Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9ace88a7-ab12-4a87-b3f0-c682f878245c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9ace88a7-ab12-4a87-b3f0-c682f878245c-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమా తో ఎంతో బిజీ గా ఉన్నాడు. సూర్య మరోవైపు ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) ఫేం సుధా కొంగర డైరెక్షన్‌ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం సూర్య నటిస్తున్న కంగువ ఆయన కెరీర్ 42 వ సినిమా గా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉంటే సూర్య మరోవైపు ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) ఫేం సుధాకొంగర డైరెక్షన్‌ లో తన 43 వ సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందsocialstars lifestyle{#}vetrimaran;lord siva;Shiva;aishwarya;surya sivakumar;Tamil;Director;Hero;Heroine;News;Cinemaకోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో జతకట్టబోతున్న ఐశ్వర్య....!!కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో జతకట్టబోతున్న ఐశ్వర్య....!!socialstars lifestyle{#}vetrimaran;lord siva;Shiva;aishwarya;surya sivakumar;Tamil;Director;Hero;Heroine;News;CinemaWed, 06 Sep 2023 20:30:00 GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ  సినిమా తో ఎంతో బిజీ గా ఉన్నాడు. సూర్య మరోవైపు ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) ఫేం సుధా కొంగర  డైరెక్షన్‌ లో  ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం  సూర్య నటిస్తున్న కంగువ  ఆయన కెరీర్ 42 వ సినిమా గా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉంటే సూర్య మరోవైపు ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) ఫేం సుధాకొంగర  డైరెక్షన్‌ లో తన 43 వ సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరో సూర్య సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించబోతున్నట్టు ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఐశ్వర్య లక్ష్మి ఓ చిట్‌చాట్‌ లో మాట్లాడుతూ సూర్య గారు నటించిన సూరారై పోట్రులో నేను బొమ్మి పాత్ర లో నటించాల్సింది. కానీ మధురై తమిళ యాస విషయంలో ఆ సినిమా చేయలేకపోయానని ఆమె తెలిపింది.. దీంతో ఈ సారి సుధా కొంగర, సూర్య కాంబినేషన్ లో వస్తున్న సూర్య 43 లో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌ గా దాదాపు ఫైనల్ అయిపోయిందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి.దీనిపై మేకర్స్ మరి కొద్దీ రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.ఇప్పటివరకు వస్తున్న అప్‌డేట్స్ ప్రకారం సూర్య 43 సినిమా షూటింగ్ అక్టోబర్‌ లో మొదలు కానున్నట్లు సమాచారం..ఈ సినిమా గ్యాంగ్ స్టర్‌ డ్రామా నేపథ్యంలో ఉండనుందని తెలుస్తుంది..అలాగే సూర్య  స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌ తో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెట్రిమారన్ విడుతలై పార్ట్‌ 2  షూటింగ్ లో బిజీ గా వున్నారు. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత సూర్య తో వాడివాసల్‌ సినిమా ను చేయనున్నట్లు సమాచారం



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మార్క్ ఆంటోనీలో సిల్క్ స్మిత ఎవరో చెప్పేసిన విశాల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>