EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/yellow-media69e2a835-9a34-47f7-82c4-8ab4e037e5e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/yellow-media69e2a835-9a34-47f7-82c4-8ab4e037e5e8-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎల్లో మీడియా విషం చిమ్ముతూనే ఉంది. మొన్నటి వరకు పెట్టుబడులు రావడం లేదు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని ప్రచారం చేశారు. పాలన చేతగాకే అసలు రాష్ట్రానికి ఎలాంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రావడం లేదని రాసుకొచ్చారు. కానీ అవే కంపెనీలు పెట్టుబడులు వస్తుంటే మాత్రం ఇప్పుడు ప్రజలకు తెలియనీయకుండా ఆ వార్తలను రాయడం లేదు. మంచి జరిగితే మాత్రం ప్రజల వద్దకు ఆ వార్తల్ని చేర్చడం లేదు. చెడు జరిగినా.. ఏం జరగకపోయినా దాన్ని బూతద్ధంలో చూపిస్తూ ప్రజల్లోకి తీసుకెళుతున్yellow media{#}Vijayawada;Vishakapatnam;Amaravati;CBN;Hyderabad;Capital;media;central government;Andhra Pradesh;Governmentఎల్లో మీడియా ఈ విషయం ఎందుకు రాయదు?ఎల్లో మీడియా ఈ విషయం ఎందుకు రాయదు?yellow media{#}Vijayawada;Vishakapatnam;Amaravati;CBN;Hyderabad;Capital;media;central government;Andhra Pradesh;GovernmentMon, 04 Sep 2023 10:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎల్లో మీడియా విషం చిమ్ముతూనే ఉంది. మొన్నటి వరకు పెట్టుబడులు రావడం లేదు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని ప్రచారం చేశారు. పాలన చేతగాకే అసలు రాష్ట్రానికి ఎలాంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రావడం లేదని రాసుకొచ్చారు. కానీ అవే కంపెనీలు పెట్టుబడులు వస్తుంటే మాత్రం ఇప్పుడు ప్రజలకు తెలియనీయకుండా ఆ వార్తలను రాయడం లేదు. మంచి జరిగితే మాత్రం ప్రజల వద్దకు ఆ వార్తల్ని చేర్చడం లేదు.


చెడు జరిగినా.. ఏం జరగకపోయినా దాన్ని బూతద్ధంలో చూపిస్తూ ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఆంధ్రకి ఒక్క పైసా పెట్టుబడి రావడం లేదు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కు దాదాపు ఈ ఆరు నెలల కాలంలోనే  రూ. 740 కోట్ల విదేశీ పెట్టుబడులు (ఎఫ్ డీఐ) వచ్చాయి. అయితే దీని గురించి ఎక్కడా రాయరు. రాసినా తెలంగాణతో పోల్చి రాస్తారు. తెలంగాణకు ఆంధ్ర కంటే ఎక్కువగానే వచ్చాయని రాసుకొస్తారు. అయితే ఇలాంటి సందర్భంలోనే తెలంగాణకు ప్రపంచ స్థాయి రాజధాని ఉన్న విషయాన్ని మరిచిపోతారు.


ఆంధ్రకు అమరావతి అనే ఏమీ లేని రాజధానిని చూపించింది చంద్రబాబు అని చెప్పరు. అదే వైజాగ్ కానీ విజయవాడ గానీ ఉంటే కాసింతైనా మేలు జరిగే ఉండేదని మాత్రం చెప్పరు. అమరావతిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చంద్రబాబు నాయుడు ఏమైనా తీసుకొచ్చారా? అంటే అదీ లేదు. చంద్రబాబు హయాంలో ఎఫ్ డీఐలు విశాఖకు మాత్రమే వచ్చాయి. అమరావతికి రాలేదన్న విషయాన్ని మాత్రం ఎల్లో మీడియా ఎక్కడా చూపించడం లేదు.


ఎఫ్ డీఐలు రావాలంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్రలో హైదరాబాద్ లాంటి ఒక మంచి నగరాన్ని ఎందుకు తయారు చేయలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. అమరావతి రాజధాని అనగానే చంద్రబాబు హయాంలో ఎఫ్ డీఐలు తగ్గిన మాట వాస్తవం. కానీ దాన్ని ఎల్లో మీడియా మాత్రం ఎవరికీ తెలియనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీర పైటను పక్కకు జరిపి ఏద మరియు నడుమందాలతో అలరిస్తున్న శ్రేయ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>