Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood081b3199-9329-490b-97b8-d81ee8bb97bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood081b3199-9329-490b-97b8-d81ee8bb97bb-415x250-IndiaHerald.jpgహీరోయిన్ సమంత సినిమాల్లో ఎంతలా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే సక్సెస్ ట్రాక్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్గా హవా నడిపించింది. ఇక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇంకా సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది అని చెప్పాలి. అయితే ఇలా ప్రొఫెషనల్ లైఫ్ లో సూపర్ సక్సెస్ అయిన సమంత పర్సనల్ లైఫ్ లో మాత్రం వరుసగా ఫెయిల్ అవుతూనే వచ్చింది. మొదట్లో సిద్ధార్థతో ప్రేమలో మునిగి తేలిన Tollywood{#}Varasudu;Samantha;kushi;Kushi;marriage;Chaitanya;Naga Chaitanya;Success'ఖుషి' సినిమాలో విడాకులకు కారణం చెప్పేసిన సమంత.. అది నిజమేనా?'ఖుషి' సినిమాలో విడాకులకు కారణం చెప్పేసిన సమంత.. అది నిజమేనా?Tollywood{#}Varasudu;Samantha;kushi;Kushi;marriage;Chaitanya;Naga Chaitanya;SuccessMon, 04 Sep 2023 09:30:00 GMTహీరోయిన్ సమంత సినిమాల్లో ఎంతలా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే సక్సెస్ ట్రాక్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్గా హవా నడిపించింది. ఇక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇంకా సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది అని చెప్పాలి. అయితే ఇలా ప్రొఫెషనల్ లైఫ్ లో సూపర్ సక్సెస్ అయిన సమంత పర్సనల్ లైఫ్ లో మాత్రం వరుసగా ఫెయిల్ అవుతూనే వచ్చింది.


 మొదట్లో సిద్ధార్థతో ప్రేమలో మునిగి తేలిన సమంత.. ఇక ఆ తర్వాత సిద్ధార్థ కు తనతో పాటు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని తెలిసి చివరికి అతనికి బ్రేకప్ చెప్పేసింది. ఇక తర్వాత అక్కినేని వారసుడు నాగచైతన్యతో ప్రేమలో పడింది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. దీంతో హమ్మయ్య సమంత పర్సనల్ లైఫ్ కూడా ఇప్పుడు బాగుంది అని అందరూ అనుకునే లోపే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఎవరి దారి చూసుకున్నారు. అయితే సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం ఏంటి అన్నది ఇప్పటికీ ఎవరికి తెలియదు.


 విడాకుల సమయంలో అందరూ సమంతనే టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు సమంత హీరోయిన్గా నటించిన ఖుషి మూవీతో ఇక సమంత తన విడాకులకు కారణం చెప్పగానే చెప్పిందని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. సమంత పెళ్లయిన నాటి నుంచి పిల్లలకు తాపత్రయపడిందని.. నాగచైతన్య పట్టించుకోలేదని.. అదే సమయంలో గొడవ జరిగినప్పుడల్లా వదిలేసి వెళ్ళిపో అని నాగచైతన్య అన్నాడని.. ఇక సమంత విసిగిపోయి విడిపోవాలని నిర్ణయించుకుందని అందరూ అనుకుంటున్నారు. అయితే సినిమాలో సమంత క్యారెక్టర్ కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పాలి. దీంతో సమంత తన విడాకులకు కారణం సినిమాలో చెప్పకనే చెప్పిందని అందరూ చర్చించుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుక్ జవాన్ రిజల్ట్ కోసం.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>