PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/top-congress-leaders-not-visiting-idupulapaya-for-sharmila-f9f74af7-c567-48f2-8201-1faa7600a0cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/top-congress-leaders-not-visiting-idupulapaya-for-sharmila-f9f74af7-c567-48f2-8201-1faa7600a0cd-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయటం ఖాయమైపోయింది. ఈనెల 6వ తేదీన ఢిల్లీలో విలీన ప్రక్రియ లాంఛనంగా జరగబోతోందని పార్టీవర్గాలు చెప్పాయి. అయితే పార్టీవర్గాలు చెప్పిన మరో విషయం ఏమిటంటే షర్మిల పోటీకి దూరంగా ఉంటారట. ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్ హోదాలో రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ విషయం సోనియా గాంధి, రాహుల్ గాంధీల భేటీలో చర్చకు వచ్చిందని సమాచారం. ys sharmila telangana palair tummala{#}Sharmila;Khammam;Revanth Reddy;Karnataka;SoniaGandhi;rahul;Rahul Sipligunj;District;Parliament;Congress;Partyహైదరాబాద్ : అప్పుడే షర్మిలపై తుమ్మల ఎఫెక్టుపడిందా ?హైదరాబాద్ : అప్పుడే షర్మిలపై తుమ్మల ఎఫెక్టుపడిందా ?ys sharmila telangana palair tummala{#}Sharmila;Khammam;Revanth Reddy;Karnataka;SoniaGandhi;rahul;Rahul Sipligunj;District;Parliament;Congress;PartySun, 03 Sep 2023 09:00:00 GMT



తెలంగాణాలో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయటం ఖాయమైపోయింది. ఈనెల 6వ తేదీన ఢిల్లీలో  విలీన ప్రక్రియ లాంఛనంగా జరగబోతోందని పార్టీవర్గాలు చెప్పాయి. అయితే పార్టీవర్గాలు చెప్పిన మరో విషయం ఏమిటంటే షర్మిల పోటీకి దూరంగా ఉంటారట. ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్ హోదాలో రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ విషయం సోనియా గాంధి, రాహుల్ గాంధీల భేటీలో చర్చకు వచ్చిందని సమాచారం.





షర్మిల సేవలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతా ఉపయోగించుకోవాలని అనుకుంటోందట. అందుకనే పోటీపేరుతో ఒక నియోజకవర్గానికి పరిమితం కాకుండా స్టార్ క్యాంపెయినర్ హోదాలో రాష్ట్రమంతా తిరగాలని సోనియా, రాహుల్ చెబితే అందుకు షర్మిల అంగీకరించారని పార్టీవర్గాల సమాచారం. అంటే రాబోయే ఎన్నికల్లో షర్మిల ఎక్కడా పోటీచేయటంలేదని అర్ధమవుతోంది. ఖమ్మంజిల్లాలోని పాలేరులో పోటీ చేయబోతున్నట్లు స్వయంగా షర్మిలే చెప్పారు. అందుకు వీలుగా పాలేరులో పార్టీ ఆఫీసుతో పాటు క్యాంపాఫీసును కూడా కట్టుకుంటున్నారు.





అయితే మారిన పరిస్ధితుల్లో  షర్మిల ఆలోచన మార్చుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావే అని తెలుస్తోంది. బీఆర్ఎస్ తరపున పాలేరులో పోటీకి తుమ్మలకు అవకాశం దక్కలేదు. దాంతో పార్టీలో నుండి బయటకు వచ్చేయబోతున్నారు. దీంతో కాంగ్రెస్ లో చేరమని తుమ్మలను హస్తం నేతలు అడిగారు. తుమ్మలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. పాలేరులో టికెట్ ఇస్తేనే తాను కాంగ్రెస్ లో చేరుతానని స్పష్టంగా చెప్పారు. షర్మిలతో పోల్చుకుంటే తుమ్మల చాలా గట్టి నేతనే చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా తుమ్మలకు బలమైన అనుచరులున్నారు.





అన్నీ ఆలోచించిన తర్వాతే కాంగ్రెస్ అధిష్టానం పాలేరులో తుమ్మలకు టికెట్ ఇవ్వటానికి దాదాపు రెడీ అయ్యింది. అందుకనే స్టార్ క్యాంపెయినర్ పేరుతో షర్మిలను పోటీకి దూరంగా పెట్టేస్తున్నట్లున్నారు. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లేదా ఖమ్మం నియోజకవర్గంలో పోటీచేస్తారా లేకపోతే గతంలో ప్రచారం జరిగినట్లు కర్నాటక కోటాలో రాజ్యసభకు పంపుతారా అన్నది చూడాలి. ఏదేమైనా విలీనం జరగకుండానే షర్మిలపై తుమ్మల దెబ్బ పడినట్లు అర్ధమవుతోంది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో బాగా ఇబ్బంది పెడుతున్న 'సలార్' మూవీ టీం....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>