LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/politics_latestnews/e-caplse37afc626-a97f-4cf7-a420-acddf6dd9637-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/politics_latestnews/e-caplse37afc626-a97f-4cf7-a420-acddf6dd9637-415x250-IndiaHerald.jpgమనకి ఆహారం నుంచి రకరకాల విటమిన్లు దొరకడం వల్ల మన ఆరోగ్యం సజావుగా ఉంటుంది.కేవలం ఆహారం ద్వారానే కాక కొన్ని రకాల విటమిన్ క్యాప్సిల్స్ రూపంలో కూడా మనకి లభిస్తూ ఉంటాయి.అలాంటి వాటిలో ముఖ్యంగా విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి.దీని ద్వారా మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.మరీ ముఖ్యంగా చర్మానికి,జుట్టుకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు.మనకి జుట్టు కానీ,చర్మం కానీ దెబ్బతిన్నట్టు అనిపిస్తే,విటమిన్ ఈ లేపనంగా వేసుకోవడం చాలా ఉత్తమం.విటమిన్ ఈ ఆయిల్ ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో మనము తెలుసుకొని వాడుదాం పదంE CAPLSE{#}Vitamin;oilవిటమిన్ ఈ క్యాప్సిల్ ద్వారా ఇన్ని ప్రయోజనాలా..!విటమిన్ ఈ క్యాప్సిల్ ద్వారా ఇన్ని ప్రయోజనాలా..!E CAPLSE{#}Vitamin;oilSun, 03 Sep 2023 19:00:00 GMTమనకి ఆహారం నుంచి రకరకాల విటమిన్లు దొరకడం వల్ల మన ఆరోగ్యం సజావుగా ఉంటుంది.కేవలం ఆహారం ద్వారానే కాక కొన్ని రకాల విటమిన్ క్యాప్సిల్స్ రూపంలో కూడా మనకి లభిస్తూ ఉంటాయి.అలాంటి వాటిలో ముఖ్యంగా విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి.దీని ద్వారా మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.మరీ ముఖ్యంగా చర్మానికి,జుట్టుకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు.మనకి జుట్టు కానీ,చర్మం కానీ దెబ్బతిన్నట్టు అనిపిస్తే,విటమిన్ ఈ లేపనంగా వేసుకోవడం చాలా ఉత్తమం.విటమిన్ ఈ ఆయిల్ ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో మనము తెలుసుకొని వాడుదాం పదండి..

స్ప్లీటెడ్ హెయిర్..

జుట్టు చివర్ల చిట్లడం వంటి వాటిని రిపేరు చేయడంలో విటమిన్ ఈ క్యాప్సిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనికోసం రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని,అందులో విటమిన్ ఈ క్యాప్సిల్ కలిపి మాడుకు బాగా మసాజ్ చేసుకోవాలి.ఇలా చేయడం ద్వారా జుట్టుకి మంచి పోషణ అంది,జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి.మరియు ముందుగా చిట్లిన హెయిర్ కూడా రిపేర్ అవుతుంది.

పొడిచర్మం పోగొట్టుకోవడానికి..

చాలామంది చర్మం పొడిపొడిగా ఉండి,పాలిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది.అలాంటి వారికి విటమిన్ ఈ క్యాప్సిల్ చాలా బాగా ఉపయోగపడతాయి.దీనికోసం రెండు టీ స్పూన్ల పాలల్లో విటమిన్ ఈ క్యాప్సిల్ వేసి బాగా కలిపి,ఆ పాలతో ముఖాన్ని తరచూ శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం పొడిబారడం తగ్గిపోతుంది.

స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడానికి..

కడుపుతో ఉన్నవారికి డెలివరీ తర్వాత వారి పొట్టపై చారలు చారలుగా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతూ ఉంటాయి.అలాంటి స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడానికి విటమిన్ఆయిల్ తీసుకొని,మెల్లగా మర్దన చేసుకోవాలి.ఇలా ఒక నెలపాటు మర్దనా చేయడం వల్ల మెల్లమెల్లగా స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోతాయి.

చర్మంపై పొట్టును పోగొట్టుకోవడానికి..

కొంతమందికి వేళ్ళు,కాళ్ళు చర్మం పొట్టుపోట్టుగా లేచి పోతుంటుంది.అలాంటి వారు విటమిన్ ఈ క్యాప్సిల్ తో రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి,చేతులు,కాళ్లు మర్దన చేసుకోవడంతో చర్మంపై పొట్టుపోవడం తగ్గిపోతుంది.మరియు చర్మం హైడ్రెటెడ్ గా కూడా ఉంటుంది.

మొండి మచ్చలు పోగొట్టుకోవడానికి..

ముఖంపై సన్టాన్ మరియు మొటిమల వల్ల మొండిమచ్చలు తయారు అవుతూ ఉంటాయి.వీటిని పోగొట్టుకోవడానికి కూడా విటమిన్ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనికోసం విటమిన్ఆయిల్ తో శనగపిండి కలిపి,ముఖం శుభ్రం చేసుకుంటే, ఎటువంటి మచ్చలనైనా తొందరగా పోగొట్టుకోవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నడుము అందాలతో మాయ చేస్తున్న షాలిని పాండే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>