EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jobsee2ada4d-fe28-4261-b6bf-8564294aa47f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jobsee2ada4d-fe28-4261-b6bf-8564294aa47f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సచివాలయ ఉద్యోగాల పేరుతో దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అంతే కాకుండా వారిని పర్మినెంట్ చేస్తూ ఉత్తర్వులు కూడా వెలువరించారు. అయితే ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే కల. కానీ జగన్ అనేక ఉద్యోగాలు ఇస్తున్నారు. ఔట్ సోర్సింగ్ కింద డాక్టర్లను నియమిస్తున్నారు. దాదాపు 500 మందిని నియమించారు. తాజాగా 598 వరకు గ్రూపు ఉద్యోగాలు ఇస్తున్నారు. అయితే చంద్రబాబు హయాంలో కంటే జగన్ చాలా ఎక్కువగానే ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానJOBS{#}job;Jagan;police;January;CM;CBNజగన్‌ ఉద్యోగాలు భేష్‌.. మరి ఆ హామీ సంగతేంటి?జగన్‌ ఉద్యోగాలు భేష్‌.. మరి ఆ హామీ సంగతేంటి?JOBS{#}job;Jagan;police;January;CM;CBNSun, 03 Sep 2023 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సచివాలయ ఉద్యోగాల పేరుతో దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అంతే కాకుండా వారిని పర్మినెంట్ చేస్తూ ఉత్తర్వులు కూడా వెలువరించారు. అయితే ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే కల. కానీ జగన్ అనేక ఉద్యోగాలు ఇస్తున్నారు. ఔట్ సోర్సింగ్ కింద డాక్టర్లను నియమిస్తున్నారు. దాదాపు 500 మందిని నియమించారు. తాజాగా 598 వరకు గ్రూపు ఉద్యోగాలు ఇస్తున్నారు.  


అయితే చంద్రబాబు హయాంలో కంటే జగన్ చాలా ఎక్కువగానే ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన ఇచ్చిన హామీలే బాగా అతిశయోక్తిగా ఉన్నాయి ఏడాదికి ఒక సారి జాబ్ క్యాలెండర్ పెడతామని దానికనుగుణంగా రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు.


దీంట్లో భాగంగా ప్రతి ఏటా జనవరి ఆరంభంలో నోటిఫికేషన్ ఇచ్చి అదే సంవత్సరం ఉద్యోగాల భర్తీ అనే విషయాన్ని జగన్ మరిచిపోయారు. మెగా డీఎస్సీ వేస్తామని హామీ ఇచ్చినా సీఎం జగన్ దాన్ని మరిచిపోయారు. పోలీసు ఉద్యోగాల విషయంలో కూడా జగన్ మాట తప్పారు. ప్రతి ఏటా 15 వేల పోలీసు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా ఆయన దాన్ని కూడా తప్పారు. అయితే ఈ మూడింటి విషయంలో ఎలా ఉన్నా ఓవరాల్ గా చూస్తే మాత్రం చంద్రబాబు కంటే సీఎం జగన్ నే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు.


అయితే ఇంకా ఎన్నో నోటిఫికేషన్లు రావాల్సిన అవసరం ఉంది. డీఎస్సీ కోసం నిరుద్యోగ అభ్యర్థులు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. పోలీసుల ఉద్యోగాలు కూడా వేయాల్సిన అవసరముంది. సచివాలయ ఉద్యోగాలు తప్పా మిగతా వేరే విభాగాల్లో చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి. వాటిని గుర్తించి ఆయా విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరముంది. అయితే ఇవన్నీ ఎలక్షన్ టైం వరకు వచ్చే అవకాశముంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో బాగా ఇబ్బంది పెడుతున్న 'సలార్' మూవీ టీం....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>