PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-ysr-jagan-sonia-rahul18ef0efc-cd79-43cb-954a-797b3463c9e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-ysr-jagan-sonia-rahul18ef0efc-cd79-43cb-954a-797b3463c9e3-415x250-IndiaHerald.jpgచార్జిషీట్లో వైఎస్ పేరున్న విషయాన్ని తాను డైరెక్టుగా సోనియానే ప్రశ్నించారట. అందుకు సోనియా జవాబిస్తు సీబీఐ చార్జిషీట్లో వైఎస్సార్ పేరు పెడుతున్నట్లు తమకు తెలీదన్నారు. వైఎస్ అంటే తమకు ఎంతో అభిమానమని చెప్పారట. తాము వైఎస్ పేరును చార్జిషీట్లో పెట్టించామని జరిగిన ప్రచారాన్ని ఎలా నమ్మారని షర్మిలనే ఎదురు ప్రశ్నించారట. అందుకనే కాంగ్రెస్, సోనియా, రాహుల్ కు షర్మిల క్లీన్ చిట్ ఇచ్చేశారు. ys sharmila ysr jagan sonia rahul{#}SoniaGandhi;Sharmila;Reddy;Jagan;Y. S. Rajasekhara Reddy;CBI;Congress;rahul;Rahul Sipligunjఅమరావతి : షర్మిల ఇంత అమాయకురాలా ?అమరావతి : షర్మిల ఇంత అమాయకురాలా ?ys sharmila ysr jagan sonia rahul{#}SoniaGandhi;Sharmila;Reddy;Jagan;Y. S. Rajasekhara Reddy;CBI;Congress;rahul;Rahul SipligunjMon, 04 Sep 2023 07:00:00 GMT



ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకైనా, సంస్ధలకైనా క్లీన్ చిట్ ఇవ్వాల్సింది దర్యాప్తు సంస్ధలు, కోర్టులే కదాని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇక్కడ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీతో పాటు సోనియాగాంధి, రాహుల్ గాంధీలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేయటం ఖాయమైపోయింది. కాకపోతే ముహూర్తం ఎప్పుడన్నదే తేలాలి. ఈనెల 6వ తేదీన ఢిల్లీకి వెళ్ళి సోనియా, రాహుల్, ఖర్గే సమక్షంలో షర్మిల విలీనం ప్రకటన చేస్తారని అనుకుంటున్నారు.





ఇక విషయానికి వస్తే వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ అవినీతి కేసులుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. 16 మాసాలు జైలులో కూడా ఉంచింది. ఆ కేసులన్నీ కోర్టుల్లో వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. పనిలో పనిగా జగన్ తో పాటు చనిపోయిన వైఎస్సార్ పేరును కూడా సీబీఐ చార్జిషీట్లలో చేర్చింది. అంటే వైఎస్ ను సీబీఐ, కాంగ్రేస్ అవినీతిపరుడిగా చిత్రీకరించాయి. అదే విషయంపై వైఎస్సార్ ఆభిమానుల నుండి షర్మిలకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. జగన్ను జైల్లో పెట్టించి, వైఎస్సార్ పేరును సీబీఐ చార్జిషీట్లలో పెట్టించిన కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీని విలీనం చేయటం ఏమిటని మద్దతుదారులు మండిపోతున్నారు.





దీనికి షర్మిల సమాధానమిస్తు వైఎస్ పేరును సీబీఐ చార్జిషీట్లో పెట్టడంలో కాంగ్రెస్, సోనియాకు తెలిసి జరిగిందికాదట. వైఎస్ పేరును సీబీఐ చార్జిషీట్లో పెడుతున్న విషయం సోనియాకు తెలీదట. తెలియకజరిగిన పొరబాటును సోనియా, రాహుల్ ను నిందించటం ఏమిటని షర్మిల ఎదురు ప్రశ్నించారు.





చార్జిషీట్లో వైఎస్ పేరున్న విషయాన్ని తాను డైరెక్టుగా సోనియానే ప్రశ్నించారట. అందుకు సోనియా జవాబిస్తు సీబీఐ చార్జిషీట్లో వైఎస్సార్ పేరు పెడుతున్నట్లు తమకు తెలీదన్నారు. వైఎస్ అంటే తమకు ఎంతో అభిమానమని చెప్పారట. తాము వైఎస్ పేరును చార్జిషీట్లో పెట్టించామని జరిగిన ప్రచారాన్ని ఎలా నమ్మారని షర్మిలనే ఎదురు ప్రశ్నించారట.  అందుకనే కాంగ్రెస్, సోనియా, రాహుల్ కు షర్మిల  క్లీన్ చిట్ ఇచ్చేశారు.





అంతాబాగానే ఉందికానీ చనిపోయిన వైఎస్ ను సీబీఐ అబ్స్ కాండింగ్ అని ఎలా వ్యవహరించింది అన్న ప్రశ్నకు షర్మిల సమాధానం చెప్పలేదు. అలాగే సీబీఐ చార్జిషీట్లో వైఎస్ పేరును చేర్చిన విషయం తెలిసిన తర్వాత సోనియా, రాహుల్ ఎందుకు తీసేయించలేదు ? అప్పట్లో ఈ విషయమై ఇద్దరూ ఎక్కడా క్లారిటి ఇవ్వలేదు. వైఎస్ పేరు విషయం సరే మరి జగన్మోహన్ రెడ్డిపైన కేసులు పెట్టి జైలుకు పంపటం కూడా సోనియా, రాహుల్ కు తెలీదా ? లేకపోతే జగన్ జైలుకు వెళ్ళటం షర్మిలకు ఓకేనా ?




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుక్ జవాన్ రిజల్ట్ కోసం.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>