MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gadar-2-movie-created-number-one-record-in-bollywoodf07944a4-9838-41f7-9b07-5e93caa7bda7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gadar-2-movie-created-number-one-record-in-bollywoodf07944a4-9838-41f7-9b07-5e93caa7bda7-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ డైరెక్టర్ అనిల్ శర్మ దర్శకత్వం వహించిన 'గదర్ 2' సినిమా దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది.బాలీవుడ్ లో చాలా ఫాస్ట్ గా 500 కోట్లు వసూలు చేసిన సినిమాగా గదర్ 2 నిలిచింది.సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్, సీనియర్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ నటించిన ఈ మూవీ మూడు వారాలకు పైగా థియేటర్లలో మంచి విజయవంతమైన రన్‌ను కొనసాగిస్తుంది.రూ.40 కోట్లతో నిర్మించబడ్డ ఈ చిత్రం రూ.8 కోట్లతో 24వ రోజుకి అడుగుపెట్టింది. ప్రారంభ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం తన స్థిరమైన ప్రదర్శనను కొGADAR 2{#}Akshay Kumar;Rajamouli;INTERNATIONAL;Sardar Vallabhai Patel;Ayushman Khurana;Chitram;Heroine;september;Director;Hero;bollywood;Cinemaబాలీవుడ్ లో నెంబర్ వన్ గా గదర్ 2 రికార్డ్?బాలీవుడ్ లో నెంబర్ వన్ గా గదర్ 2 రికార్డ్?GADAR 2{#}Akshay Kumar;Rajamouli;INTERNATIONAL;Sardar Vallabhai Patel;Ayushman Khurana;Chitram;Heroine;september;Director;Hero;bollywood;CinemaMon, 04 Sep 2023 18:30:00 GMTబాలీవుడ్ డైరెక్టర్ అనిల్ శర్మ దర్శకత్వం వహించిన 'గదర్ 2' సినిమా దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది.బాలీవుడ్ లో చాలా ఫాస్ట్ గా 500 కోట్లు వసూలు చేసిన  సినిమాగా గదర్ 2 నిలిచింది.సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్, సీనియర్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ నటించిన ఈ మూవీ మూడు వారాలకు పైగా థియేటర్లలో మంచి విజయవంతమైన రన్‌ను కొనసాగిస్తుంది.రూ.40 కోట్లతో నిర్మించబడ్డ ఈ చిత్రం  రూ.8 కోట్లతో 24వ రోజుకి అడుగుపెట్టింది. ప్రారంభ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం తన స్థిరమైన ప్రదర్శనను కొనసాగిస్తూ సెప్టెంబర్ 3న కూడా రూ. 8 కోట్లకు పైగా వసూలు చేసింది.ఇక 'గదర్ 2' బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ 'జైలర్', అక్షయ్ కుమార్ 'OMG 2' సినిమాలకి గట్టి పోటీని ఇచ్చింది. ఇంకా అలాగే, ఆయుష్మాన్ ఖురానా 'డ్రీమ్ గర్ల్ 2' ఆగస్టు 25న విడుదలైంది. అయితే, అది సన్నీ సినిమాపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 'గదర్ 2'.. 24వ రోజు భారతదేశంలో మొత్తం రూ. 8.50 కోట్ల నికరాన్ని రాబట్టింది. దీంతో ఇప్పుడు ఇండియాలో 'గదర్ 2' సినిమా వసూళ్లు రూ. 501.87 కోట్లకు చేరుకుంది.


అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న బాలీవుడ్ సినిమాగా ఈ సినిమా నిలిచింది. ఇక 'గదర్ ౨' కూడా అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.650 కోట్లు దాటింది.SS రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి 2 ది కన్‌క్లూజన్' (2017) ఇంకా షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్‌'లు రూ.500 కోట్ల నెట్ క్లబ్‌లో (హిందీలో) ప్రవేశించిన  చిత్రాలుగా ఉన్నాయి.ఇప్పుడు వాటికంటే ఫాస్ట్ గా ఈ ఘనత అందుకున్న చిత్రంగా 'గదర్ 2' నిలిచింది. ఇంతకుముందు, 'పఠాన్' మొత్తం 28 రోజుల్లో రూ. 500 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన మొదటి చిత్రంగా నిలిచింది. పఠాన్ కి ముందు 'బాహుబలి 2'.. 34 రోజుల్లో 500 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసి టాప్ లో ఉంది. తరువాత చాలా ఏళ్ళు తరువాత పఠాన్ ఆ రికార్డుని బద్దలు కొట్టగా కేవలం సంవత్సరం తిరగకుండానే గదర్ 2 సినిమా ఆ రికార్డుని బద్దలు కొట్టి టాప్ లో నిలిచింది.దీన్ని బట్టి కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఎంత చిన్న సినిమా అయినా రికార్డులు బద్దలు కొడుతుందని గదర్ 2 నిరూపించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రెడ్ డ్రస్ లో ఎద అందాలతో మీనాక్షి చౌదరి విజువల్ ట్రీట్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>