MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgటాప్ హీరోలకు మాత్రమే కాదు మీడియం రేంజ్ హీరోలకు కూడ నిర్మాతలు భారీ పారితోషికాలను ఆఫర్ చేయడం ఒక ట్రెండ్ గా మారింది. సాధారణంగా హీరోలు ఎవరైనా నిర్మాతలు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినప్పుడు ఆసినిమాలను సాధారణంగా వదులుకోరు. అయితే దీనికి భిన్నంగా నాగచైతన్య ప్రవర్తించడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. లవ్ స్టోరీ’ మూవీ తరువాత చైతన్య సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతున్న పరిస్థితులలో అతడి మార్కెట్ బాగా దెబ్బ తిన్నది అన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఒక మీడియం nagachaitanya{#}Tammudu;Thammudu;Chaitanya;Athidhi;vegetable market;Naga Chaitanya;Father;Tollywood;Hero;News;Cinemaషాకింగ్ 9కోట్ల పారితోషికం తిరస్కరించిన నాగచైతన్య !షాకింగ్ 9కోట్ల పారితోషికం తిరస్కరించిన నాగచైతన్య !nagachaitanya{#}Tammudu;Thammudu;Chaitanya;Athidhi;vegetable market;Naga Chaitanya;Father;Tollywood;Hero;News;CinemaMon, 04 Sep 2023 09:00:00 GMTటాప్ హీరోలకు మాత్రమే కాదు మీడియం రేంజ్ హీరోలకు కూడ నిర్మాతలు భారీ పారితోషికాలను ఆఫర్ చేయడం ఒక ట్రెండ్ గా మారింది. సాధారణంగా హీరోలు ఎవరైనా నిర్మాతలు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినప్పుడు ఆసినిమాలను సాధారణంగా వదులుకోరు. అయితే దీనికి భిన్నంగా నాగచైతన్య ప్రవర్తించడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.





‘లవ్ స్టోరీ’ మూవీ తరువాత చైతన్య సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతున్న పరిస్థితులలో అతడి మార్కెట్ బాగా దెబ్బ తిన్నది అన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఒక మీడియం రేంజ్ హీరోతో తీస్తున్న ఒక మూవీలో ఒక అతిధి పాత్ర కోసం నాగచైతన్యను సంప్రదించడం జరిగింది అంటూ వార్తలు వినిస్తున్నాయి.





ఆసినిమాకు సంబంధించిన కథ రీత్యా చైతన్య పాత్ర కేవలం 20 నిముషాలు మాత్రమే ఉంటుందట. ఈ సినిమాకు సంబంధించి 10 రోజులు పని చేస్తే చాలని పారితోషికంగా 9 కోట్లు ఇస్తానని ఆమూవీ దర్శక నిర్మాతలు చైతూ తో రాయబరాలు చేసినట్లు టాక్. చైతూ ఆదర్శకుడు చెప్పిన తన పాత్రకు సంబంధించిన కథ విన్న తరువాత ఆపాత్రలో నటించడానికి చైతన్య పెద్దగా ఆశక్తి కనపరచలేదు అన్న వార్తలు గుప్పుమంటున్నాయి.





నాగచైతన్య లాంటి హీరోకు 9 కోట్ల పారితోషికం అంటే చాల ఎక్కువ. అంత భారీ పారితోషికం ఆఫర్ చేసినప్పటికీ కేవలం పారితోషికం కోసం ప్రాధాన్యత లేని పాత్రలో తాను నటించలేను అని సున్నితంగా చైతూ తప్పుకోవడంతో ఇప్పుడు ఆ ప్రత్యేక పాత్రను చేయగల మీడియం రేంజ్ హీరో కోసం అన్వేషణ కొనసాగుతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చైతన్య చెందూ మొండేటి దర్శకత్వంలో ఒక యదార్థ సంఘటనకు సంబంధించిన సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తన తండ్రి నాగార్జున తమ్ముడు అఖిల్ తో కలిసి అక్కినేని మల్టీ స్టారర్ మూవీలో నటించడానికి నాగచైతన్య ఆనేక కథలు వింటున్నట్లు టాక్..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుక్ జవాన్ రిజల్ట్ కోసం.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>