PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-amaravati-it0171fb09-2525-4e1e-9cc2-fc74e8ac50e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-amaravati-it0171fb09-2525-4e1e-9cc2-fc74e8ac50e1-415x250-IndiaHerald.jpgతాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టుతో పాటు మరికొన్ని భవనాల నిర్మాణాలు మొదలయ్యాయి. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు పూర్తయ్యాయి. వీటన్నింటినీ షాపూర్జీ పల్లోంజి, ఎల్ అండ్ టీ సంస్ధలే పూర్తిచేశాయి. ఇక్కడ విషయం ఏమిటంటే తాత్కాలిక నిర్మాణాల అంచనా వ్యయాలు రు. 300 కోట్లతో మొదలై చివరకు రు. 1100 కోట్లకు చేరుకున్నాయి. ఇన్ని వందల కోట్లు ఎందుకు పెరిగాయి చంద్రబాబుకే తెలియాలి. అలాగే వాటి నిర్మాణాలు అత్యంత నాసిరకంగా ఎందుకున్నాయో కంపెనీలు, చంద్రబాబే సమాధానం చెప్పాలి. chandrababu Amaravati IT{#}Amaravati;High court;118;CBN;Capitalఅమరావతి : లాగింది తీగను మాత్రమేనా ?అమరావతి : లాగింది తీగను మాత్రమేనా ?chandrababu Amaravati IT{#}Amaravati;High court;118;CBN;CapitalMon, 04 Sep 2023 05:00:00 GMT



తీగలాగితే డొంకంతా కదిలింది అనే సామెత తెలుగులో చాలా పాపులర్. అంటే అర్ధమేంటంటే ఎక్కడో చిన్న విషయాన్ని పట్టుకుని కదిపితే మొత్తం వ్యవహారమంతా బయటపడిందని. ఇపుడు ఐటి శాఖ చంద్రబాబునాయుడుకు నోటీసులు ఇవ్వటం అచ్చంగా అలాంటిదే. రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు హయాంలో కొన్ని నిర్మాణాలు జరిగాయి. అవన్నీ బాగా నాసిరకం నిర్మాణాలే. గట్టి వర్షంపడితే చాలు భవనాలన్నీ లోపల జలమయమైపోతాయి. వర్షానికే భవనాల్లోకి నీళ్ళు  అంతలా కారిపోతాయి.





తాత్కాలిక  సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టుతో పాటు మరికొన్ని భవనాల నిర్మాణాలు మొదలయ్యాయి. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు పూర్తయ్యాయి. వీటన్నింటినీ షాపూర్జీ పల్లోంజి, ఎల్ అండ్ టీ సంస్ధలే పూర్తిచేశాయి. ఇక్కడ విషయం ఏమిటంటే తాత్కాలిక నిర్మాణాల అంచనా వ్యయాలు రు. 300 కోట్లతో మొదలై చివరకు రు. 1100 కోట్లకు చేరుకున్నాయి. ఇన్ని వందల కోట్లు ఎందుకు పెరిగాయి చంద్రబాబుకే తెలియాలి. అలాగే వాటి నిర్మాణాలు అత్యంత నాసిరకంగా ఎందుకున్నాయో కంపెనీలు, చంద్రబాబే సమాధానం చెప్పాలి.





వేల కోట్లరూపాయలు పెట్టి నిర్మించిన తాత్కాలిక భవనాలు అంత నాసిరకంగా ఉన్నాయంటేనే వీటిల్లో ఎన్నికోట్లు బొక్కేశారో అర్ధమైపోతోంది. అందుకనే అమరావతి నిర్మాణంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అనుమానించారు. కుంభకోణాలపై అనుమానాలు, ప్రచారంగా మాత్రమే ఇంతకాలం ఉండిపోయింది. అయితే ఐటి శాఖ జారీచేసిన షోకాజ్ నోటీసుతో అవినీతి, కుంభకోణానికి ఆధారాలు కూడా దొరికాయి. షాపూర్జీ పల్లోంజిలో సబ్ కాంట్రాక్టులు చేసిన సంస్ధల నుండి చంద్రబాబు దొరికినంత దోచేశారనేందుకు ఇపుడు ఆధారాలు దొరికాయి.





సబ్ కంట్రాక్టర్ మనోజ్ వాసుదేవ్ పర్దాసాని (ఎంవీపీ) ద్వారా చంద్రబాబుకు రు. 118 కోట్లు ముట్టినట్లు ఆధారాలతో సహా దొరికింది. నిజానికి జరిగిన కుంభకోణంలో దొరికిన ఆధారం చాలా చిన్నదే. అయితేనేం దొరికిన చిన్న తీగను గట్టిగా లాగితే మొత్తం డొంకంతా బయడపడే అవకాశముంది. వేల కోట్లరూపాయల కుంభకోణంలో చంద్రబాబుకు ముట్టిన మొత్తం ఎంత ? ఎవరెవరి వాటాలు ఎంత అన్నది తేలాలి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : లాగింది తీగను మాత్రమేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>