SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak-vs-ban-44caaa66-37b3-439a-b6ad-c5e6a5fbc38d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak-vs-ban-44caaa66-37b3-439a-b6ad-c5e6a5fbc38d-415x250-IndiaHerald.jpgఇక సూపర్-4 దశలో పాకిస్తాన్ టీం మొదటి విజయాన్ని నమోదు చేసింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.బంగ్లాదేశ్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని 39.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాకిస్తాన్ బ్యాటర్లలో ఇమామ్ ఉల్ హక్ (78; 84 బంతుల్లో 5ఫోర్లు, 4 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (63 నాటౌట్; 79 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్‌) అర్థశతకాలతో బాగా ఆడి రాణించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం ఇంకా మెహిదీ హసన్ PAK vs BAN {#}Mushfiqur Rahim;Parugu;ahmed;Bangladesh;Pakistan;Audi;IslamPAK vs BAN : బంగ్లాని చిత్తుగా ఓడించిన పాక్?PAK vs BAN : బంగ్లాని చిత్తుగా ఓడించిన పాక్?PAK vs BAN {#}Mushfiqur Rahim;Parugu;ahmed;Bangladesh;Pakistan;Audi;IslamWed, 06 Sep 2023 22:39:00 GMTఇక సూపర్-4 దశలో పాకిస్తాన్ టీం మొదటి విజయాన్ని నమోదు చేసింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో  మొత్తం 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.బంగ్లాదేశ్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని 39.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాకిస్తాన్ బ్యాటర్లలో ఇమామ్ ఉల్ హక్ (78; 84 బంతుల్లో 5ఫోర్లు, 4 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (63 నాటౌట్; 79 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్‌) అర్థశతకాలతో బాగా ఆడి రాణించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం ఇంకా మెహిదీ హసన్ మిరాజ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.ఇక అంతకముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కు శుభారంభం దక్కలేదు. స్కోరు బోర్డు మీద ఒక్క పరుగు చేరకముందే నసీమ్ షా బౌలింగ్‌లో మెహిదీ హసన్ మిరాజ్ (0) డకౌట్ అయిపోయాడు. పాక్ బౌలర్లు ధాటికి లిటన్ దాస్ (16), మహ్మద్ నయీమ్(20) ఇంకా తౌహిద్ హృదయ్ (2)లు తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో ఓ దశలో బంగ్లాదేశ్‌ 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.


ఈ దశలో సీనియర్ ఆటగాళ్లు అయిన ముష్ఫికర్ రహీమ్ (64; 87 బంతుల్లో 5 ఫోర్లు) ఇంకా షకీబ్ అల్ హసన్(53; 57 బంతుల్లో 7 ఫోర్లు) జట్టును ఎంతగానో ఆదుకున్నారు.ఇక వీరిద్దరు కూడా మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులను ఫటా ఫటా బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో 53 బంతుల్లో షకీబ్ హాఫ్ సెంచురి పూర్తి చేసుకున్నాడు. అయితే మరికాసేపటికే ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్‌లో అతను ఔట్ అయ్యాడు. అందువల్ల 100 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.ఇక షకీబ్ ఔటైన ఓవర్‌లోనే ముష్ఫికర్ రహీమ్ రెండు పరుగులు తీసి 71 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. షకీబ్ ఔటయ్యాక మరొసారి బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అందువల్ల బంగ్లాదేశ్‌ 38.4 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టగా, నసీమ్ షా మూడు, షాహీన్ అఫ్రిది, ఫహీమ్ అష్రఫ్ ఇంకా ఇఫ్తికార్ అహ్మద్ లు తలా ఓ వికెట్ తీశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మార్క్ ఆంటోనీలో సిల్క్ స్మిత ఎవరో చెప్పేసిన విశాల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>