HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/brain-speed55fe967e-bb2c-448e-97e9-3f4cb760ca5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/brain-speed55fe967e-bb2c-448e-97e9-3f4cb760ca5e-415x250-IndiaHerald.jpgమన శరీరంలోని ప్రతి అవయవం మెదడు అందించే సంకేతాల పైన ఆధారపడి పని చేస్తుంది అని అందరికీ తెలిసిందే. అందుకే మెదడు బాగా పనిచేస్తే మంచి నిర్ణయాలను తీసుకోవడానికి కూడా వీలుంటుంది. అలాగే ఎన్ని పనులైనా సరే చక్కగా సంతోషంగా చేసుకోవచ్చు. ఒకవేళ మెదడు పనితీరులో ఇబ్బందులు ఏర్పడితే మాత్రం మనం చేసే పనిలో కూడా మనకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి. ఏ పని కూడా సక్రమంగా చేయలేము. అయితే మెదడు యొక్క పనితీరు వేగం పెరగాలి అంటే ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఈ ఆహార పదార్థాలు తినడం వల్ల జBRAIN;SPEED{#}Vitamin;Almonds;Manamమెదడు వేగంగా పని చేయాలంటే ఇలా చేయండి..!మెదడు వేగంగా పని చేయాలంటే ఇలా చేయండి..!BRAIN;SPEED{#}Vitamin;Almonds;ManamSat, 02 Sep 2023 06:00:00 GMTమన శరీరంలోని ప్రతి అవయవం మెదడు అందించే సంకేతాల పైన ఆధారపడి పని చేస్తుంది అని అందరికీ తెలిసిందే. అందుకే మెదడు బాగా పనిచేస్తే మంచి నిర్ణయాలను తీసుకోవడానికి కూడా వీలుంటుంది. అలాగే ఎన్ని పనులైనా సరే చక్కగా సంతోషంగా చేసుకోవచ్చు. ఒకవేళ మెదడు పనితీరులో ఇబ్బందులు ఏర్పడితే మాత్రం మనం చేసే పనిలో కూడా మనకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి. ఏ పని కూడా సక్రమంగా చేయలేము. అయితే మెదడు యొక్క పనితీరు వేగం పెరగాలి అంటే ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.

ఈ ఆహార పదార్థాలు తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అమెరికాలోని హార్డ్ వర్క్ మెడికల్ కాలేజీకి చెందిన న్యూట్రిషన్ సైకాలజిస్టులు తాజాగా ఈ విషయాలను వెల్లడించారు. సాధారణంగా మెదడు,  పేగులు ఒకే కణాల నుంచి తయారవుతాయని.. అందుకే తీసుకునే ఆహారాన్ని బట్టి మెదడు పనితీరు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆకలి నియంత్రణ ఇతర జీవక్రియలకు సంబంధించిన 90% హార్మోన్స్ పేగుల్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అందుకే మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి.


మెదడు పనితీరు పెరగాలి అంటే విటమిన్ బి ,విటమిన్ బి 9 ,విటమిన్ బి12 తోపాటు పసుపు, పెరుగు వంటివి తీసుకోవాలి. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. అలాగే వాల్నట్స్ తీసుకుంటూ ఉంటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇక పచ్చి బఠానీలు,  పాలు , డార్క్ చాక్లెట్,  తృణ ధాన్యాలు వంటివి తరచూ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.  ఇక సాధ్యమైనంత వరకు బాదం తోపాటు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ గింజలను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు వేగవంతం అవుతుంది. అంతేకాదు ఆల్జీమర్స్ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. ఇలాంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మెదడు పనితీరు వేగవంతం అయ్యి అన్ని పనుల్లో మీరు హుషారుగా ఉంటారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నితిన్ తమ్ముడిలో ఒకప్పటి హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>