MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgజవాన్ చుట్టూ కాపీ మరకలు ! ఒక టాప్ హీరో సినిమా విడుదలకు ముందు ఆసినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. అంచనాలకు తగ్గట్టుగానే టాప్ హీరోలు నటించే సినిమాల పై నెగెటివే కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో ఫలానా సినిమాకు దగ్గరగా ఉందని ఆసినిమా ఫలానా సినిమాకు కాపీ పేస్ట్ అంటూ కామెంట్స్ పెట్టడం సర్వసాధారణమైన విషయంగా మారింది. మరీ ముఖ్యంగా టాప్ హీరోల సినిమాకు సంబంధించి టీజర్ ట్రైలర్ రిలీజ్ కాగానే కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు వీటిమీద స్పెషల్ ఫోకస్ పెట్టడమే కాకుండా jawaan movie{#}Shahrukh Khan;Traffic police;Father;Hero;atlee kumar;media;Cinemaజవాన్ చుట్టూ కాపీ మరకలు !జవాన్ చుట్టూ కాపీ మరకలు !jawaan movie{#}Shahrukh Khan;Traffic police;Father;Hero;atlee kumar;media;CinemaTue, 05 Sep 2023 13:37:43 GMTజవాన్ చుట్టూ కాపీ మరకలు !





ఒక టాప్ హీరో సినిమా విడుదలకు ముందు ఆసినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.  అంచనాలకు తగ్గట్టుగానే టాప్ హీరోలు నటించే సినిమాల పై నెగెటివే కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో  ఫలానా సినిమాకు దగ్గరగా   ఉందని ఆసినిమా ఫలానా సినిమాకు కాపీ పేస్ట్ అంటూ కామెంట్స్ పెట్టడం సర్వసాధారణమైన  విషయంగా మారింది.    



మరీ ముఖ్యంగా టాప్ హీరోల సినిమాకు  సంబంధించి టీజర్ ట్రైలర్ రిలీజ్ కాగానే కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు వీటిమీద స్పెషల్ ఫోకస్ పెట్టడమే కాకుండా ఆ ట్రైలర్ ను బట్టి ఆసినిమాను ఆదర్శకుడు ఫలానా సినిమాకు కాపీగా తీశాడు అంటూ ప్రచారం చేయడం ఒక హాబీగా చాలామంది పెట్టుకున్నారు. ఇప్పుడు అలాంటి ప్రచారం ‘జవాన్’ సినిమా పై కూడ జరుగుతోంది.

అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ నటించిన మూవీకి సంబంధించి ట్రైలర్ అందరికీ నచ్చడంతో ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డాయి.



అయితే ఈమూవీ ట్రైలర్ విడుదల తరువాత ఈమూవీ కథ ఒకప్పుడు కమలహాసన్ నటించిన ‘ఓరు కతియిన్ డైరీ’ మూవీకి కాపీ అంటూ హడావిడి మొదలు పెట్టారు. ఈమూవీని అప్పట్లో ‘ఖైదీ వేట’ గా  తెలుగులోకి డబ్ చేశారు. ‘జవాన్’ సినిమా ట్రైలర్ ను బట్టి ఆమూవీ కథ తండ్రి కొడుకుల కథ అని అర్థం అవుతుంది. తండ్రి రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటే కొడుకు పోలీస్ ఆఫీసర్ గా మారి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు అని తెలుస్తోంది.



కమల్ సినిమా ‘ఖైదీ వేట’ లో కూడ ఈ పాయింట్ కనిపిస్తుంది. అయితే ‘జవాన్’ సినిమాను వందల కోట్ల బడ్జెట్ తో తీస్తే కమల్’ఖైదీ వేట’ మూవీని అప్పట్లో చాల తక్కువ బడ్జెట్ లో తీశారు. దీనితో కమల్ సినిమా కథను పోలిన కథతో ‘జవాన్’ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి అంటూ సోషల్ మీడియాలో కమలహాసన్ అభిమానులు తెగ హడావిడి చేస్తున్నారు..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ ఇంత స్టైలిష్ గా ఉండడానికి కారణం ఎవరో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>