EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ap68492f4b-dbf4-494b-8c80-11bbf515872f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ap68492f4b-dbf4-494b-8c80-11bbf515872f-415x250-IndiaHerald.jpgఆంధ్రాలో జనం అల్లాడుతున్నారు. ఆంధ్ర మొత్తం అస్తవ్యస్తం అయిపోయిందని ఎల్లో మీడియా వారు తెగ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం జీఎస్డీపీ లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ద్విచక్ర వాహనాల కొనుగోలులో ఆంధ్ర 7.6 శాతం మెరుగుదల ఉంది. కార్ల కొనుగోలులో కూడా ఎక్కువ కొనుగోలు ఉంది. అదే సమయంలో ప్యాసింజర్ వెహికల్స్ తగ్గాయి. ఆటోలు కూడా ఎక్కువగా కొంటున్నారు. మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వారే ఆటోలు, కార్లు కొనగల శక్తి వస్తుంది. దీనికి ఎలా డబ్బులు వస్తాయంటే ప్రభుత్వం వారికి లోన్లు ఇవ్వాలి. ఇలా AP{#}Ram Madhav;Shakti;Pawan Kalyan;Hyderabad;TDP;Jagan;CBN;Andhra Pradesh;media;CM;Governmentఆంధ్రాలో ఈ అభివృద్ధి ఆ మీడియాకు కనపడదా?ఆంధ్రాలో ఈ అభివృద్ధి ఆ మీడియాకు కనపడదా?AP{#}Ram Madhav;Shakti;Pawan Kalyan;Hyderabad;TDP;Jagan;CBN;Andhra Pradesh;media;CM;GovernmentTue, 05 Sep 2023 06:00:00 GMTఆంధ్రాలో జనం అల్లాడుతున్నారు. ఆంధ్ర మొత్తం అస్తవ్యస్తం అయిపోయిందని ఎల్లో మీడియా వారు తెగ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం జీఎస్డీపీ లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ద్విచక్ర వాహనాల కొనుగోలులో ఆంధ్ర 7.6 శాతం మెరుగుదల ఉంది. కార్ల కొనుగోలులో కూడా ఎక్కువ కొనుగోలు ఉంది. అదే సమయంలో ప్యాసింజర్ వెహికల్స్ తగ్గాయి.


ఆటోలు కూడా ఎక్కువగా కొంటున్నారు. మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వారే ఆటోలు, కార్లు కొనగల శక్తి వస్తుంది. దీనికి ఎలా డబ్బులు వస్తాయంటే ప్రభుత్వం వారికి లోన్లు ఇవ్వాలి. ఇలా ఎన్నో రకాల లోన్లు ఇవ్వడం వల్లే అది సాధ్యమవుతుంది. కానీ రాష్ట్రంలో రోడ్డు వ్యవస్థ నాశనం అయిపోయింది. పాలన వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది.


పవన్ కల్యాణ్ అయితే ఏకంగా వాలంటీర్ల వ్యవస్థలో అవినీతి జరుగుతుంది. దాని వల్ల చాలా మంది డాటా హైదరాబాద్ లోని నానక్ రాం గూడలో ఉన్న దాంట్లో అమ్మేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని సీఎం జగన్ అప్పుల పాలు చేసేస్తున్నాడు. ఇక టీడీపీ వస్తేనే ప్రజలకు న్యాయం చేయగలం అని చెబుతారు. అదే సమయంలో జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెబుతారు. మరో పక్క డబ్బులు, నిధులు ఎలా తీసుకొస్తారంటే పెట్టుబడులు ఆకర్షిస్తామని చెబుతారు.


ఇప్పుడు ఆంధ్రలో కూడా అదానీ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుంటే మాత్రం రాష్ట్రంలో భూముల్ని తెగ నమ్ముతున్నారని చెబుతారు. అదే చంద్రబాబు హయాంలో విదేశీ కంపెనీలు వచ్చినా అది సంక్షేమం కోసం అని తెగ ప్రచారం చేస్తారు. జగన్ చేస్తే మాత్రం దాని వెనక అవినీతి ఉందని ఆరోపణలు చేయడం.. చంద్రబాబు చేస్తే మాత్రం దాని వెనక ఆంధ్ర ప్రజల సంక్షేమం దాగుందని చెప్పడం ఎల్లో మీడియాకే సాధ్యమవుతుంది. మరి ఆ ఎల్లో మీడియా రాతలు జనం నమ్ముతారా?



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భర్తకు ఎఫైర్ ఉందనే అనుమానం.. భార్య ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>