PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/congress-takes-dig-at-centre-over-one-nation-one-election-panel-compositionf38536f9-f115-4119-93c2-61f2eadaf5e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/congress-takes-dig-at-centre-over-one-nation-one-election-panel-compositionf38536f9-f115-4119-93c2-61f2eadaf5e1-415x250-IndiaHerald.jpgఅలాగే పోటీకి ఒక్క పేరుమాత్రమే వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించింది. నియోజకర్గంలో పోటీకి ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చిందంటే వాళ్ళకి టికెట్ ఫైనల్ అయినట్లే. ఇలాంటి నియోజకవర్గాలు 24 ఉన్నాయి. కొడంగల్ లో రేవంత్ రెడ్డి, సంగారెడ్డి-జగ్గారెడ్డి,కామారెడ్డిలో షబ్బీర్ ఆలీ, భద్రాచలంలో పొడెంవీరయ్య, నాగార్జున సాగర్ లో కుందూరు జయవీర్ రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలంపూర్లో సంపత్ కుమార్, మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు, ఆంథోల్లో దామోదరరాజనరసింహా, congress telangana revanth{#}Kumaar;Akkineni Nagarjuna;jeevan;prem;revanth;sampath;sridhar;venkat;Revanth Reddy;Congress;AdiNarayanaReddy;tuesday;Application;central government;Reddy;Kodangalహైదరాబాద్ : వీళ్ళకి టికెట్లు ఫైనలైనట్లేనా ?హైదరాబాద్ : వీళ్ళకి టికెట్లు ఫైనలైనట్లేనా ?congress telangana revanth{#}Kumaar;Akkineni Nagarjuna;jeevan;prem;revanth;sampath;sridhar;venkat;Revanth Reddy;Congress;AdiNarayanaReddy;tuesday;Application;central government;Reddy;KodangalTue, 05 Sep 2023 07:00:00 GMT



రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక కసరత్తు కొలిక్కివస్తున్నట్లే ఉంది. మొత్తం 119 నియోజకవర్గాలకు 1220 మంది నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను వడబోసి నియోజకవర్గానికి ముగ్గురు బలమైన నేతలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని  ప్రదేశ్ ఎన్నికల కమిటి రెడీచేసింది. వివిధ కోణాల్లో దరఖాస్తులను పరిశీలించి షార్టలిస్ట్ చేసిన తర్వాత ముగ్గురిపేర్లను ఫైనల్ చేసింది. ఈ పేర్లలో కూడా ప్రయారిటి బేసిస్ లో 1,2,3 అంటు టిక్కులు పెట్టి జాబితాను రెడీచేసి కవర్లో పెట్టి సీల్ చేసింది.





అలాగే పోటీకి ఒక్క పేరుమాత్రమే వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించింది. నియోజకర్గంలో పోటీకి ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చిందంటే వాళ్ళకి టికెట్ ఫైనల్ అయినట్లే. ఇలాంటి నియోజకవర్గాలు 24 ఉన్నాయి. కొడంగల్ లో రేవంత్ రెడ్డి, సంగారెడ్డి-జగ్గారెడ్డి,కామారెడ్డిలో షబ్బీర్ ఆలీ, భద్రాచలంలో పొడెంవీరయ్య, నాగార్జున సాగర్ లో కుందూరు జయవీర్ రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలంపూర్లో సంపత్ కుమార్, మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు, ఆంథోల్లో దామోదరరాజనరసింహా,





పరిగిలో రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ లో గడ్డం ప్రసాద్, ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి, ఆలేరులో వీర్ల అయిలయ్య, దేవరకొండలో వద్య రమేష్ నాయక్, వేములవాడలో ఆది శ్రీనివాస్, ధర్మపురిలో లక్ష్మణ్, పరకాలలో ఇనగాల వెంకట్రామరెడ్డి, హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడలో పద్మావతి, మధిర, బట్టి విక్రమార్క, మంథని శ్రీధర్ బాబు, జగిత్యాలలో జీవన్ రెడ్డి, ములుగులో సీతక్క, హుజూరాబాద్ లో బల్మూరి వెంకట్ కు టికెట్ ఖాయమైనట్లే.





ప్రదేశ్ ఎన్నికల కమిటి ఇచ్చిన సీల్డ్ కవర్ను స్క్రీనింగ్ కమిటి సభ్యులు మంగళవారం జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులతో చర్చిస్తారు. ఆ తర్వాత 6వ తేదీన స్క్రీనింగ్ కమిటి తన అభిప్రాయాలతో నివేదిక రెడీచేసి కేంద్ర ఎన్నికల కమిటికి అందిస్తుంది. అక్కడ మళ్ళీ సమావేశమై అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది. బహుశా ఢిల్లీలోనే అభ్యర్దులను ప్రకటించే అవకాశముంది. బీసీలకే పెద్ద పోటీ వేయబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు. మరి ఆచరణలో ఎంతవరకు జరుగుతుందో చూడాలి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భర్తకు ఎఫైర్ ఉందనే అనుమానం.. భార్య ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>