Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlieea40129-4495-453d-914c-074babe93d7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlieea40129-4495-453d-914c-074babe93d7b-415x250-IndiaHerald.jpgవిరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుచుకుంటూ ఉంటారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు. ఎందుకంటే అతను సాధించిన రికార్డులు ఆ రేంజ్ లో ఉన్నాయి. ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు చాలా కష్టపడి కెరియర్ మొత్తం సాధించిన రికార్డులను విరాట్ కోహ్లీ మాత్రం అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేసి తన పేరును లికించుకున్నాడు. బ్యాటింగ్లో పరుగులు చేయడం విషయంలోనే కాదు.. మెరుపు ఫీల్డింగ్ చేయడం విషయంలో కూడా విరాట్ కోహ్లీ తనను మించిన ఆటగాడు మరొకరు లేడు అన్న విషయాన్ని ప్రతి సారి అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉంటాడు. ఇక విరాట్ కోహ్లీ Kohli{#}Nepal;king;King;VIRAT KOHLI;Cricket;Indianకోహ్లీ అరుదైన రికార్డ్.. బ్యాటింగ్ లో కాదు?కోహ్లీ అరుదైన రికార్డ్.. బ్యాటింగ్ లో కాదు?Kohli{#}Nepal;king;King;VIRAT KOHLI;Cricket;IndianTue, 05 Sep 2023 17:30:00 GMTవిరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుచుకుంటూ ఉంటారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు. ఎందుకంటే అతను సాధించిన రికార్డులు ఆ రేంజ్ లో ఉన్నాయి.  ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు చాలా కష్టపడి కెరియర్ మొత్తం సాధించిన రికార్డులను విరాట్ కోహ్లీ మాత్రం అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేసి తన పేరును లికించుకున్నాడు. బ్యాటింగ్లో పరుగులు చేయడం విషయంలోనే కాదు.. మెరుపు ఫీల్డింగ్ చేయడం విషయంలో కూడా విరాట్ కోహ్లీ తనను మించిన ఆటగాడు మరొకరు లేడు అన్న విషయాన్ని ప్రతి సారి అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉంటాడు. ఇక విరాట్ కోహ్లీ మైదానంలో పాదరసంలా కదులుతూ ఎంత కష్టమైన క్యాచ్ అయినా సరే ఇట్టే పట్టేస్తూ ఉంటాడు అని చెప్పాలి.


 అయితే ఇప్పటికే వరల్డ్ క్రికెట్లో ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించి అతను ఒక దిగ్గజం అని నిరూపించుకున్న విరాట్ కోహ్లీ.. ప్రతి మ్యాచ్లో తాను కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాడిని అన్నట్లుగానే కనిపిస్తూ ఎంతో కసిగా ఆడుతూ ఉంటాడు. అందుకే ఎలాంటి రికార్డ్ అయినా సరే కింగ్ కోహ్లీ కి దాసోహం అవ్వాల్సిందే అని ఎంతో మంది అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఆసియా కప్ లో భాగంగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఒక అరుదైన రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. అయితే బ్యాటింగ్లో పరుగులు చేయడం విషయంలో కాదు అటు క్యాచ్ లు పట్టడం విషయంలో ఈ అరుదైన రికార్డు సృష్టించాడు.


 దీంతో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో వికెట్ వచ్చి చేరిపోయినట్లు అయింది. ఏకంగా వికెట్ కీపర్ కాకుండా 100కు పైగా (143) క్యాచ్లు అందుకున్న రెండవ ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. ఇటీవల ఆసియా కప్ లో నేపాల్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సింగిల్ హ్యాండ్ తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నారు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ (156)క్యాష్ ల తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు విరాట్ కోహ్లీ. కాగా విరాట్ కోహ్లీ  ఇప్పటివరకు టి20లో 50 క్యాచ్ లు పట్టాడు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియానే హీటెక్కిస్తున్న అషు రెడ్డి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>