతను నా సోదరులాంటివాడు అంటూ విష్ణు ప్రియురాలు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. బెదిరించడం వల్ల నెల రోజులపాటు అతనితో ఉన్నాను అంటూ చెప్పింది. దీంతో షాక్ అయిన విష్ణు ఇక కోర్టు ఆవరణలోనే చేయి కోసుకున్నాడు. గమనించిన పోలీసులు అతని ఆస్పత్రికి తరలించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>