MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgగత కొంతకాలంగా తన సినిమాల విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న నాగార్జున ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపడే విధంగా మాస్ లుక్ తో కనిపిస్తూ ప్రారంభించిన ‘నా సామిరంగ’ సినిమా అనౌన్స్ మెంట్ గ్లిమ్స్ విడుదలైన కొద్ది సేపటికే మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని నాగేశ్వరరావు జీవించి ఉన్న రోజులలో నటించిన సినిమాలోని పాటను తన సినిమా టైటిల్ గా నాగార్జున మార్చుకున్నాడు. ఈమూవీతో విజయ్ బిన్నీ ను దర్శకుడిగా నాగ్ పరిచయం చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం సంక్రాంతి రేస్ కు విడుదల కాబోతున్న ఈమూవీ మలయాళంలో సూపర్ హిట్టయిన ‘పొరnagarjuna{#}prasanna;Mass;Audience;Remake;Akkineni Nagarjuna;Darsakudu;Makar Sakranti;Akkineni Nageswara Rao;Joseph Vijay;News;Director;Cinemaనా సామిరంగ వెనుక కధ !నా సామిరంగ వెనుక కధ !nagarjuna{#}prasanna;Mass;Audience;Remake;Akkineni Nagarjuna;Darsakudu;Makar Sakranti;Akkineni Nageswara Rao;Joseph Vijay;News;Director;CinemaMon, 04 Sep 2023 08:29:19 GMTగత కొంతకాలంగా తన సినిమాల విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న నాగార్జున ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపడే విధంగా మాస్ లుక్ తో కనిపిస్తూ ప్రారంభించిన ‘నా సామిరంగ’ సినిమా అనౌన్స్ మెంట్ గ్లిమ్స్ విడుదలైన కొద్ది సేపటికే మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని నాగేశ్వరరావు జీవించి ఉన్న రోజులలో నటించిన సినిమాలోని పాటను తన సినిమా టైటిల్ గా నాగార్జున మార్చుకున్నాడు. ఈమూవీతో విజయ్ బిన్నీ ను దర్శకుడిగా నాగ్ పరిచయం చేస్తున్నాడు.



వచ్చే సంవత్సరం సంక్రాంతి రేస్ కు విడుదల కాబోతున్న ఈమూవీ మలయాళంలో సూపర్ హిట్టయిన ‘పొరింజు మరియమ్ జోస్’ కు రీమేక్. వాస్తవానికి ఈ మూవీ కథను నాగార్జున దగ్గరికి తీసుకువెళ్ళి నాగ్ సలహాలకు అనుగుణంగా ఈ మూవీ స్క్రిప్ట్ ను తయారు చేసింది రైటర్ ప్రసన్న. ‘ధమాకా’ మూవీ కథను సమకూర్చిన ప్రసన్న ఆమూవీ ఘన విజయం తరువాత పాపులర్ రైటర్ గా మారిపోయాడు.



వాస్తవానికి ఈసినిమాకు దర్శకత్వం అతడే వహిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే అతడి స్థానంలో కొత్త దర్శకుడు బిన్నీ వచ్చి చేరడం వెనుక చాల కథ నడిచింది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసినిమా రీమేక్ విషయంలో రైటర్ ప్రసన్నకు నాగార్జునకు అదేవిధంగా ఈమూవీ నిర్మాతకు చిన్న గ్యాప్ ఏర్పడటంతో ప్రసన్న స్థానంలో బిన్నీ వచ్చి చేరాడు అని అంటున్నారు. గతంలో నాగార్జున అనేకమంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి వారితో హిట్స్ కొట్టిన సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను నాగ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు అనుకోవాలి.



ఈసినిమాకు సంబంధించి విడుదలైన టైటిల్ గ్లిమ్స్ ను చూసినవారు ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్న నాగార్జునను ఈనాటితరం ప్రేక్షకులు ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అన్న సందేహాలను కొందరు వ్యక్తపరుస్తున్నారు. గతంలో సంక్రాంతి సీజన్ కు విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయన’ ‘బంగార్రాజు’ సినిమాలు నాగార్జునకు హిట్ ను ఇచ్చాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను నమ్ముకుని నాగ్ మరొకసారి గట్టి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవాలి..    





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీర పైటను పక్కకు జరిపి ఏద మరియు నడుమందాలతో అలరిస్తున్న శ్రేయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>