EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan79dfcc79-f9c9-4236-a269-542f9c750dff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan79dfcc79-f9c9-4236-a269-542f9c750dff-415x250-IndiaHerald.jpgవైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ సీఎం కావాలని 154 మంది సంతకాలు పెట్టారు. అయితే తీరా చూస్తే దానికి అధిష్టానం ఒప్పుకోలేదు. సంతకాలు పెట్టిన వారిలో ముందు వరుసలో పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం దీనికి అంగీకరించ లేదు. దీంతో రోశయ్యను ముఖ్యమంత్రి చేసింది. దీంతో జగన్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ దెబ్బతీస్తాడోనని జగన్ నే కాంగ్రెస్ దెబ్బతీసింది. కేసులు పెట్టి మరీ జైలుకు పంపించింది. అనంతరం రాష్ట్ర విభజన ఉద్యమాలు వచ్చాయి. ఆ సమయంలో రాష్ట్రంలో మంత్రిగా ఉన్న పిలJAGAN{#}chandra bose;chandrabose;dr rajasekhar;Pilli Subhash Chandra Bose;BOTCHA SATYANARAYANA;రాజీనామా;Subhas Chandra Bose;Hanu Raghavapudi;Telangana Chief Minister;Jagan;MLA;Congress;Surveyఆ సీటు ఎవరికి.. తేల్చుకోలేకపోతున్న జగన్‌?ఆ సీటు ఎవరికి.. తేల్చుకోలేకపోతున్న జగన్‌?JAGAN{#}chandra bose;chandrabose;dr rajasekhar;Pilli Subhash Chandra Bose;BOTCHA SATYANARAYANA;రాజీనామా;Subhas Chandra Bose;Hanu Raghavapudi;Telangana Chief Minister;Jagan;MLA;Congress;SurveySun, 03 Sep 2023 07:00:00 GMTవైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ సీఎం కావాలని 154 మంది సంతకాలు పెట్టారు. అయితే తీరా చూస్తే దానికి అధిష్టానం ఒప్పుకోలేదు. సంతకాలు పెట్టిన వారిలో ముందు వరుసలో పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం దీనికి అంగీకరించ లేదు. దీంతో రోశయ్యను ముఖ్యమంత్రి చేసింది.


దీంతో జగన్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ దెబ్బతీస్తాడోనని జగన్ నే కాంగ్రెస్ దెబ్బతీసింది. కేసులు పెట్టి మరీ జైలుకు పంపించింది. అనంతరం రాష్ట్ర విభజన ఉద్యమాలు వచ్చాయి. ఆ సమయంలో రాష్ట్రంలో మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. దీంతో ఆయనపై జగన్ కు ఎనలేని అభిమానం వచ్చింది.


అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో రెండు సార్లు పిల్లి సుభాష్ ఓడిపోయారు. 2014 లో ఓడిపోయారు. 2019 లో ఆయనకు టికెట్ ఇవ్వలేరు. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ మాత్రం తన కొడుక్కి టికెట్ ఇవ్వమని అడుగుతున్నారు. దీంతో మొత్తం రసకందాయంలో పడింది. కానీ జగన్ మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యే చల్లమనేనికి ఇవ్వాలని అనుకుంటున్నాడు. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోసును సర్దుకుపోవాలని జగన్ కోరితే కాదు నియోజకవర్గంలో కావాలంటే సర్వే చేయించండి ఆ తర్వాత మీరు టికెట్ కన్పర్మ్ చేయండని అడిగారని సమాచారం.


అనంతరం చేసిన సర్వే రిపోర్టు వచ్చిందని ఇందులో పిల్లి సుభాష్ కొడుకు కు టికెట్ వచ్చేసినట్లేనని ఆయన భావిస్తున్నారు. కానీ చెల్లుబోయినకు ఇస్తే మాత్రం గ్రౌండ్ లో పిల్లి సుభాష్ సపోర్టు చేయనని చెప్పినట్లు తెలుస్తుంది. కాబట్టి ముందు చూస్తే గొయ్యి... వెనక చూస్తే నుయ్యి అన్న చందంగా మారింది జగన్ పరిస్థితి. ఇటు ప్రస్తుత ఎమ్మెల్యేను కాదనలేని పరిస్థితి. అటు పిల్లిని కూడా కాదనలేని పరిస్థితి నెలకొంది. మరి టికెట్ ఎవరికి దక్కుతుందో ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో బాగా ఇబ్బంది పెడుతున్న 'సలార్' మూవీ టీం....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>