HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb2955864-cb21-462b-9503-b9dd1296644f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb2955864-cb21-462b-9503-b9dd1296644f-415x250-IndiaHerald.jpgనేటి కాలంలో చాలా మంది కూడా టెన్షన్, ఆందోళన సమస్యలతో చాలా బాధ పడుతున్నారు. ఆ సమస్యలని తగ్గించడానికి ఓ సూపర్ వంటకం ఉంది. అదే తల్బినా.. ఇక బార్లీ గింజలతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఒత్తిడి ఈజీగా తగ్గుతుంది.జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.అంతేగాక గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఎముకలు ధృడంగా తయారవుతాయి.ఇలా చాలా రకాలుగా తల్బినా మనకు సహాయపడుతుంది.ఈ తల్బినాను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం.బార్లీ గింజలు ఉంటే చాలు దీనిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇకhealth{#}Gas Stove;Heart;Manamటెన్షన్, ఆందోళన, ఒత్తిడిని పోగొట్టే ఫుడ్ ఇదే?టెన్షన్, ఆందోళన, ఒత్తిడిని పోగొట్టే ఫుడ్ ఇదే?health{#}Gas Stove;Heart;ManamMon, 04 Sep 2023 16:03:00 GMTనేటి కాలంలో చాలా మంది కూడా టెన్షన్, ఆందోళన సమస్యలతో చాలా బాధ పడుతున్నారు. ఆ సమస్యలని తగ్గించడానికి ఓ సూపర్ వంటకం ఉంది. అదే తల్బినా.. ఇక బార్లీ గింజలతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఒత్తిడి ఈజీగా తగ్గుతుంది.జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.అంతేగాక గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఎముకలు ధృడంగా తయారవుతాయి.ఇలా చాలా రకాలుగా తల్బినా మనకు సహాయపడుతుంది.ఈ తల్బినాను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం.బార్లీ గింజలు ఉంటే చాలు దీనిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ తల్బినాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


తల్బినా తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..బార్లీ – ఒక కప్పు, పాలు – ఒక లీటర్, కుంకుమ పువ్వు – చిటికెడు ఇంకా తరిగిన డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, తరిగిన ఖర్జూర పండ్లు – రుచికి తగినన్ని తీసుకోవాలి.


ఈ తల్బినా తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మనం బార్లీ గింజలను శుభ్రంగా కడిగి అందులో తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఈ బార్లీ గింజలు చక్కగా నానిన తరువాత ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. ఆ పాలు వేడయ్యాక కుంకుమ పువ్వు, బార్లీ గింజలను వేసి చిన్న మంటపై మెత్తగా అయ్యే దాకా ఉడికించాలి. ఆ బార్లీ గింజలు ఉడికిన తరువాత డ్రై ఫ్రూట్స్, ఖర్జూర పండ్లు వేసి కలిపి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత అంతా కలిసేలా మరోసారి స్మాషర్ తో స్మాష్ చేసుకోవాలి. ఆ తరువాత దీనిని గిన్నెలోకి తీసుకుని పైన తేనె వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే తల్బినా తయారవుతుంది. ఇక దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బజ్: వైరల్ గా మారుతున్న జైలర్ మూవీ యాక్టర్స్ రెమ్యూనరేషన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>