DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ukrain-war0d17f4c1-72ae-4263-b7ef-8f3ee708d224-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ukrain-war0d17f4c1-72ae-4263-b7ef-8f3ee708d224-415x250-IndiaHerald.jpgరష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. దాదాపు రోజు 700 మంది ఉక్రెయిన్ సైనికులను చంపేస్తున్నట్లు సమాచారం. దాదాపు వారం రోజుల్లోనే ఉక్రెయిన్ సైనికులు 4800 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ కు సరికొత్త ఆయుధాలను, మిస్సైల్స్ ను నాటో దేశాలు ఈ మధ్య సమకూర్చాయి. దీంతో రష్యా పై కౌంటర్ ఎటాక్ చేయాలని రష్యా లోని అంతర్గత ప్రాంతాల్లో దాడులు చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అనుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ కు సంబంధించి యుద్ధం ప్రారంభమై ఏడాదిన్నర దాటి పోయింది. ఇంకా యుద్ధం కొనసాగుతుంది. దీనUKRAIN WAR{#}American Samoa;Europe countries;Ranarangam;Russia;Ukraine;warఉక్రెయిన్‌ యుద్ధం: వందల మందిని బలిగొంటున్న రష్యా?ఉక్రెయిన్‌ యుద్ధం: వందల మందిని బలిగొంటున్న రష్యా?UKRAIN WAR{#}American Samoa;Europe countries;Ranarangam;Russia;Ukraine;warWed, 06 Sep 2023 05:00:00 GMTరష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. దాదాపు రోజు 700 మంది ఉక్రెయిన్ సైనికులను చంపేస్తున్నట్లు సమాచారం. దాదాపు వారం రోజుల్లోనే ఉక్రెయిన్ సైనికులు 4800 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ కు సరికొత్త ఆయుధాలను, మిస్సైల్స్ ను నాటో దేశాలు ఈ మధ్య సమకూర్చాయి. దీంతో రష్యా పై కౌంటర్ ఎటాక్ చేయాలని రష్యా లోని అంతర్గత ప్రాంతాల్లో దాడులు చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అనుకున్నారు.


రష్యా, ఉక్రెయిన్ కు సంబంధించి యుద్ధం ప్రారంభమై ఏడాదిన్నర దాటి పోయింది. ఇంకా యుద్ధం కొనసాగుతుంది. దీని వల్ల ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలు నాశనమయ్యాయి. దీనికి కారణం జెలెన్ స్కీ ఒంటెద్దు పోకడలే అని తెలుస్తున్నాయి. నిత్యం జరుగుతున్న మారణహోమంలో వేల మంది ఉక్రెయిన్ సైనికులతో పాటు రష్యా సైనికులు కూడా మరణిస్తున్నారు. దీంతో రణరంగం అట్టుడుకి పోతుంది. దీనికి శాంతి యుత పరిష్కారం వెతికేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు.


రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఎన్ని దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలబడినా పోరాటం మాత్రం ఆపేది లేదని చెబుతున్నారు. కచ్చితంగా తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుతామని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ కూడా తగ్గేది లేదని అంటూ రష్యా తో పోరాటం చేస్తుంది. యూరప్ దేశాలు, అమెరికా అందిస్తున్న సాయం వల్ల అనేక రకాలుగా లబ్ధి పొందుతూ.. యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది.


ఈ ఆధిపత్య పోరులో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు కూడా బలైపోతున్నాయి. దాదాపు ప్రతి రోజు 700 మంది సైనికులే చనిపోతుంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ఐక్యరాజ్యసమితి చర్యలు చేపట్టాలని వివిధ దేశాల ప్రతినిధులు కోరుతున్నారు. ఇలాగే యుద్ధం కొనసాగితే చివరకు అది అణు యుద్ధంగా పరిణమించిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలంగాణకు గుడ్‌న్యూస్.. విస్తరించనున్న లులూ గ్రూప్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>