PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/it-notice-chandrababu-amaravati4aa6cab7-473f-4609-98c5-72cbdde916cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/it-notice-chandrababu-amaravati4aa6cab7-473f-4609-98c5-72cbdde916cd-415x250-IndiaHerald.jpgఅందుకనే తనకు బాగా అలవాటైన దబాయింపు సెక్షన్ మొదలుపెట్టినా ఇక్కడ పనిచేయలేదు. మామూలుగా చంద్రబాబు వైఖరి ఎలాగుంటుందంటే తాను తప్పించుకోవటానికి వీల్లేనపుడు, తాను తగులుకుంటానని అనుకున్నపుడు వెంటనే ఎదురుదాడిలోకి దిగేస్తారు. ‘తనను విచారించే అర్హత మీకు లేదని…తనను విచారించేంత స్ధాయి మీకు లేదని…తాను మీ విచారణ పరిధిలోకి రానని’ దబాయిస్తారు. ఇక్కడ కూడా అలాంటి దబాయింపే చేసినా పనిచేయలేదు.IT notice chandrababu Amaravati{#}Amaravati;court;118;Qualification;CBNఅమరావతి : ఆధారాలతో సహా దొరికేశారా ? పెరిగిపోతున్న టెన్షన్అమరావతి : ఆధారాలతో సహా దొరికేశారా ? పెరిగిపోతున్న టెన్షన్IT notice chandrababu Amaravati{#}Amaravati;court;118;Qualification;CBNMon, 04 Sep 2023 03:00:00 GMT

ఇప్పుడు ఏమిచేయాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. అమరావతి రాజధాని నాసిరకం నిర్మాణానికి సంబంధించి చెల్లింపుల్లో రు. 118 కోట్లు చంద్రబాబునాయుడుకు ముడుపులు అందినట్లు ఐటి శాఖకు కచ్చితమైన ఆధారాలు దొరికాయి. ఆధారాల ఆధారంగానే చంద్రబాబుకు ఐటిశాఖ నోటీసులు ఇచ్చింది. ఇపుడు ఆ నోటీసులకు సమాధానం చెప్పటం ఎలాగ ? చెప్పకుండా తప్పించుకోవటం ఎలాగ ? అన్నదే చంద్రబాబును పట్టి పీడిస్తున్నది.





అందుకనే తనకు బాగా అలవాటైన దబాయింపు సెక్షన్ మొదలుపెట్టినా ఇక్కడ పనిచేయలేదు. మామూలుగా చంద్రబాబు వైఖరి ఎలాగుంటుందంటే తాను తప్పించుకోవటానికి వీల్లేనపుడు, తాను తగులుకుంటానని అనుకున్నపుడు వెంటనే ఎదురుదాడిలోకి దిగేస్తారు. ‘తనను విచారించే అర్హత మీకు లేదని…తనను విచారించేంత స్ధాయి మీకు లేదని…తాను మీ విచారణ పరిధిలోకి రానని’ దబాయిస్తారు. ఇక్కడ కూడా అలాంటి దబాయింపే చేసినా పనిచేయలేదు.





తమ విచారణ పరిధి, తమకున్న అధికారాలు, చంద్రబాబును విచారించేందుకు తమకున్న అర్హతలన్నింటినీ ఐటి శాఖ వివరించి చెప్పింది. తామిచ్చిన నోటీసులకు సమాధానాలు చెప్పకపోతే జరగబోయే పర్యవసానాలకు మీరే బాధ్యత వహించాల్సుంటుందని షోకాజ్ నోటీసులో చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఇపుడు ఏమిచేయాలో దిక్కుతోచటంలేదు. సమాధానాలు చెప్పటమా ? లేకపోతే చెప్పకుండా తప్పించుకుని కోర్టులో కేసు వేయటమా ? అన్నదే చంద్రబాబు ఆలోచిస్తున్నది.





రెండింటిలో ఏ మార్గంలో వెళితే తనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయనే విషయాన్ని తన సలహాదారులతో చంద్రబాబు మాట్లాడుతున్నారట. తనను ఏ విచారణ కమిటి కూడా ఏమీ చేయలేందని, అన్నీ విచారణల్లో తనకు క్లీన్ చిట్ వచ్చిందని చంద్రబాబు పదేపదే చెప్పుకుంటారు. నిజానికి ఏ విచారణ కమిటీ కూడా చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఏ కోర్టు కూడా చంద్రబాబు నిప్పని చెప్పలేదు. విచారణలకు హాజరుకాకుండా, కోర్టులో విచారణలు జరగకుండా స్టేలు తెచ్చుకోవటం తనకు తాను నిప్పునని క్లీన్ సర్టిఫికేట్ ఇఛ్చుకుని ప్రచారం చేసుకోవటం చంద్రబాబుకు బాగా తెలుసు. మరీసారి ఏమిచేస్తారో చూడాలి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : లాగింది తీగను మాత్రమేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>