Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bankf811e2e5-c225-48db-8c8a-8574e8903239-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bankf811e2e5-c225-48db-8c8a-8574e8903239-415x250-IndiaHerald.jpgవ్యసనాలకు అలవాటు పడో...లేక కుటుంబ ఆర్ధిక పరిస్థితుల వల్లనో కొంతమంది దొంగతనాలకు అలవాటు పడుతుంటారు. కొందరు జేబులు కత్తిరిస్తే, మరి కొందరు ఇళ్లల్లో చొరబడి బీరువాలు కన్నాలు వేస్తూ ఉంటారు. మరీ బరితెగించిన వారు ఒక్క దొంగతనం తోనే లైఫ్ సెటిల్ ఐపోవాలనే ఉద్దెశంతో బ్యాంకులకు కన్నం వెయ్యాలనుకుంటారు. తాజాగా ఇలాంటి పనే చేసాడు ఒక దొంగ. కానీ ఇతనికి ఒక చిల్లి గవ్వ కూడా దొరకలేదు. ఐతే అనుకున్న పని అవ్వలేదని కోపగించుకోకుండా ఈ దొంగ ఒక చమత్కారం చేసాడు. అసలు ఆ దొంగ ఏం చేసాడు? ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఈ విషయాలు ఇప్పుడు Bank{#}mandalam;Chilli;Donga;Thief;Mancherial;August;Telangana;television;policeబ్యాంకుపై ప్రశంసలు కురిపించిన దొంగ.. ఒక రూపాయి కూడా దొరకలేదట?బ్యాంకుపై ప్రశంసలు కురిపించిన దొంగ.. ఒక రూపాయి కూడా దొరకలేదట?Bank{#}mandalam;Chilli;Donga;Thief;Mancherial;August;Telangana;television;policeTue, 05 Sep 2023 12:56:00 GMTవ్యసనాలకు అలవాటు పడో...లేక కుటుంబ ఆర్ధిక పరిస్థితుల వల్లనో కొంతమంది దొంగతనాలకు అలవాటు పడుతుంటారు. కొందరు జేబులు కత్తిరిస్తే, మరి కొందరు ఇళ్లల్లో చొరబడి బీరువాలు కన్నాలు వేస్తూ ఉంటారు. మరీ బరితెగించిన వారు ఒక్క దొంగతనం తోనే లైఫ్ సెటిల్ ఐపోవాలనే ఉద్దెశంతో బ్యాంకులకు కన్నం వెయ్యాలనుకుంటారు. తాజాగా ఇలాంటి పనే చేసాడు ఒక దొంగ. కానీ ఇతనికి ఒక చిల్లి గవ్వ కూడా దొరకలేదు. ఐతే అనుకున్న పని అవ్వలేదని కోపగించుకోకుండా ఈ దొంగ ఒక చమత్కారం చేసాడు. అసలు ఆ దొంగ ఏం చేసాడు? ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం లోని మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం లో చోటుచేసుకుంది. మండల కేంద్రం లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆగష్టు 31 న ఒక దొంగ రాత్రిపూట బ్యాంకు లోకి చొరబడి దొంగతనం చెయ్యాలనుకున్నాడు. అనుకున్నట్టే బ్యాంకు లోకి ఐతే వెళ్లగలిగాడు కానీ డబ్బు ఉన్న లోకెర్ గాడి లోకి మాత్రం వెళ్లలేకపోయాడు. ఇంతా కస్టపడి తాళాలు పగలకొట్టి బ్యాంకు లోకి ప్రవేశించిన ఆ దొంగకు చిల్లి గవ్వ కూడా దొరకలేదు. కస్టళ్లన్నీ తీరిపోతాయి అన్న అతని ఆశలు ఆశలు గానే మిగిలిపోయాయి. దాంతో తిరిగి వెళ్లేముందు ఆ దొంగ "గుడ్ న్యూస్ ....ఇక్కడ దొంగతనం చెయ్యడం నా వల్లకాలేదు. ఈ బ్యాంకు భద్రతకు నా హ్యాట్స్ ఆఫ్ "అంటూ ఆ బ్యాంకు యాజమాన్యాన్ని ప్రశంసిస్తూ ఒక చిన్న చిట్టి ని అక్కడ వదిలి వెళ్ళాడు. చివరిలో తనకు ఒక్క రూపాయి కూడా దొరకలేదని, తనను వెతకొద్దని వేడుకున్నాడు.

మరుసటిరోజు యధావిధిగా బ్యాంకు కు వచ్చిన బ్యాంకు సిబ్బంది ఆ నోట్ చూసి అవాక్కయ్యారు. వెంటనే బ్యాంకు లో ఉన్న సి సి టీవీ కెమెరాలలో రికార్డు ఐన దృశ్యాలను చూసారు. ఒక దొంగ నల్లటి వస్త్రాలు, మాస్క్ ధరించి అటూ ఇటూ కదులుతున్న దృశ్యాలు కనిపంచాయి. వెంటనే పోలీసులకు తెలియజేసారు. పోలీసులు విచారణ మొదలు పెట్టారు.  
ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ ఇంత స్టైలిష్ గా ఉండడానికి కారణం ఎవరో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>