DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/tdpc92386d1-c5a1-4ba9-8043-0540f0fb0a65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/tdpc92386d1-c5a1-4ba9-8043-0540f0fb0a65-415x250-IndiaHerald.jpgఉదయం లేచిన నుంచి ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కారుపై రెండు ప్రధాన పత్రికలు రోజు వ్యతిరేక వార్తలు రాయనిదే వాటికి పూట గడవని పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రావడం లేదు. చంద్రబాబు ఉన్నపుడు ఆయా విదేశీ కంపెనీలు ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పుడేమో అస్సలు రావడం లేదు. దీనికి జగన్ నిర్లక్ష్యం కారణమని దుమ్మెత్తి పోశాయి. చంద్రబాబు టైంలో ఉన్నదాంట్లో ఎంతో మంది పారిశ్రామిక వేత్తలతో పెట్టుబడుల గురించి చర్చించి రాష్ట్రానికి లాభం చేకూర్చాలని ఆయన పని చేసేవారtdp{#}Corporate;Maharashtra;CBN;Government;Industries;News;Andhra Pradesh;CM;media;Jaganఆంధ్రాకు పరిశ్రమలు వద్దంటున్న ఎల్లో మీడియా?ఆంధ్రాకు పరిశ్రమలు వద్దంటున్న ఎల్లో మీడియా?tdp{#}Corporate;Maharashtra;CBN;Government;Industries;News;Andhra Pradesh;CM;media;JaganSun, 03 Sep 2023 08:30:00 GMTఉదయం లేచిన నుంచి ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కారుపై రెండు ప్రధాన పత్రికలు రోజు వ్యతిరేక వార్తలు రాయనిదే వాటికి పూట గడవని పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రావడం లేదు. చంద్రబాబు ఉన్నపుడు ఆయా విదేశీ కంపెనీలు ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పుడేమో అస్సలు రావడం లేదు. దీనికి జగన్ నిర్లక్ష్యం కారణమని దుమ్మెత్తి పోశాయి.


చంద్రబాబు టైంలో ఉన్నదాంట్లో ఎంతో మంది పారిశ్రామిక వేత్తలతో పెట్టుబడుల గురించి చర్చించి రాష్ట్రానికి లాభం చేకూర్చాలని ఆయన పని చేసేవారని రాసేవారు. అయితే జగన్ వివిధ కార్పొరేట్ సంస్థలను ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు పిలిస్తే మాత్రం రాష్ట ఖాజానాను దోచిపెడుతున్నారు. రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని విషపు వార్తలు రాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదానీ సంస్థలు ప్రముఖ కంపెనీలతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.


గుజరాత్, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ ను తమ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు రెండో ప్లేస్ గా అదానీ సంస్థలు ఎంచుకుంటున్నాయి. దీని ద్వారా రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలతో ఎంతో లాభం చేకూరుతుంది. ఎందరికో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రంలో ఉపాధి పెరుగుతుంది. ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎల్లో మీడియాకు మాత్రం ఇవేవీ కనిపించడం లేదు. ఎందుకంటే చంద్రబాబు ఇవేమీ చేయడం లేదు.


సీఎం జగన్ పై ఉన్న కోపంతోనే ఎల్లో మీడియా ఇలా కావాలనే దుష్ప్రచారం చేస్తుంది. కానీ ఇలా రాయడం వల్ల వచ్చే పెట్టుబడులపై ప్రభావం చూపి అది  రాష్ట్రానికి కూడా కీడు చేస్తుందని మాత్రం ఆలోచించడం లేదు. ప్రజా వ్యతిరేక విధానాలుగా వార్తలు రాయడం వల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోవాల్సి వస్తుందని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏదేమైనా రాష్ట్రంలో మంచి పరిశ్రమలు వస్తే రాష్ట్రానికి లాభం చేకూరుతుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుండటం మంచి పరిణామమే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో బాగా ఇబ్బంది పెడుతున్న 'సలార్' మూవీ టీం....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>