Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-dd56209a-dd36-4686-a585-b07aa937e2de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-dd56209a-dd36-4686-a585-b07aa937e2de-415x250-IndiaHerald.jpgఒకప్పటి క్రికెట్ కి ప్రస్తుత క్రికెట్ కి ఎంతో చేంజ్ ఉంది. ఒకప్పుడు టెస్ట్, వన్డే ఫార్మాట్లు మాత్రమే ఆడేవారు. కానీ ఇప్పుడు ఈ రెండు ఫార్మాట్లకంటే ఎక్కువగా టి20 ఫార్మాట్ కు ఆదరణ పెరిగిపోయింది. దీంతో ప్రపంచ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారందరూ కూడా టి20 ఫార్మాట్ ఆడెందుకు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇందుకోసం ఏకంగా మిగతా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఒకప్పుడు క్రికెటర్లు 40 ఏళ్లు దాటిపోయిన మూడు ఫార్మాట్లలో కూడా కొనసాగుతూ సత్తా చాటేవారు. కానీ ఇప్పుడCricket {#}South Africa;ICC T20;World Cup;Cricket30 ఏళ్ల వయసులోనే.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్?30 ఏళ్ల వయసులోనే.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్?Cricket {#}South Africa;ICC T20;World Cup;CricketWed, 06 Sep 2023 11:00:00 GMTఒకప్పటి క్రికెట్ కి ప్రస్తుత క్రికెట్ కి ఎంతో చేంజ్ ఉంది. ఒకప్పుడు టెస్ట్, వన్డే ఫార్మాట్లు మాత్రమే ఆడేవారు. కానీ ఇప్పుడు ఈ రెండు ఫార్మాట్లకంటే ఎక్కువగా టి20 ఫార్మాట్ కు ఆదరణ పెరిగిపోయింది. దీంతో ప్రపంచ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారందరూ కూడా టి20 ఫార్మాట్ ఆడెందుకు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇందుకోసం ఏకంగా మిగతా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఒకప్పుడు క్రికెటర్లు 40 ఏళ్లు దాటిపోయిన మూడు ఫార్మాట్లలో కూడా కొనసాగుతూ సత్తా చాటేవారు. కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటకముందే రిటైర్మెంట్ ప్రకటిస్తున్న క్రికెటర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోయింది.


 ఇలా ఎంతో మంది స్టార్ క్రికెటర్లు అతి తక్కువ వయసులోనే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ అభిమానులకు షాకిస్తూ ఉన్నారు. ఇది కాస్త ఇక వరల్డ్ క్రికెట్లో కూడా చర్చనీయంశంగా మారిపోతుంది అని చెప్పాలి. ఇక దక్షిణాఫ్రికా క్రికెట్లో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న మరో బ్యాట్స్మెన్ ఇలాంటి రిటైర్మెంట్ నిర్ణయం తీసుకొని ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి. ఏకంగా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ క్వెంటెన్ డికాక్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికి 2021 లో టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పేసిన అతను ఇక భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.


 కాగా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జట్టు తరఫున స్టార్ ఓపెనర్ గా కొనసాగుతూ ఉన్నాడు  డీకాక్. ఇక సౌత్ ఆఫ్రికా తరఫున 54 టెస్ట్ మ్యాచ్లు 140 వన్డే మ్యాచ్లు ఆడాడు. రెండు ఫార్మట్లలో కలిపి 9264 పరుగులు చేశాడు. గతంలో టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించినా డీకాక్ ఇక ఇప్పుడు వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ అనౌన్స్ చేసాడు. ఇప్పటినుంచి ఆ దేశం తరఫున టీ20 లు పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించబోతున్నాడు అని చెప్పాలి. ఏది ఏమైనా ఇలా 30 ఏళ్ల వయసులోనే అతను వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోవడాన్ని అటు అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>